మీనా కుమారి(హిందీ నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీనా కుమారి
జననం
మహెజబీన్ బేనో

(1933-08-01)1933 ఆగస్టు 1
బాంబే అధ్యక్ష పదవి, బ్రిటిష్ ఇండియా
మరణం1972 మార్చి 31(1972-03-31) (వయసు 38)
మరణ కారణంసిర్రోసిస్
Burial placeరహమతాబాద్ స్మశానవాటిక, ముంబై, మహారాష్ట్ర
ఇతర పేర్లుట్రాజెడీ క్వీన్, మంజు, మీనాజీ, చైనీస్ డాల్, ఫిమేల్ గురు దత్, సిండ్రెల్లా ఆఫ్ ఇండియన్ సినిమాలు
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1939–1972
జీవిత భాగస్వామి
(m. 1952; వేరు. 1964)
Writing career
కలం పేరునాజ్
సంతకం

మీనా కుమారి (1 ఆగస్టు 1933 – 31 మార్చి 1972), ప్రముఖ భారతీయ నటి, గాయకురాలు, కవయిత్రి. ఆమె అసలు పేరు మహ్జబీన్ బనో. ఆమె నాజ్ అనే పేరుతో రచనలు చేసేది.[1][2]

మీనా కుమారిని భారతీయ సినిమాకి ట్రాజడీ క్వీన్ గా అభివర్ణిస్తారు.[3]  బాలీవుడ్లో అత్యంత గొప్ప నటీమణిగా ఆమె పేరు గాంచింది. తన చిన్నతనం నుంచీ చనిపోయే దాకా ఆమె 30 ఏళ్ళ కెరీర్ లో దాదాపు 90 సినిమాల్లో నటించింది ఆమె. ఆమె నటించిన వాటిలో ఎన్నో సినిమాలు క్లాసిక్ లుగా నిలవడం విశేషం. వాటిలో పాకీజా, సాహిబ్ బీబీ ఔర్ గులాం, మేరే అప్నే, ఆర్తీ, బైజు బవారా, పరిణీతా, దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయీ, ఫుట్ పాత్, చార్ దిల్ చార్ రహెన్, దేరా, అజాద్, మిస్ మేరీ, శారద, దిల్ ఏక్ మందిర్, కాజల్, చిరాగ్ కహాన్ రోషిణి కహాన్, మఝ్లీ దీదీద్, ఫూల్ ఔర్ పత్తర్, బాభీ కీ చుదియాన్, యహుది, హలకు, బాద్బాన్, కోహినూర్ వంటి సినిమాలు ఇప్పటి తరానికి కూడా తెలియడం విశేషం. మీనా కుమారి బాల నటిగా, గాయనిగా కూడా చేసింది. ఆ తరువాత దునియా ఏక్ సరై, పియా ఘర్ ఆజా, బిచ్చడే  బలాం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఆమె. 

మీనా జీవితచరిత్ర రాసిన వినోద్ మెహతాతో ఒక దర్శకుడు మాట్లాడుతూ ట్రాజడీ కింగ్ అయిన దిలీప్ కుమార్ కూడా ఆమెతో నటించేటప్పుడు ఆమె అంత బాగా చేయలేక ఇబ్బంది పడేవారు అన్నాడు.[4] ఆమెతో నటించేటప్పుడు రాజ్ కుమార్ డైలాగులు  మర్చిపోయేవాడట.[5] మధుబాల కూడా మీనా కుమారి అభిమాని.  ఆమె మీనాకుమారి గురించి మాట్లాడుతూ ఆమె గొంతు చాలా విలక్షణమైనది. ఏ ఇతర హీరోయిన్ కీ అలాంటి గొంతు లేదు అని అంది.[6] 

మూలాలు[మార్చు]

  1. "April 2 1954". Filmfare. Archived from the original on 2017-05-11. Retrieved 2016-09-25.
  2. Tanha Chand. "Tanha Chand". Rekhta.org. Retrieved 2016-07-25.
  3. "Meena Kumari – "The Tragedy Queen of Indian Cinema"". Rolling Frames Film Society. Archived from the original on 2018-08-04. Retrieved 2017-04-02.
  4. "Meena Kumari the melancholic queen of cinema! - Sun Post". Retrieved 2016-07-25.
  5. "Kamal Amrohi NEVER Worked With Rajkumar After Pakeezah". YouTube. 2015-11-18. Retrieved 2016-07-25.
  6. "Madhubala – Her Sister's Recollections". 2016-04-16. Retrieved 2016-08-19.