రేగ కాంతారావు
రేగ కాంతారావు | |||
| |||
పదవీ కాలం 2009 - 2014, 2018 - ప్రస్తుతం | |||
ముందు | పాయం వెంకటేశ్వర్లు | ||
---|---|---|---|
నియోజకవర్గం | పినపాక శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1977, ఏప్రిల్ 9 కోర్నుపల్లి, కరకగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | బొర్రయ్య - నర్సమ్మ | ||
జీవిత భాగస్వామి | సుధారాణి | ||
సంతానం | ఇద్దరు కుమారులు |
రేగ కాంతారావు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పినపాక శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
జననం, విద్య
[మార్చు]కాంతారావు 1977, ఏప్రిల్ 9న బొర్రయ్య - నర్సమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలంలోని కోర్నుపల్లి గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ నుండి 2000లో బిఏ పూర్తి చేసాడు. 2005లో దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల నుండి ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్లొమాలో గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కాంతారావుకు సుధారాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు.
రాజకీయ విశేషాలు
[మార్చు]కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కాంతారావు, 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పినపాక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసి 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా గెలుపొందాడు.[3] 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటిచేయలేదు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుపై 19,563 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] 2018 ఎన్నికల అనంతరం 2019 జూన్ లో కాంగ్రెస్ పార్టీకి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[5]రేగా కాంతా రావు 26 జనవరి 2022న టిఆర్ఎస్ పార్టీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[6][7]
హోదాలు
[మార్చు]- 07.09.2019 - ప్రస్తుతం: తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ విప్[8]
మూలాలు
[మార్చు]- ↑ Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ "Rega Kantha Rao | Govt. Whip | MLA | Kornupally | Karakagudem | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-05-01. Retrieved 2021-09-19.
- ↑ "Rega Kantha Rao(Indian National Congress(INC)):Constituency- PINAPAKA (ST)(KHAMMAM) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-19.
- ↑ "Rega Kantharao(Indian National Congress(INC)):Constituency- PINAPAKA (ST)(BHADRADRI) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-19.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-06-19. Retrieved 2020-07-08.
- ↑ Namasthe Telangana (26 January 2022). "టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
- ↑ Eenadu (9 November 2023). "అభ్యర్థులు వారే.. గుర్తులు మారె." Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ India, The Hans (2019-09-09). "MLA Kantha happy on being appointed Government Whip". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-09-19.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- 1977 జననాలు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ నాయకులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2009)