Jump to content

రాఘవ్ చద్దా

వికీపీడియా నుండి
రాఘవ్ చద్దా
రాఘవ్ చద్దా


రాజ్యసభ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
9 ఏప్రిల్ 2022
ముందు ప్రతాప్ సింగ్ బజ్వా
నియోజకవర్గం పంజాబ్

శాసనసభ్యుడు
పదవీ కాలం
12 ఫిబ్రవరి 2020 – ప్రస్తుతం
ముందు విజేందర్ గార్గ్ విజయ్
నియోజకవర్గం రాజిందర్ నగర్

ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2 మార్చి 2020[1][2]
ముందు దినేష్ మొహానియా

వ్యక్తిగత వివరాలు

జననం (1988-11-11) 1988 నవంబరు 11 (వయసు 36)
ఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామి పరిణీతి చోప్రా
పూర్వ విద్యార్థి ఢిల్లీ యూనివర్సిటీ
వృత్తి ఛార్టర్డ్ అకౌంటెంట్
వెబ్‌సైటు Official Website

రాఘవ్ చద్దా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా, ప్రస్తుతం ఢిల్లీలోని రాజేందర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాఘవ్ చద్దా ను 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2015లో పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితుడయ్యాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. రాఘవ్ చద్దా 2020లో జరిగిన అఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజిందర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4] ఆయన 2020 మార్చి 2న ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.

రాఘవ్ చద్దా లో పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఇన్‌చార్జ్‌గా నియమితుడై, 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇంచార్జిగా పార్టీ గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయనను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది.[5][6][7]

వివాహం

[మార్చు]

ఢిల్లీలోని ఇండియా గేట్ స‌మీపంలోని కపుర్తాలా హౌస్‌లో ఆయన ఎంగేజ్‌మెంట్‌ (నిశ్చితార్ధం) బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో 2023 మే 13న జరిగింది.[8] వీరి వివాహం సెప్టెంబర్ 24న ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. ఈ వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌సానియా మీర్జా, హర్భజన్ సింగ్, మనీష్ మల్హోత్రా హాజరైయ్యారు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. "AAP MLA Raghav Chadha Appointed Delhi Jal Board Vice Chairman". 2 March 2020.
  2. http://www.delhijalboard.nic.in/sites/default/files/All-PDF/PR_RC_03.03.2020_E_0.pdf [bare URL PDF]
  3. Sakshi (21 March 2022). "కేజ్రీవాల్‌ 'కీ' స్టెప్‌.. రాజ‍్యసభకు హర‍్భజన్‌ సింగ్‌తో మరో నలుగురు.. ఎవరంటే..?". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  4. "Raghav Chadha wins in Rajinder Nagar by huge margin — increases AAP's voteshare by 3.67%". Business Insider. 11 February 2020. Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  5. Namasthe Telangana (21 March 2022). "రాజ్య‌స‌భ‌కు హ‌ర్భ‌జ‌న్‌, సందీప్‌, రాఘ‌వ్‌, సంజీవ్‌, అశోక్‌". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  6. News18 Telugu (22 March 2022). "రాజ్యసభకు ఆప్‌ భల్లే ఎంపిక: హర్భజన్ సింగ్ ఇక ఎంపీ.. పెద్దలసభలో చిన్నోడు రాఘవ్ చద్దా.. పూర్తి జాబితా ఇదే". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Eenadu (22 March 2022). "మాజీ క్రికెటర్‌, ప్రొఫెసర్‌, ఎమ్మెల్యే.. ఆమ్‌ ఆద్మీ రాజ్యసభ సభ్యులు వీరే." Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  8. Eenadu (14 May 2023). "పరిణీతి నిశ్చితార్థం రాఘవ్‌తో". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  9. Sakshi (24 September 2023). "మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట.. హాజరైన ప్రముఖులు!". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023.
  10. Eenadu (24 September 2023). "ఒక్కటైన 'రాగ్‌ణీతి'.. లీలా ప్యాలెస్‌లో వైభవంగా వివాహం". Archived from the original on 24 September 2023. Retrieved 24 September 2023.