యూరో కార్డేటా
Appearance
యూరో కార్డేటా Temporal range:
| |
---|---|
Sea Tulips, Pyura spinifera | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Subphylum: | యూరో కార్డేటా Giribet et al., 2000
|
తరగతులు | |
అసిడియేషియా (2,300 జాతులు) |
యూరో కార్డేటా (Urochordata) లేదా ట్యునికేటా (Tunicata)కార్డేటాలోని ఉప వర్గము.
సాధారణ లక్షణాలు
[మార్చు]- ఇవి ప్రపంచమంతా సముద్రాలలో విస్తరించాయి.
- అన్ని సముద్రాలలో తీర ప్రాంతము, లోతు జలాలలో జీవిస్తున్నాయి.
- ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు, కొన్ని ప్లవక జీవులు.
- ఇవి సరళంగా లేక సహనివేశాలుగా ఉంటాయి.
- ఇవి వివిధ పరిమాణాలలో (0.25 నుండి 250 మి.మీ.), ఆకారము, వర్ణాలలో ఉంటాయి.
- డింభక దశ సంక్లిష్టంగా ఉండి ప్రౌఢదశ సరళంగా ఉంటుంది.
- శరీరాన్ని కప్పుతూ సెల్యులోస్ వంటి పదార్ధమైన ట్యునిసిన్ (Tunicin) రక్షణ కొరకు, కవచము లేక కంచుకముగా ఏర్పడి ఉంటుంది. అందువలన "ట్యునికేటా" అని పేరు వచ్చింది.
- జలశ్వాస, పృష్ట ఆట్రియల్ రంధ్రము ఉంటాయి.
- శరీర కుహరము ఉండదు. కాని బహిస్త్వచముతో చుట్టబడిన ఆట్రియల్ కుహరము వెలుపలికి ఆట్రియల్ రంధ్రము ద్వారా తెరుచుకుంటుంది.
- పృష్టవంశము డింభకదశలో తోక భాగమునకు పరిమితమై ప్రౌఢదశలో లోపించి ఉంటుంది. అందువలన "యూరో కార్డేటా" అను పేరు వచ్చింది.
- జీర్ణనాళములో గ్రసని (జలశ్వాసగోణి) ఎండోస్తైల్ తో కూడి అనేక జతల మొప్ప చీలికలను కలిగివుంటుంది.
- శ్వాసక్రియ కవచము, మొప్పచీలికల వలన జరుగుతుంది.
- రక్తప్రసరణ వ్యవస్థ వివృత పద్ధతిలో ఉంటుంది. గుండె సరళంగా నాళికాయుతంగా ఉండి, రక్తము ముందుకు వెనుకను ప్రవహిస్తుంది.
- రక్తము వెనడోసైట్స్ ను కలిగి, సముద్ర నీటి నుండి వెనిడియమ్ ను గ్రహిస్తాయి.
- విసర్జన క్రియ నాడీ గ్రంధి, జఠర నిర్గమ గ్రంధి, వృక్కకోశము వలన జరుగుతుంది.
- అభివృద్ధి అప్రత్యక్షంగా ఉండి, నీటిలో స్వేచ్ఛగా ఈదే డింభకదశను కలిగివుంటుంది.
- ఈ జీవులు తిరోగామి రూపవిక్రియను ప్రదర్శిస్తాయి.
- ఉభయ లైంగిక జీవులు. ప్రత్యుత్పత్తి లైంగిక, అలైంగిక పద్ధతిలో జరుగుతుంది.
వర్గీకరణ
[మార్చు]ఎస్.ఎమ్.దాస్ (1957) యూరో కార్డేటాను మూడు విభాగాలుగా విభజించెను.
- అసిడియేషియా (Ascidiacea) :
- థాలియేషియా (Thaliacea) :
- లార్వేషియా (Larvacea)
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- The Tunicate portalis an access point to the main websites and databases dealing with tunicates Archived 2010-08-26 at the Wayback Machine
- Ascidians.com has pictures of species around the world
- Aniseed: A model organism database for several ascidians species including Ciona intestinalis and Halocynthia roretzi
- New breed of Sea squirt found