యతిరాజారావు పార్కు (తొర్రూరు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యతిరాజారావు పార్కు
పార్కు దృశ్యాలు
రకంపట్టణ పార్కు
స్థానంతొర్రూరు, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ
సమీప పట్టణంవరంగల్
విస్తీర్ణం7 ఎకరాలు
నవీకరణ2023
నిర్వహిస్తుందితొర్రూరు పురపాలకసంఘం
స్థితివాడులో ఉంది

యతిరాజారావు పార్కు అనేది తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణంలోని ఉన్న పార్కు.[1] తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయనాయకుడు, మాజీ మంత్రి నెమురుగోమ్ముల యెతిరాజారావు పేరుమీద ఈ పార్కు ఏర్పాటుచేయబడింది.

ఆధునీకరణ[మార్చు]

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) నుంచి 2.12 నిధులతో మెట్రో నగరాల్లో అభివృద్ధి చేసిన పార్కుల తరహాలో ఈ పార్కును అభివృద్ధి చేయబడింది. ఈ పార్కులో 85 రకాల పూలు, ఔషధ, అలంకారమైన మొక్కలతో గెజిబో, ఓపెన్‌ జిమ్‌, వాకింగ్‌ ట్రాక్‌, వాటర్‌ ఫౌంటెన్‌తోపాటు ఏర్పాటుచేయబడ్డాయి.[2]

ప్రారంభం[మార్చు]

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ పట్టణ పార్కులు కార్యక్రమంలో 2.13 కోట్ల రూపాయలతో 14 ఎకరాలలో ఈ పార్కును ఆధునీకరించబడింది. ఈ యతిరాజారావు పార్కును 2023 మార్చి 8న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించాడు.[3] ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాధోడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఇతర వివరాలు[మార్చు]

ఈ పార్కులో వివిధ రకాల క్రీడలు ఆడుతారు. ఇందులో క్రికెట్ వంటి క్రీడాపోటీలు కూడా నిర్వమించబడుతాయి.[4]

మూలాలు[మార్చు]

  1. "THORRUR MUNICIPALITY | District Mahabubabad, Government of Telangana | India". www.mahabubabad.telangana.gov.in. Archived from the original on 2021-01-25. Retrieved 2023-04-15.
  2. Today, Telangana (2021-06-06). "Thorrur gets idyllic lung space". Telangana Today. Archived from the original on 2021-06-07. Retrieved 2023-04-15.
  3. ABN (2023-03-09). "ప్రగతిలో తెలంగాణ టాప్‌". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-15.
  4. India, The Hans (2021-11-08). "Errabelli Dayakar Rao takes a dig at BJP". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-08. Retrieved 2023-04-15.