మల్లారం అడవి
మల్లారం అడవి | |
---|---|
Location | మల్లారం, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ |
Nearest city | నిజామాబాద్ |
Area | 204 హెక్టార్లు |
Governing body | తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ |
అధికారిక వెబ్సైటు |
మల్లారం అడవి, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ గ్రామీణ మండలంలోని మల్లారం గ్రామ సమీపంలో ఉన్న అడవి. ఇది నిజామాబాదు పట్టణం నుండి నుండి 7 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజథాని హైదరాబాదు నగరం నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1] ఇక్కడ చుక్కల జింకలు, లేళ్లు, సాంబార్‌లు, నీల్‌గాయ్‌లు, నెమళ్ళు మొదలైన వన్యప్రాణులు ఉన్నాయి.
ప్రత్యేకత
[మార్చు]పూర్తిగా చెట్లతో నిండివున్న ఈ దట్టమైన అడవి వలస పక్షులకు, జంతు జాతులకు నిలయంగా ఉంది. సహజమైన పరిసరాలతో, స్వచ్ఛమైన గాలితో, పక్షుల కిలకిలరావాలతో కూడిన పరిపూర్ణ విహారయాత్ర కేంద్రమిది. ఇక్కడ మల్లారం చెరువు కూడా ఉంది.[2]
ఆకర్షణలు
[మార్చు]ఇందులో అడవి మార్గాలు, ఒక గోపురం, ఒక దృశ్యకేంద్రమున్న టవర్, బౌద్ధ దేవాలయాలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. 1.45 బిలియన్ సంవత్సరాల పురాతనమైన పుట్టగొడుగు ఆకారంలో ఉండే శిల ఇక్కడ ఉంది. ఇది అడవుల్లో విహరించడానికి అనువైన ప్రదేశం.[3] మల్లారం అటవీప్రాంతం పర్యావరణ-పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయబడింది. కొండపై గుడిసెలు నిర్మించారు. పర్యాటకులు కొండపై ఉండటమే కాకుండా చుట్టుపక్కల దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
మూలాలు
[మార్చు]- ↑ "తెలంగాణలోని నిగూఢ రత్నాలు.. ఈ 8 దర్శనీయ ప్రాంతాలు..!". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-16. Archived from the original on 2022-01-25. Retrieved 2022-01-28.
- ↑ "పర్యాటకులను కట్టిపడేసే అందాలు చూసొద్దాం." Sakshi. 2019-09-27. Archived from the original on 2020-01-21. Retrieved 2022-01-28.
- ↑ "తెలంగాణ సిగలో నిజామాబాద్... | జరదేఖో | www.NavaTelangana.com". m.navatelangana.com. Archived from the original on 2022-01-28. Retrieved 2022-01-28.