మెట్టు గోవిందరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెట్టు గోవిందరెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) ఛైర్మన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
17 జులై 2021 నుండి ప్రస్తుతం

ఎమ్మెల్యే
పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1 జులై 1953
ఉంతకల్లు బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
సంతానం 3

మెట్టు గోవిందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మాజీ శాసనమండలి సభ్యుడు. ఆయన 17 జూలై 2021న ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మెట్టు గోవిందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండలం, ఉంతకల్లు గ్రామంలో జన్మించాడు. ఆయన 1971లో రాయదుర్గం లోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. అనంతరం ఆయన బెంగుళూరులో వస్త్ర వ్యాపారంలోకి దిగి గరుడ ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

మెట్టు గోవిందరెడ్డి 2003లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుండి టిడిపి తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి పై 10105 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. గోవిందరెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి చేతిలో 14091 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన 2011లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో అనంతపురం స్థానిక సంస్థల స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

మెట్టు గోవిందరెడ్డి 2019 మార్చి 12లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, [2] హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో 2019 మార్చి 13లో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, [3] అనంతరం జరిగిన 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి గెలుపులో కీలకంగా పనిచేశాడు. ఆయనను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌గా నియమిస్తూ 17 జూలై 2021న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 July 2021). "ఏపీ నామినేటెడ్‌ పదవులు దక్కించుకుంది వీరే." Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  2. The Hans India (12 March 2019). "Ex-MLA Mettu Govinda Reddy resigns to TDP". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.
  3. Sakshi (13 March 2019). "వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే మెట్టు". Archived from the original on 21 July 2021. Retrieved 21 July 2021.