Jump to content

ముక్కురాజు

వికీపీడియా నుండి
ముక్కురాజు
జననం
సాగిరాజు రాజంరాజు

1931
కుముదవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్
మరణంజూలై 31, 2014
వృత్తిసినిమా నటుడు, నృత్యదర్శకుడు, నృత్యకళాకారుడు
పిల్లలు3 (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
తల్లిదండ్రులు
  • బాపిరాజు (తండ్రి)
  • సత్యవతమ్మ (తల్లి)

ముక్కు రాజు గా ప్రసిద్ధిచెందిన సాగిరాజు రాజంరాజు (1931 - జూలై 31, 2014) తెలుగు సినిమా నటుడు, డాన్స్ మాస్టర్.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

వీరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర కుముదవల్లిలో 1931లో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తండ్రి బాపిరాజు, తల్లి సత్యవతమ్మ. 1941లో క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా ఈ ఇంగ్లీషు చదువులు మాకొద్దు అంటూ, పుస్తకాలు విసిరేసి చదువు మానేశారు.[2]. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

సినిమా ప్రస్థానం

[మార్చు]

1955లో కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన మాయాబజార్ చిత్రంలోని "మోహినీ భస్మాసుర డాన్స్ డ్రామా"తో సినిమాలలో ప్రవేశించాడు. వివిధ భాషలలో దాదాపు 500 చిత్రాలలో నటించిన వీరు 200 చిత్రాలకు డాన్స్ మాస్టార్ గా, చాలా సినిమాలకు ఫైటర్ గా పనిచేశాడు. మాజీ ముఖ్యమంత్రి మహా నటుడు ఎన్టీఆర్‌ కు తొలిరోజుల్లో వ్యక్తిగత డాన్స్ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి చిత్రరంగ ప్రవేశం కొత్తలో ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు, మనవూరి పాండవులు చిత్రాలకు డాన్స్ మాస్టర్‌గా వ్యవహరించాడు. ఆర్.నారాయణమూర్తి నిర్మించి, నటించిన ఎర్రసైన్యం, అడవి దివిటీలు లాంటి దాదాపు అన్ని చిత్రాలకు నృత్య రూపకల్పనతో పాటు డప్పు పట్టి నటించాడు.[3] "1940 లో ఒక గ్రామం" చిత్రంలో ముక్కురాజు నటనకు ఉత్తమ సహాయ నటునిగా నంది అవార్డు లభించింది[4][5]. టి.వి.నంది పురస్కారాలకమిటీలో 2000 సంవత్సరానికి సభ్యులుగా ఉన్నాడు. హైదరాబాద్ లో నృత్య దర్శకుల సంఘాన్ని ఏర్పాటు చేశాడు.

నటించిన చిత్రాలు

[మార్చు]

మరణం

[మార్చు]

2014, జూలై 31వ తేదీ గురువారం తెల్లవారుఝామున ముక్కురాజు కన్నుమూశారు.

మూలాలు

[మార్చు]
  1. "Actor Mukku Raju passes away". indiaglitz. July 31, 2014. Archived from the original on 2014-08-02. Retrieved July 31, 2014.
  2. "[[తెలుగు]]లో.కాంలో ముక్కురాజు ఇంటర్వ్యూ". Archived from the original on 2008-06-09. Retrieved 2009-04-13.
  3. "Veteran actor Mukku Raju passes away". Sakshi Post. Archived from the original on 2014-08-05. Retrieved 2014-07-31.
  4. "Nandi awards 2008 announced". idlebrain. Oct 24, 2008. Retrieved July 31, 2014.
  5. "'1940 lo oka gramam' release soon". The Hindu. February 19, 2010. Archived from the original on 2010-09-29. Retrieved September 29, 2010.

ఇతర లింకులు

[మార్చు]