మామిడి మౌనిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మామిడి మౌనిక

మామిడి మౌనిక[1] ప్రముఖ తెలంగాణ జానపద గాయని.[2] ఆమె పాడిన పాటలు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రాచూర్యం పొందాయి.[3] మామిడి మౌనికది జగిత్యాల జిల్లా చిన్నాపూర్ గ్రామం. తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. తల్లి బీడీలు చుడుతుంది. వాళ్ల మామయ్య కాసర్ల భీమయ్య పాడే పాటలను ఆమె చిన్నప్పటి నుంచి గమనించేది. అలా ఆమెకు చిన్నప్పటి నుంచే జానపదం మీద మక్కువ పెరిగింది. పాఠశాలలో ఏవైనా కార్యక్రమాలు ఉంటే తప్పకుండా ఒక పల్లె పాటను పాడేది. జానపద గేయ రచయిత, గాయకుడు మల్లిక తేజ్‌, కాసర్ల భీమయ్యల ప్రోత్సాహంతో 8వ తరగతిలో ఒక పాటకు కోరస్‌ ఇచ్చింది. క్రమంగా ఆమె కూడా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టింది.

విద్య[మార్చు]

మౌనిక జగిత్యాలలోని రామక్రిష్ణ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో బయోటెక్నాలజీ విభాగంలో బీఎస్సీ చేసింది. సైంటిస్ట్‌ అవ్వాలన్న లక్ష్యంతో ఆమె ఈ కోర్సులో చేరింది.

పేరు తెచ్చిన పాటలు[మార్చు]

'నేనొస్తా బావా మల్లన్నపేట'[4] పాటతో ఆమె జనాధరణ పొందింది. దీనిని స్వయంగా ఆమేనే రాసింది. ఆ తరువాత వచ్చిన 'మదన సుందారి'[5], 'సువ్వీ సువ్వన్నెల్లారా', 'ఉంగురం'[6], 'నెమళియ రాజ'[7].. ఇలా అనేక జానపద గేయాలు ఆమెకు పేరుప్రఖ్యాతులను తీసుకొచ్చాయి.

మూలాలు[మార్చు]

  1. Today, Telangana (2022-01-18). "YouTube sensations making waves in music". Telangana Today. Retrieved 2023-01-02.
  2. "YouTube sensations making waves in music - Telangana Today". web.archive.org. 2023-01-02. Archived from the original on 2023-01-02. Retrieved 2023-01-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "సోషల్ మీడియా స్టార్.. బతుకమ్మ పాటల గాయని మౌనిక నేపథ్యం ఏంటో తెలుసా?". BBC News తెలుగు. 2020-10-24. Retrieved 2023-01-02.
  4. Nenostha Bava New Folk Song 2019 #SvMallikteja #MamidiMounika #MvMusic, retrieved 2023-01-01
  5. MADHANA SUNDHARI NEW FOLK SONG 2019 #SVMALLIKTEJA #MAMIDIMOUNIKA #MVMUSIC, retrieved 2023-01-01
  6. UNGURAM NEW FOLK SONG 2021 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC, retrieved 2023-01-01
  7. NEMALEEYA RAJA NEW FOLK DJ SONG 2022 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC, retrieved 2023-01-01

వెలుపలి లంకెలు[మార్చు]