రాబర్టో బెనిగ్ని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాబర్టో బెనిగ్ని
2020లో 70వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెనిగ్ని
జననం
రాబర్టో రెమిజియో బెనిగ్ని

(1952-10-27) 1952 అక్టోబరు 27 (వయసు 71)
కాస్టిగ్లియన్ ఫియోరెంటినో, టుస్కానీ, ఇటలీ
వృత్తి
  • నటుడు
  • ఫిల్మ్ డైరెక్టర్
  • స్క్రీన్ రైటర్
క్రియాశీల సంవత్సరాలు1970–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
నికోలెట్టా బ్రాస్చి
(m. 1991)

రాబర్టో రెమిజియో బెనిగ్ని ఇటాలియన్ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు. 1997లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే హోలోకాస్ట్ కామెడీ-డ్రామా సినిమాకి రచన, దర్శకత్వంతోపాటు నటించినందుకు అంతర్జాతీయ గుర్తింపు పొందడంతోపాటు ఉత్తమ నటుడు, ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో అకాడమీ అవార్డులను అందుకున్నాడు. విదేశీ భాషా సినిమాలో ఉత్తమ నటుడు అకాడమీ అవార్డును గెలుచుకున్న ఏకైక నటుడు ఇతడు.

జననం[మార్చు]

బెనిగ్ని 1952 అక్టోబరు 27న ఐసోలినా పాపిని - లుయిగి బెనిగ్ని దంపతులకు మాన్సియానో లా మిసెరికోర్డియాలో జన్మించాడు.[1] కాథలిక్‌గా పెరిగాడు, బలిపీఠం బాలుడిగా పనిచేశాడు.[2][3] తరువాతి జీవితంలో నాస్తికుడిగా మారాడు.[4][5]

సినిమారంగం[మార్చు]

1977లో వచ్చిన బెర్లింగ్యూర్, ఐ లవ్ యు సినిమాతో నటనారంగంలోకి అడుగుపెట్టాడు. 1983లో టు మి తుర్బి అనే సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. దర్శకత్వం చేస్తూనే నటనను కొనసాగించాడు. నథింగ్ లెఫ్ట్ టు డూ బట్ క్రై (1984), ది లిటిల్ డెవిల్ (1988), జానీ స్టెచినో (1991), ది మాన్స్టర్ (1994), పినోచియో (2002), ది టైగర్ అండ్ ది స్నో ((2005) సినిమాలలో కూడా నటించాడు.

1991లో డౌన్ బై లా, నైట్ ఆన్ ఎర్త్ 2003లో కాఫీ అండ్ సిగరెట్స్ సినిమాలలో నటించాడు. బ్లేక్ ఎడ్వర్డ్స్ ' సన్ ఆఫ్ ది పింక్ పాంథర్ (1993), వుడీ అలెన్ తీసిన టు రోమ్ విత్ లవ్ (2012), మాటియో గారోన్ తీసిన పినోచియో (2019)లో కూడా నటించాడు.

1990లో జార్జియో గాబెర్‌తో బెనిగ్ని
1998 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెనిగ్ని, భార్య నికోలెట్టా బ్రాస్చీ

సినిమాలు[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
1977 బెర్లింగ్యూర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను మారియో సియోని రచయిత కూడా
1979 టైగర్స్ ఇన్ లిప్‌స్టిక్‌ ప్రిన్సిపాల్ విభాగం: ఉనా మమ్మా
వుమెన్ లైట్ క్లాప్సీ వద్ద బార్మాన్
లా లూనా అప్హోల్స్టర్
ఐ జియోర్ని కాంటాటి ప్రొఫెసర్
సీకింగ్ ఆస్యలుమ్ రాబర్టో
1980 ఇన్ ది పోస్స్ ఐ అతనే
1981 ఇల్ మైన్స్ట్రోన్ ది మేస్ట్రో
1983 తు మి టర్బి బెనిగ్నో దర్శకుడు, రచయిత
చే మి హై పోర్టాటో ఎ ఫేర్ సోప్రా ఎ పోసిల్లిపో సే నాన్ మి వూయి పియో బెనే?" లేత గోధుమరంగు షేక్
1984 నథింగ్ లిఫ్ట్ టూ బట్ క్రై సవేరియో దర్శకుడు, రచయిత
1986 డౌన్ బై లా రాబర్టో ఇంగ్లీషులో మాట్లాడే సినిమా రంగప్రవేశం
కాఫీ అండ్ సిగరెట్స్ రాబర్టో షార్ట్ ఫిల్మ్
1988 ది లిటిల్ డెవిల్ గియుడిట్టా దర్శకుడు, రచయిత
1990 ది వాయిస్ ఆఫ్ ది మూన్ ఐవో సాల్విని
1991 నైట్ ఆన్ ఎర్త్ క్యాబ్ డ్రైవర్ విభాగం: రోమ్
జానీ స్టెచినో డాంటే సెక్కరిని/ జానీ స్టెచినో దర్శకుడు, రచయిత
1993 సన్నాఫ్ పింక్ పాంథర్ జాక్వెస్ గాంబ్రెల్లి
1994 ది మాన్స్టర్ లోరిస్ దర్శకుడు, రచయిత, నిర్మాత
1997 లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ గైడో ఓరిఫీస్ దర్శకుడు, రచయిత
1999 ఆస్టెరిక్స్ & ఒబెలిక్స్ టేక్ ఆన్ సీజర్ లూసియస్ డెట్రిటస్
2002 పినోచియో పినోచియో దర్శకుడు, రచయిత
2003 బిగ్ సిటీలో కాటెరినా
కాఫీ అండ్ సిగరెట్లు రాబర్టో
2005 టైగర్ అండ్ ది స్నో అట్టిలియో డి గియోవన్నీ దర్శకుడు, రచయిత
2010 లా కామెడియా డి అమోస్ పో వ్యాఖ్యాత వాయిస్
2011 పిస్తా - ది లిటిల్ బాయ్ దట్ వుడ్ నాట్ ఇటలీ అధిపతి వాయిస్
2012 ది రోమ్ విత్ లవ్ లియోపోల్డో పిసానెల్లో
2019 పినోచియో మిస్టర్ గెప్పెట్టో

