శోభ గుర్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shobha gurtu.jpg
శోభ గుర్టు

శోభ గుర్టు(1925–2004), ప్రముఖ భారతీయ హిందుస్థానీ సంగీత కళాకారిణి. హిందుస్థానీ సంగీతంలో, లలిత సంగీత రీతిలో ఎక్కువగా పాడేది శోభ. ఆమెకు సంప్రదాయ సంగీతంలో సంపూర్ణ ప్రవేశం ఉన్నా, హిందుస్థానీ లలిత సంగీతం ద్వారానే ఎంతో ప్రసిద్ధి చెందింది ఆమె. ఆమె కచేరీలు చేసేటప్పుడు, ఆమెను టుమ్రీ క్వీన్ అని పిలిచేవారు.[1] శోభ తన గాత్రం ద్వారానే అభినయం చేసేదని ప్రసిద్ధి చెందింది.[2][3]

తొలినాళ్ళ జీవితం, నేపధ్యం[మార్చు]

1925లో కర్ణాటకలోని బెల్గాంలో జన్మించింది శోభ. శోభ అసలు పేరు భానుమతి శిరోద్కర్. ఆమె తల్లి మేనకాబాయ్ శిరోద్కరే శోభకు మొదటి గురువు. నాట్య కళాకారిణి  కూడా అయిన మేనకాబాయ్, జైపూర్-అత్రౌలీ గరానా రీతిలో  గురువైన ఉస్తాద్ అల్లాడియా ఖాన్ వద్ద సంగీతం నేర్చుకొంది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె భర్త విశ్వనాధ్ గుర్టును వివాహం చేసుకున్న తరువాత తన పేరును భానుమతి నుండి శోభ గుర్టుగా మార్చుకుంది. శోభ మామగారు పండిట్ నారాయణ్ నాధ్ గుర్టు బెల్గాంలో పోలీస్ ఆఫీసర్, పండితుడు, సితార్ వాద్య కళాకారుడు.

ఆమె కుమారుడు త్రిలోక్ గుర్టు ప్రముఖ తబలా వాద్య కళాకారుడు.[5] ఆమె మరో కుమారుడి పేరు నరేంద్ర.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]