వేముల ప్రశాంత్ రెడ్డి
వేముల ప్రశాంత్ రెడ్డి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 సెప్టెంబర్ 8-2023 డిసెంబర్ 3 | |||
ముందు |
| ||
---|---|---|---|
ఎమ్మెల్యే, బాల్కొండ శాసనసభ నియోజకవర్గం
| |||
పదవీ కాలం 2 జూన్ 2014 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | వేల్పూర్ | 1966 మార్చి 14||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | సురేందర్ రెడ్డి, మంజుల | ||
జీవిత భాగస్వామి | నీరజారెడ్డి | ||
సంతానం | ఒక కుమారుడు, ఒక కుమార్తె | ||
నివాసం | బాల్కొండ, సోమాజీగూడ |
వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, బాల్కొండ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1] ప్రస్తుతం కేసీఆర్ రెండవ మంత్రివర్గంలో రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నాడు.
జీవిత విషయాలు
[మార్చు]ప్రశాంత్ రెడ్డి 1966, మార్చి 14న[2] సురేందర్ రెడ్డి, మంజుల దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలంలోని వేల్పూర్ గ్రామంలో జన్మించాడు. బిఈ (సివిల్) చదివాడు.[3][4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రశాంత్ రెడ్డికి నీరజారెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ పై 32,408 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[5][6] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ పై 36,248 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7]
2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో రవాణా, రోడ్లు & భవనాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రిగా ఉన్నాడు.[8][9][10]
ఇతర వివరాలు
[మార్చు]- తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సైప్లె కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ ఛైర్మన్గా కూడా ఉన్నాడు.[11]
- మలేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-17.
- ↑ Namasthe Telangana (14 March 2022). "హ్యాపీ బర్త్‌డే వేముల". Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
- ↑ Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Eenadu (14 November 2023). "మన అభ్యర్థులవి పెద్ద చదువులే". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ "Vemula Prashanth Reddy(TRS):Constituency- BALKONDA(NIZAMABAD) - Affidavit Information of Candidate". www.myneta.info. Retrieved 2021-08-17.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-11. Retrieved 2019-05-11.
- ↑ Sakshi (6 November 2018). "గులాబీ గుబాళింపు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ బిబిసీ తెలుగు, తెలంగాణ (19 February 2019). "తెలంగాణ మంత్రివర్గ విస్తరణ: కేసీఆర్ కొత్త టీంలో ఎవరెవరు ఉన్నారంటే." Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ టి న్యూస్, ప్రాంతీయ వార్తలు (19 February 2019). "కొత్త మంత్రులు, ప్రొఫైల్". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ (19 February 2019). "అట్టహాసంగా తెలంగాణ మంత్రుల ప్రమాణస్వీకారం". Archived from the original on 24 July 2019. Retrieved 24 July 2019.
- ↑ Harikrishna (2019-02-19). "విధేయతే మంత్రిని చేసింది: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రొఫైల్". telugu.oneindia.com. Retrieved 2021-08-17.