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1972 సోరెల్లె మాటెరాస్సీ యువత ఎపిసోడ్: "ఎపిసోడియో 1"
1976–1977 ఒండా లిబెరా మారియో సియోని 4 ఎపిసోడ్‌లు
రచయిత
1979 మా చె కోస్' క్వెస్టో అమోర్ ది థింకర్ 2 ఎపిసోడ్‌లు
1982 మోర్టో ట్రోయిసి, వివా ట్రోయిసి! అనామక చిన్ననాటి స్నేహితుడు టెలివిజన్ సినిమా

అవార్డులు, నామినేషన్లు[మార్చు]

సంవత్సరం అవార్డు వర్గం ప్రాజెక్ట్ ఫలితం
1983 డేవిడ్ డి డోనాటెల్లో ఉత్తమ నూతన దర్శకుడు తు మి తుర్బి నామినేట్
నాస్ట్రో డి అర్జెంటో ఉత్తమ నూతన దర్శకుడు నామినేట్
1986 ఉత్తమ నటుడు చట్టం ప్రకారం డౌన్ విజేత
ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డు ఉత్తమ పురుష నాయకుడు నామినేట్
1988 డేవిడ్ డి డోనాటెల్లో ఉత్తమ నటుడు ది లిటిల్ డెవిల్ విజేత
నాస్ట్రో డి అర్జెంటో ఉత్తమ దర్శకుడు నామినేట్
ఉత్తమ నటుడు నామినేట్
ఉత్తమ నటుడు జానీ స్టెచినో విజేత
ఉత్తమ స్క్రీన్ ప్లే నామినేట్
1998 అకాడమి పురస్కారం ఉత్తమ నటుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ విజేత
ఉత్తమ దర్శకుడు నామినేట్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే నామినేట్
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డు ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు విజేత
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే నామినేట్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పామ్ డి ఓర్ నామినేట్
గ్రాండ్ ప్రిక్స్ - కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేత
క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ ఉత్తమ ప్రముఖ నటుడు విజేత
చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఉత్తమ నటుడు నామినేట్
బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ఉత్తమ దర్శకుడు నామినేట్
డేవిడ్ డి డోనాటెల్లో ఉత్తమ దర్శకుడు విజేత
ఉత్తమ నటుడు విజేత
ఉత్తమ స్క్రీన్ ప్లే విజేత
డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు అత్యుత్తమ దర్శకత్వం - ఫీచర్ ఫిల్మ్ నామినేట్
యూరోపియన్ ఫిల్మ్ అవార్డు ఉత్తమ నటుడు విజేత
స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డు ప్రముఖ పాత్రలో అత్యుత్తమ నటుడు విజేత
చలనచిత్రంలో అత్యుత్తమ తారాగణం నామినేట్
నాస్ట్రో డి అర్జెంటో ఉత్తమ దర్శకుడు విజేత
ఉత్తమ నటుడు విజేత
ఉత్తమ స్క్రీన్ ప్లే విజేత
2002 డేవిడ్ డి డోనాటెల్లో ఉత్తమ నటుడు పినోచియో నామినేట్
రజ్జీ అవార్డు చెత్త నటుడు విజేత
చెత్త దర్శకుడు నామినేట్
చెత్త స్క్రీన్ జంట నామినేట్
చెత్త స్క్రీన్ ప్లే నామినేట్
2005 నాస్ట్రో డి అర్జెంటో ఉత్తమ నటుడు ది టైగర్ అండ్ ది స్నో నామినేట్
2019 ఉత్తమ సహాయ నటుడు పినోచియో విజేత
డేవిడ్ డి డోనాటెల్లో ఉత్తమ సహాయ నటుడు నామినేట్

మూలాలు[మార్చు]

  1. Waxman, Sharon (1998-11-01). "EMBRACING 'LIFE' IN DEATH CAMPS". Washington Post. ISSN 0190-8286. Retrieved 2023-05-23.
  2. Lipman, Steve (1998-10-23). "When Tragedy, Comedy Meet: Italian actor-director Roberto Benigni". The Jewish Week. Archived from the original on 2012-11-04.
  3. "Is There Humor in the Holocaust? Roberto Benigni's bittersweet answer". Jewish Exponent. New York. 1998-11-05. Archived from the original on 2012-11-04.
  4. Bullaro, Grace Russo, ed. (1 January 2005). [[[:మూస:GBUrl]] Beyond "Life is Beautiful": Comedy and Tragedy in the Cinema of Roberto Benigni]. Leicester: Troubador Publishing. p. 27. ISBN 1-904744-83-4. Retrieved 29 May 2022. {{cite book}}: Check |url= value (help)
  5. CNA. "'Life is Beautiful' actor Roberto Benigni meets the pope". Catholic News Agency (in ఇంగ్లీష్). Retrieved 2023-05-23.

బయటి లింకులు[మార్చు]