వేమూరి వేంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమూరి వేంకటేశ్వరరావు
జననం (1938-01-17) 1938 జనవరి 17 (వయసు 86)
విద్యాసంస్థ
  • కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ
  • డెట్రాయిట్ విశ్వవిద్యాలయం, మిషిగన్, అమెరికా
  • కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిలెస్, అమెరికా
వృత్తిరచయిత, కంప్యూటర్ సైన్సు ఆచార్యులు
పిల్లలుసీత, సునీల్, మైథిలి
తల్లిదండ్రులు
  • వేమూరి సోమేశ్వరరావు (తండ్రి)
  • తెన్నేటి సీతారామమ్మ (తల్లి)

వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.

జీవిత విశేషాలు[మార్చు]

వేమూరి వేంకటేశ్వరరావు విశాఖ జిల్లా, చోడవరం లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. తూర్పుగోదావరి జిల్లా, తుని లో పెరిగాడు.[1] ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, 1952-54లో బందరు హిందూ కళాశాలనందు ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో కాకినాడలోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన మిచిగన్ లోని " డిట్రోయిట్ విశ్వవిద్యాలయం" [2] లో ఎం.ఎస్ పట్టాను పొందాడు. 1968లో లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.

విజ్ఞాన శాస్త్ర రచయితగా[మార్చు]

ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తుడు.ఇతను 1967 ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి తెలుగు పుస్తకం రాశాడు[ఆధారం చూపాలి]. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది.

తెలుగులో రచించిన పుస్తకాలు జాబితా[మార్చు]

ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) నిఘంటువుని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.(b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు).

బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నాడు.[3] తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది [4]. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.

ఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.

పురస్కారాలు[మార్చు]

  • పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్, కేలిఫోర్నియా, అమెరికా
  • వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా
  • కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
  • తానా అచీవ్‌మెంట్ అవార్డు, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా
  • జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా
  • 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా
  • జీవిత సాఫల్య పురస్కారం, బే ఏరియా తెలుగు ఎసోసియేషన్ 50 వ వార్షికోత్సవం, అక్టోబర్ 2022, కేలిఫోర్నియా, అమెరికా

వంశ వృక్షం[మార్చు]

వేమూరి భగీరథ భొట్లు --> చల్లయ్య --> బుచ్చన్న --> చల్లయ్య --> భగవాన్లు --> లక్ష్మీనారాయణ & రేగులగడ్డ అప్పలనరసమ్మ --> సోమేశ్వరరావు (1 Dec 1898 - 30 Nov 1984) & తెన్నేటి సీతారామమ్మ (8 Sep 1905 - ??) --> వేంకటేశ్వరరావు (17 Jan 1938) & గొల్లపూడి ఉమ --> సీత, సునీల్ (23 June 1969) & లక్ష్మి --> {అర్జున్‌( 20 Aug 2007), విద్య (22 Feb 2009)}, మైథిలి --> రోహాన్ బ్రోడీ (బుజ్జి) (29 జూన్ 2019)

మూలాలు[మార్చు]

  1. "ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి". maganti.org. Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-09.
  2. en:https://www.udmercy.edu
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-16. Retrieved 2021-05-16.
  4. http://guide.berkeley.edu/courses/telugu/

ఇతర లింకులు[మార్చు]