రచ్చ రవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రచ్చ రవి
జననం
రవి

(1982-07-27)1982 జూలై 27
విద్యఎంబిఏ
విద్యాసంస్థకాకతీయ యూనివర్సిటీ, హన్మకొండ
వృత్తితెలుగు సినిమా, టివి నటుడు

రచ్చ రవి తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా, టివి నటుడు.[1] జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా గుర్తింపు పొందిన రవి, 2013లో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[2]

జననం, విద్య

[మార్చు]

రవి 1982, జూలై 27న తెలంగాణ రాష్ట్రం, హన్మకొండలో జన్మించాడు. హన్మకొండలోని విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య, ఎస్.వి.ఎస్. జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ చదివాడు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశాడు.[3]

కళారంగం

[మార్చు]

చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆస్తకి ఉండడడంతో సినిమారంగంలోకి వెళ్ళి తన ప్రతిభను నిరూపించుకోవాలనుకున్నాడు. దూరదర్శన్‌లో వచ్చిన చార్లీచాప్లిన్‌ ఎపిసోడ్స్‌ చూసేవాడు. వినాయక చవితి మంటపాల్లో ప్రదర్శించే హరికథలు, బుర్రకథలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఇష్టం పెంచుకున్నాడు. మిమిక్రీ నేర్చుకొని అనేక స్టేజీల మీద ప్రదర్శనలిచ్చాడు.

తన చెల్లెలు ఇచ్చిన కొంత డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్ళిన రవి, జెమిని టీవీ నిర్వహించిన ‘వన్స్‌మోర్‌ ప్లీజ్‌’ కార్యక్రమంతో తొలిసారిగా టివిలో ప్రదర్శన ఇచ్చాడు. ఈ సమయంలో సినిమాల్లో ప్రయత్నించి సరైన అవకాశాలు రాకపోవడంతో వరంగల్‌కు వెళ్ళిపోయాడు. అక్కడ వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో ఉద్యోగం చేరి, కొంతకాలం ఐఏఎస్‌ స్మితా సబర్వాల్‌ దగ్గర పనిచేశాడు. అటుతరువాత మున్సిపల్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టి దుబాయ్‌కి వెళ్లి రేడియో జాకీగా పనిచేశాడు. అందులో ‘నవ్వుల నల్లబాలు’ పేరుతో తెలంగాణ యాసలో కార్యక్రమాలు చేసి, విశేష ఆదరణ పొందాడు. తరువాత హైదరాబాద్‌కి వచ్చాడు.[4]

టివిరంగం

[మార్చు]

సినీ దర్శకుడు క్రిష్‌ తండ్రి సాయిబాబా నిర్మించిన ‘పుత్తడి బొమ్మ’, ‘శిఖరం’ సీరియళ్ళకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. జబర్దస్త్‌ కార్యక్రమంకోసం చమ్మక్‌ చంద్ర ఇంటిలో జరిగిన ఆడిషన్స్‌లో సెలెక్ట్‌ అయ్యాడు. అలా జబర్దస్త్‌ కార్యక్రమంలో పలు స్కిట్ లలో నటించాడు.[5] జబర్దస్త్‌లో చేస్తున్న సమయంలోనే సినిమాల్లో అవకాశం వచ్చింది.[6]

సినిమారంగం

[మార్చు]

దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన ‘వెయ్యి అబద్ధాలు’ (2013) సినిమాలోని నటనతో సినిమారంగంలోకి ప్రవేశించాడు. తొలిరోజుల్లో చిన్నచిన్న పాత్రల్లో కాసేపు కనిపించిన స్థాయి నుండి కథలో ప్రాధాన్యమున్న ఉండే పాత్రల్ని పోషించే స్థాయికి చేరుకున్నాడు. ‘గద్దలకొండ గణేష్‌’, ‘శతమానంభవతి’ చిత్రాల్లో తెలంగాణ, ఆంధ్రా యాసలో మాట్లాడి అలరించాడు.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Telugu actor Racha Ravi excited over latest releases". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-02-08. Archived from the original on 2021-02-08. Retrieved 2021-12-17.
  2. Namasthe Telangana (11 September 2022). "ఆక‌లి బాధ నుంచి న‌లుగురికి అన్నం పెట్టే స్థాయికి.. ర‌చ్చ ర‌వి ప్ర‌స్థాన‌మిదే." Archived from the original on 15 September 2022. Retrieved 15 September 2022.
  3. "Tollywood Comedian Racha Ravi Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-01-16. Retrieved 2021-12-17.
  4. "జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). కళాధర్‌ రావు. 2021-03-15. Archived from the original on 2021-12-17. Retrieved 2021-12-17.
  5. "Racha Ravi on nailing his role in 'Maestro'". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-01. Archived from the original on 2021-10-04. Retrieved 2021-12-17.
  6. "జబర్దస్త్‌ నటుడు అనిపించుకోవాలి - Namasthetelangaana | DailyHunt Lite". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-17. Retrieved 2021-12-17.
  7. The Times of India (5 October 2023). "'Skanda' fame Racha Ravi: I've had the privilege of working with talented directors like Teja, Boyapati Sreenu and Anil Ravipudi". Archived from the original on 5 October 2023. Retrieved 5 October 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=రచ్చ_రవి&oldid=4345322" నుండి వెలికితీశారు