విలియం కాంగ్రేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విలియం కాంగ్రేవ్
1709లో విలియం కాంగ్రేవ్
పుట్టిన తేదీ, స్థలం(1670-01-24)1670 జనవరి 24
బార్డ్సే, వెస్ట్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్
మరణం1729 జనవరి 19(1729-01-19) (వయసు 58)
లండన్, గ్రేట్ బ్రిటన్
వృత్తినాటక రచయిత, కవి
జాతీయతఇంగ్లీష్
కాలం1693–1700

విలియం కాంగ్రేవ్ (జనవరి 24, 1670 - జనవరి 19, 1729) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

విలియం కాంగ్రేవ్ 1670, జనవరి 24న ఇంగ్లాండ్,వెస్ట్ యార్క్‌షైర్ లోని బార్డ్సేలో జన్మించాడు. డబ్లిన్ లోని ట్రినిటీ కళాశాల, మిడిల్ టెంపె కళాశాలలో చదువుకున్నాడు.

రచనా ప్రస్థానం[మార్చు]

కళాశాల స్థాయిలోనే నాటక రచన ప్రారంభించిన విలియం కాంగ్రేవ్, ఆహ్లద నాటకాలు, విషాద నాటకాలు రాశాడు. ఈయన రాసిన నాటకాలను కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగులోకి అనువాదం చేశాడు. విలియం కాంగ్రేవ్ రాసిన తొలి నాటకం ఓల్డ్ బాచలర్ 1693లో ప్రదర్శించబడింది.[2]

రచించిన నాటకాలు[మార్చు]

  1. ఓల్డ్ బాచలర్ (1693)[3]
  2. డబుల్ డీలర్ (1694)[4]
  3. లవ్ ఫర్ లవ్ (1695)[5]
  4. మోర్నంగ్ బ్రయిడ్ (1697)[6]
  5. ది వే ఆఫ్ ది వరల్డ్ (1700)[7]

మరణం[మార్చు]

విలియం కాంగ్రేవ్ 58 ఏళ్ళ వయసులో 1729, జనవరి 19న గ్రేట్ బ్రిటన్ లోని లండన్ లో మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. విలియం కాంగ్రేవ్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 250.
  2. Rump, Edward, ed. (1985). The comedies of William Congreve (3 ed.). Harmondsworth, England: Penguin Books. p. 10. ISBN 9780140432312.
  3. The Old Bachelor: A Comedy by William Congreve.
  4. The Double-Dealer: A Comedy by William Congreve.
  5. Love for Love: A Comedy by William Congreve.
  6. Congreve, William (1 January 1753). The Mourning Bride: A Tragedy. J. and R. Tonson and S. Draper in the Strand.
  7. The Way of the World by William Congreve.