శంకర్ ఘోష్

వికీపీడియా నుండి
(శంకర్‌ ఘోష్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పండిట్ శంకర్ ఘోష్
జననం1935
మరణం (aged 80)
సంగీత శైలిహిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్
వృత్తిpercussionist
వాయిద్యాలుతబల

పండిట్ శంకర్ ఘోష్ (1935 – 2016 జనవరి 22) భారతీయ తబల కళాకారులు. ఆయన హిందూస్థానీ క్లాసికల్ సంగీతంలో ఫరూఖాబాద్ ఘరానాలో ప్రసిద్ధులు. ఆయన పాటియాలా ఘారానాను అనుసరించే హిందూస్థానీ క్లాసికల్ గాయకుడు.[1]

ఆయనకు 1999-2000 లో భారత అత్యున్నత సంగీత పురస్కారమైన సంగీత నాటక అకాడమీ పురస్కారం తబల విభాగంలో వచ్చింది.[2] ఆయన ఐటిసి సంగీత్‌ రిసెర్చ్‌, ఉస్తాద్‌ హఫీజ్‌ ఆలీ ఖాన్‌ అవార్డులను పొందారు. ఆయన అస్వస్థతకు గురికాబడి 2015 డిసెంబరు 14 లో హాస్పటల్ లో చేరి ఆంజియో పాస్టీ సర్జరీ చేయించుకున్నారు. ఆయన 40 రోజులపాటు కోమాలో ఉండి జనవరి 22 2016 న మరణించారు.[3]

బాల్య జీవితం, శిక్షణ[మార్చు]

ఆయన "తలీమ్"లో 1953లో శిక్షణను కలకత్తాకు చెందిన పండిత్ జ్ఞాన్ ప్రకాష్ ఘోష్ వద్ద పొందారు. [1][4] ఆయన యితర గురువులు పండిట్ జ్ఞాన్ ప్రకాష్ ఘోష్, ఉస్తాద్ ఫిరోజ్ ఖాన్, పండిట్ అనంత్ నాథ్ బోస్, పండిట్ సుదర్శన్ అధికారి.

కెరీర్[మార్చు]

ఆయన 1960 లో సరోద్ విద్వాంసులు ఆలీ అక్బర్ ఖాన్ తో కలసి అమెరికా పర్యటనకు వెళ్లారు. అచట తన తబలా కళతో అభినందన సమీక్షలను గెలుచుకున్నారు.[5][6] ఆయన పండిట్ రవిశంకర్, ఉస్తాద్ విలాయత్ ఖాన్, పండిట్ నిఖిల్ బెనర్జీ, షరాన్ రాణీ, పండిట్ వి.జి.జోగ్ లతో కూడా వివిధ పర్యటనలకు వెళ్ళి వారికి వాద్యసహకారాన్నందించారు. ఆయన భారతదేశంలో ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, పండిట్ ఓంకారణాథ్ ఠాకూర్, పండిట్ వినయక రావ్ పట్వర్థన్, గిరిజాదేవి, అక్తారీ బాయి లతో కలసి ప్రదర్శనలిచ్చారు. విదేశాలలో ఆయన ప్రముఖ కళాకారులైన "గ్రెగ్ ఎల్లిస్", "పెట లాకెట్ట్", "జాన్ బెర్గామో" వంటి వారితో కలసి పనిచేసారు.[7]

ఆయనకు "ఐటిసి సంగీత రీసెర్చ్ అకాడమీ అవార్దు", ఉస్తాద్ హఫీద్ అలీ ఖాన్ అవార్డులు వచ్చాయి. ఆయన మూడు దశాబ్దాలుగా తబలా విద్యను బోధిస్తున్నారు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆయన హిందుస్థానీ క్లాసికల్ వోకల్ కళాకారులైన సంజుక్తా ఘోష్ ను వివాహమాడారు. ఆయన కుమారుడు ప్రముఖ తబలా కళాకారులు "విక్రం ఘోష్".[8][9] ఆయన కుమారుడు ప్రముఖ కళాకారులైన ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్ లతో ప్రదర్శనలిచ్చేవాడు.[10]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Tabla maestro turns vocalist for melody concert". The Times of India. Jul 3, 2002.
  2. "SNA: List of Akademi Awardees". Official website. Archived from the original on 2012-02-17. Retrieved 2016-02-06.
  3. "Tabla maestro Pandit Shankar Ghosh passes away | Latest News & Updates at Daily News & Analysis". dna (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2016-01-22.
  4. Nettl, p. 212
  5. So Who's On Tabla?[permanent dead link] Miami News, Jul 3, 1966.
  6. Ali Akbar Khan In Theatre Archived 2016-03-06 at the Wayback Machine Montreal Gazette Archive, Sep 21, 1965."..Shankar Ghosh, who was making as a virtuoso on the tabla"
  7. "Pandir Shankar Ghosh, biography". Archived from the original on 2019-10-13. Retrieved 2016-02-06.
  8. "Parents as pillars of strength". The Telegraph. April 26, 2004. Archived from the original on 2016-03-04. Retrieved 2016-02-06.
  9. "Bikram Ghosh concert". Screen. August 25, 2006.[permanent dead link]
  10. Nettl, p. 63

ఇతర లింకులు[మార్చు]