మరియా రెస్సా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మరియా రెస్సా
Ressa in July 2011
జననం (1963-10-02) 1963 అక్టోబరు 2 (వయసు 60)
పౌరసత్వం
  • Philippines
  • United States
విద్య
వృత్తి
  • Journalist
  • author
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కో-ఫౌండింగ్ రాప్లర్
పురస్కారాలు

కలాన్నే ఆయుధంగా చేసుకొని చుట్టూ జరిగే అన్యాయాల్ని, అవినీతిని బట్టబయలు చేస్తూ, ప్రజలకు కనువిప్పు కలిగించే జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు.అలాంటి కోవలోకే చెందినవారు, ఫిలిప్పీన్స్‌కు చెందిన ప్రఖ్యాత జర్నలిస్ట్‌ మరియా రెస్సా. ప్రభుత్వ పాలనను ఎండగట్టడానికి, అధికార దుర్వినియోగం-హింసను రూపుమాపడానికి, తన కలాన్నే ఆయుధంగా మలచుకున్నారామె.భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ, ఉగ్రవాదాన్ని అణిచి ప్రపంచమంతా శాంతి నెలకొనేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు.ఇందుకు గాను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం గెలుచుకున్నారు.[1]

జననం[మార్చు]

మరియా రెస్సా 1963 వ సంవత్సరంలో మనీలాలో జన్మించింది.ఏడాది వయసున్నప్పుడే తన తండ్రి చనిపోవడంతో మరియా తల్లి ఆమెను, ఆమె సోదరిని తన పుట్టింట్లో వదిలి యూఎస్‌ఏ వెళ్లిపోయింది.అక్కడే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అప్పుడు మరియా వయసు పదేళ్లు.ఆ సమయంలోనే తన సోదరితో పాటు తననూ అమెరికా తీసుకెళ్లిపోయింది ఆమె తల్లి.దాంతో ఆ తర్వాత చదువంతా అక్కడే కొనసాగించింది మరియా.[2]

విద్యాభ్యాసం[మార్చు]

ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ నుంచి మాలిక్యులర్‌ బయాలజీ-థియేటర్‌లో యూజీ పూర్తి చేసిన మరియా ఇంగ్లిష్‌-థియేటర్‌ సర్టిఫికెట్స్‌-డ్యాన్స్‌ విభాగాల్లో బీఏ చదివింది. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే మరియా ఆ తర్వాత ‘ఫిలిప్పీన్స్‌ డిలిమన్‌ యూనివర్సిటీ’లో పొలిటికల్‌ థియేటర్‌ చదివేందుకు ‘ఫల్బ్రైట్ ఫెలోషిప్’ను గెలుచుకుంది.ఆ తర్వాతే తన పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించింది.

పాత్రికేయ ప్రస్థానం[మార్చు]

పాత్రికేయ ప్రస్థానాన్ని  ప్రారంభించిన తరువాత ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వ ఛానల్‌ PTV 4 లో తొలి ఉద్యోగంలో చేరారు.ఆపై CNN బ్యూరో చీఫ్‌గా సేవలందించింది.మరో పదేళ్ల పాటు CNN జకార్తా విభాగానికి బ్యూరో చీఫ్‌గా పనిచేశారు.ఈ క్రమంలో ఉగ్రవాదం, ఉగ్రవాదుల సంబంధాలపై పరిశోధనలు సాగించి ఆసియాలోనే మేటి ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టర్‌గా ఎదిగారు.[3]

రాప్లర్ డిజిటల్ మీడియా[మార్చు]

కాలక్రమేణా తన ఉద్యోగాలకు రాజీనామా చేసి 2012 వ సంవత్సరంలో మరో ముగ్గురు మహిళా జర్నలిస్టులతో కలిసి ‘రాప్లర్’ అనే డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థలో వంద మంది జర్నలిస్టులు పనిచేస్తున్నారు.అధికార దుర్వినియోగం, హింస, ప్రభుత్వపు లోటు పాట్లను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ముఖ్యోద్దేశంగా ముందుకు సాగుతోందీ డిజిటల్‌ ఛానల్‌.

రచయిత్రిగా[మార్చు]

అశాంతిని అణచివేసే క్రమంలో తన కలానికి పదును పెట్టిన మరియా, రచయిత్రిగానూ రాణించారు.ఈ క్రమంలో'సీడ్స్ ఆఫ్  టెర్రర్: అన్ ఐ విట్నెస్  అకౌంట్ ఆఫ్ అల్-కైదాస్ న్యూయెస్ట్ సెంటర్ (2003) ', 'ఫ్రమ్ బిన్ లాడెన్ టూ  ఫేస్బుక్: 10 డేస్ ఆఫ్  అబ్డక్షన్,10 ఇయర్స్ ఆఫ్ టెర్రరిజం (2013) ' వంటి పుస్తకాలను రాసారు.

టీచర్ గా గుర్తింపు[మార్చు]

మరోవైపు టీచింగ్‌ రంగంలోనూ తనదైన ముద్ర వేశారీ డేరింగ్‌ జర్నలిస్ట్‌.ఇందులో భాగంగానే ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో 'పాలిటిక్స్ అండ్ ది  ప్రెస్ ఇన్ సౌతీస్ట్ ఆసియా', ఫిలిప్పీన్స్‌ డిలిమన్‌ యూనివర్సిటీలో 'బ్రాడ్కాస్ట్ జర్నలిజం’.వంటి కోర్సుల్ని కూడా బోధించారు.

నోబెల్‌ శాంతి పురస్కారం[మార్చు]

భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.ఉగ్రవాదాన్ని అణిచి ప్రపంచమంతా శాంతి నెలకొనేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు.ఇందుకు ప్రతిగానే ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక శాంతి నోబెల్‌ పురస్కారం గెలుచుకున్నారు. రష్యాకు చెందిన మరో జర్నలిస్ట్‌ "దిమిత్రి మురాటోవ్‌" తో కలిసి ఈ అత్యున్నత అవార్డును పంచుకోనున్నారు.[4]

అవార్డులు[మార్చు]

  • ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజంలో తాను చేసిన కృషికి గుర్తింపుగా పలు అవార్డులు  అందుకున్నారు.ఎమ్మీకి కూడా నామినేట్‌ అయ్యారు.
  • అంతే కాకుండా  2018లో ‘టైమ్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా 2019లో టైమ్స్‌ పత్రిక విడుదల చేసిన ‘ప్రపంచంలోనే వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
  • ‘బీబీసీ 100 విమెన్‌’ లిస్ట్‌లోనూ స్థానం సంపాదించారు.
  • ఇక ఈ ఏడాదికి గాను  యునెస్కో పురస్కారంతో పాటు తాజాగా నోబెల్‌ శాంతి బహుమతి కూడా అందుకోనున్నారు.

మూలాలు[మార్చు]

  1. "Maria_Ressa".{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "కాల్పులు జరిపినా వెరవలేదు.. అందుకే ఈ నోబెల్! - meet the nobel peace prize winner maria ressa in telugu". www.eenadu.net. Retrieved 2021-10-11.
  3. "Nobel Peace Prize: Journalists Maria Ressa and Dmitry Muratov share award". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-10-08. Retrieved 2021-10-11.
  4. Ahmed, Syed (2021-10-08). "నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన- జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రీ మురాటోవ్ కు అవార్డు". telugu.oneindia.com. Retrieved 2021-10-11.