మొండితోక అరుణ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మొండితోక అరుణ్ కుమార్

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 04 సెప్టెంబర్ 1975
చందర్లపాడు, చందర్లపాడు మండలం కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి శశికళ
బంధువులు మొండితోక జగన్ మోహన్ రావు అన్న
సంతానం శరణ్‌సిద్ధార్థ్, శ్రేయాన్‌

మొండితోక అరుణ్ కుమార్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

మొండితోక అరుణ్ కుమార్ 04 సెప్టెంబర్ 1975లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం,చందర్లపాడు గ్రామంలో మొండితోక కృష్ణ దంపతులకు జన్మించాడు. ఆయన పీహెచ్‌డీ పూర్తి చేశాడు.[1] ఆయన తరువాత డిల్లీ విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేశాడు.[2]

రాజకీయ జీవితం[మార్చు]

మొండితోక అరుణ్‌ కుమార్‌ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాష్ట కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన జులై 2021లో ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[3] మొండితోక అరుణ్‌ కుమార్‌ 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో కృష్ణా జిల్లా స్థానిక సంస్థల కోటాలో 13 నవంబర్ 2021న పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ కేటాయించింది.[4] ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 8 డిసెంబర్ 2021న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Andhrajyothy (13 November 2021). "విధేయత కోటాలో తలశిల రఘురాంకు ఎమ్మెల్సీ.. త్వరలో ఆయన రాజీనామా." Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
  3. Sakshi (17 July 2021). "ఏపీ నామినేటెడ్‌ పదవులు దక్కించుకుంది వీరే." Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  4. Eenadu (25 November 2021). "ఎమ్మెల్సీ వైకాపా అభ్యర్థులుగా తలశిల, మొండితోక". Archived from the original on 25 November 2021. Retrieved 31 December 2021.
  5. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.