రామానగరం (చల్లపల్లి)
(రామానగరం(చల్లపల్లి) నుండి దారిమార్పు చెందింది)
రామానగరం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
రామానగరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°56′53″N 80°35′13″E / 15.948122°N 80.586944°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | చల్లపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీ పుట్టి వీరాస్వామి |
పిన్ కోడ్ | 521 126 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
విద్యా సౌకర్యాలు
[మార్చు]- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో, 2014, ఆగస్టు-15వ తేదీనాడు, జాతిపిత మాహాత్మా గాంధీజీ మరియూ భారత జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారల విగ్రహాల ఆవిష్కరణ నిర్వహించెదరు. రామానగరం యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయుచున్న ఈ విగ్రహాలను, ఘంటసాల మండలం చినకళ్ళేపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సంఘసేవకురాలు శ్రీమతి గుత్తికొండ కోకిలాంబ సమకూర్చారు.
- శ్రీ నాగార్జున పబ్లిక్ స్కూల్ & విద్యాలయ.
- ఈ గ్రామంలో మూడు ప్రవేటు విద్యసంస్ధలు ఉన్నాయి.
సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఆరవ నంబరు కాలువ (కె.యి.బి.కెనాల్ నుండి బ్రాంచ్).
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, శ్రీ సీతారాముల కళ్యాణం, ఘనంగా నిర్వహించెదరు. ఈ ఆలయం వద్ద దేవినవరాత్రులు ఘనంగా జరుగును.
- శ్రీ ఆంజనీయస్వామి దేవాలయం వద్ద వినాయకచవితి వేడుకలు అత్యంత వేడుకగా జరుగును.
ప్రముఖులు
[మార్చు]ఈ గ్రామంలో రాజకీయప్రముఖులు శ్రీ మూల్పురి వేంకటేశ్యరరావు, శ్రీ లంకబాబు తదితరులు నివసిస్తున్నారు.
విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలో అన్ని సౌకర్యలు అందుబాటులో ఉండటం వలన మండలంలోనే అత్యత నివాసయోగ్యమైన గ్రామముగా గుర్తించబడింది.