విల్బర్ స్కోవిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విల్బర్ స్కోవిల్
1910 లో స్కోవిల్
జననంజనవరి 22, 1865
బ్రిడ్జ్ పోర్ట్, కొన్నెక్రికట్, యునైటెడ్ స్టేట్స్.
మరణం1942 మార్చి 10(1942-03-10) (వయసు 77)
గైనిస్ విల్లె, ఫ్లోరిడా, యునైటెడ్ స్టేట్స్
జాతీయతఅమెరికన్
వృత్తిఫార్మాసిస్టు

విల్బర్ లింకన్ స్కోవిల్ (జనవరి 22, 1865 - మార్చి 10, 1942)[1] యునైటెడ్ స్టేట్స్ కు చెందిన ఫార్మాసిస్టు. ఆయన "స్కోవిల్ ఆర్గానోలెప్టిక్ పరీక్ష" ను కనుగొని సుప్రసిద్ధుడైనాడు. ఈ పరీక్ష ప్రస్తుతం "స్కోవిల్ స్కేల్" గా పిలువబడుతుంది. ఈ పరీక్షను ఆయన 1912లో ఆయన పర్క్ డేవిస్ ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వివిధ మిరపకాయల, మిరియాల రుచులలో(కారం) గల తీవ్రతలను తెలుసుకొనుటకు కనుగొన్నాడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన యునైటెడ్ స్టేట్స్ కు చెందిన కన్నెక్టికట్ వద్ద బ్రిడ్జ్‌పోర్ట్ ప్రాంతంలో జన్మించాడు. ఆయన సెప్టెంబరు 1,1891 న కోరా బి. ఉఫ్హం ను వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లలు. వారిలో అమీ ఆగస్టా ఆగస్టు 21, 1892, రుచ్ ఉఫ్హం అక్టోబరు 21,1897 లోనూ జన్మిచారు.[2]

ఆయన "ద ఆర్ట్ ఆఫ్ కాంపౌండింగ్" అనే పుస్తకాన్ని వ్రాసి 1895లో ప్రచురించారు. ఆ పుస్తకం కనీసం 8 ఎడిషన్లు ముద్రించబడినది. ఆ పుస్తకం 1960 వరకు ఫార్మాసిటికల్ రిఫరెన్సు గా ఉపయోగపడేది. ఆయన "ఎక్జాక్ట్ అండ్ పెర్‌ఫ్యూమ్స్" అనే పుస్తకాన్ని కూడా వ్రాసారు. దీనిలో వందల సంఖ్యలో ఫార్ములేషన్స్ ఉన్నాయి. ఆయన కొంతకాలం మసాచ్‌సెట్ట్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అండ్ హెల్త్ సైన్సెస్ లో ప్రొఫెసర్ గా పనిచేసారు. 1912 లో ఆయన వివిధ చిల్లీ పెప్పర్స్ కొరకు ఒక పరీక్ష, సూచిక ను కనుగొన్నారు. ఈ పరీక్షను "స్లోవిల్ ఆర్గానోలెప్టిక్ పరీక్ష" అంటారు. ఆయన వివిధ చిల్లీ పెప్పర్స్ యొక్క కారంలో గాల్ తీవ్రతలను ఈ పరీక్ష ద్వారా కనుగొన్నాడు. ఈ పరీక్ష ప్రస్తుతం స్కోవిల్ స్కేలు గా ప్రామాణీకరించబడినది.

1922లో స్కోవిల్ ఎలిజెబెత్ ప్రైజ్ ను అమెరికన్ ఫార్మాసిటికల్ అసోసియేషన్ నుండి పొందారు. 1929 లో ఆయన రెమింగ్టన్ హానర్ మెడల్ ను పొందారు. ఆయన 1929 లో కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ ను పొందారు.

జనవరి 22 2016 గూగుల్ సెర్చ్ ఇంజన్ ఆయన గౌరవార్థం గూగుల్ డూగుల్ ను ప్రచురించింది.[3]

అవార్డులు[మార్చు]

ఆయనకు అమెరికన్ ఫార్మాసిటికల్ అసోసియేషన్ నుండి క్రింది అవార్డులు లభించాయి.

  • 1922 – ద ఎబెర్ట్ ప్రైజ్,
  • 1929 – రోమింగ్టన్ హానర్ మెడల్, APhA యొక్క అత్యున్నత పురస్కారం

మూలాలు[మార్చు]

  1. NNDB
  2. Homer Worthington Brainard (1915). A Survey of the Scovils Or Scovills in England and America: Seven Hundred Years of History and Genealogy. Priv. print. Retrieved 30 April 2012.
  3. "Wilbur Scoville's 151st Birthday". Google Doodles Archive. Retrieved 2016-01-22.

ఇతర లింకులు[మార్చు]