మతుకుమల్లి వెంకట సుబ్బారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముతుకుమల్లి వెంకట సుబ్బారావు
జననం(1921-05-04)1921 మే 4
యాజలి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
మరణం2006 ఫిబ్రవరి 15(2006-02-15) (వయసు 84)
ఎడ్మంటన్, కెనడా
రంగములుగణిత శాస్త్రము
చదువుకున్న సంస్థలుప్రెసిడెన్సీ కాలేజి, మద్రాసు,
పరిశోధనా సలహాదారుడు(లు)ఆర్.వైద్యనాథస్వామి
ఇతర విద్యా సలహాదారులుకె.ఆనందరావు
ప్రసిద్ధినంబర్ థియరీలో కృషి

మతుకుమల్లి వెంకట సుబ్బారావు (మే 4,1921 - ఫిబ్రవరి 15,2006) ఇండో కెనడా గణిత శాస్త్రవేత్త. ఆయన నంబర్ థియరీలో సుప్రసిద్ధులు. ఆయన కెనడాలో పూర్తిస్థాయిలో నివాసం ఉన్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో బాపట్లకు సమీపంలో గల యాజలి గ్రామంలో జన్మించారు. ఆయన 1941లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆయన రామస్వామి ఎస్. వైద్యనాథస్వామి గారి పర్యవేక్షణలో "ఫంక్షనల్ అనాలసిస్" పై డాక్టరేట్ పూర్తి చేసారు. ఆయన మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాల, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, మిస్సౌరీ విశ్వవిద్యాలయాలలో పనిచేసారు. ఆయన వృత్తి జీవితం గడిపిన "ఆల్బెట్రా విశ్వవిద్యాలయం"లో 1963 తర్వాత గడిపారు.[1]

గణిత శాస్త్రంలో కృషి[మార్చు]

1960లో ఆయన "పార్టిషన్ నంబర్ థియరీ" యొక్క "సర్వసమాన ధర్మములు", p (n, వంటి వాటిపై అధ్యయనం చేయుట ప్రారంభించారు.ఆయన "A, B పూర్ణ సంఖ్యలైతే ( 0 ≤ B < A),p(An+B) సరి సంఖ్య అయితే దానికి అనంతమైన అనేకమైన n విలువలు, బేసి సంఖ్య అయితే అనేక n విలువలు ఉంటాయని" ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదన ప్రయోగాత్మకంగా ఋజువు అయినది. "కెన్ ఒనో" అనే శాస్త్రవేత్త[2] సరిసంఖ్య అయిన సందర్భంలో పై ప్రతిపాదన ఎల్లప్పుడూ సత్యమని చూపాడు. బేసి విషయంలో n అనే సంఖ్యకు p (An+B) కూడా బేసిసంఖ్య.అందువలన దానికి అనంతమైన n విలువలు ఉంటాయి. సాధారణీకరించిన ప్రతిపాదనను "మోర్రిస్ న్యూమెన్" ప్రతిపాదించాడు.


కొన్ని ప్రచురణలు[మార్చు]

  • Straus, E. G.; Subbarao, M. V. (1974). "On exponential divisors". Duke Mathematical Journal. 41 (2): 465–471. doi:10.1215/S0012-7094-74-04152-0.

మూలాలు[మార్చు]

  1. Balasubramanian, R. (April 10, 2006). "Matukumalli Venkata Subbarao" (PDF). Current Science. Bangalore: Current Science Association. 90 (7): 1011. ISSN 0011-3891. Retrieved January 5, 2007.[permanent dead link]
  2. Ono, K. (1996). "Parity of the partition function in arithmetic progressions". Transactions of the American Mathematical Society. 472: 1–15.

ఇతర లింకులు[మార్చు]