సరస్వతి రాజమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సరస్వతి రాజమణి ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) లో మిలిటరీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వ్యక్తి. స్వాతంత్ర్య సమర పోరాటంలో మహిళలు కూడా పాల్గొన్న మహిళలలో భారతీయ గూఢచారిగా ఉండి భారత స్వాతంత్ర్యంలో చిరస్థాయిగా పేరు నిలిచిన వ్యక్తి సరస్వతి రాజమణి.

బాల్యం[మార్చు]

సరస్వతి రాజమణి 1927 జనవరి 11న బర్మాలోని రంగూన్ (ప్రస్తుత మయన్మార్) లో జన్మించింది. ఆమె తండ్రి రంగూన్ లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఒకరు. వారి కుటుంబం భారత స్వాతంత్ర్యోద్యమానికి ఉద్యమానికి మద్దతుగా ఉండే వారు. బ్రిటిష్‌ పాలనలోని బర్మా ప్రజలకు స్ఫూర్తినిచ్చేందుకు గాంధీజీ 1937లో అక్కడ పర్యటించారు. అపుడు భారతదేశం నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డ అనేక కుటుంబాలు గాంధీజీని కలవడం జరిగి, భారత జాతీయోద్యమానికి తమ మద్దతు పలికాయి. అక్కడ రాజమణి తండ్రి ఇంటికి గాంధీ వెళ్లడం జరిగింది . అక్కడ అతనుకు వారి 10ఏళ్ల బాలిక రాజమణి పిస్తోల్‌తో ఆడుకుంటోంది. ‘తుపాకీతో ఆడుతున్నావ్‌...షూటర్‌ కావాలనుకుంటున్నావా’ అని అడిగారు మహాత్ముడు! ‘‘లేదు... బ్రిటిష్‌వారిని షూట్‌ చేసేందుకు’’ అని వెంటనే బదులిచ్చింది ఆ చిన్నారి. ‘మనం అహింసా పద్ధతుల్లో వారితో పోరాడుతున్నాం. అదే మార్గంలో నడవాలి’ అని గాంధీజీ అనగానే... ‘‘‘‘లూటీ చేసేవారిని మనం షూట్‌ చేస్తాం కదా! బ్రిటిష్‌వారు మనల్ని లూటీ చేస్తున్నారు. కాబట్టి పెద్దయ్యాక ఒక్క ఆంగ్లేయుడినైనా షూట్‌ చేస్తా అని సమాధానం ఇవ్వడం జరిగింది.[1]

ఇండియన్ నేషనల్ ఆర్మీ[మార్చు]

సుభాష్‌ చంద్రబోస్‌ ఇచ్చిన "ఆంగ్లేయులను పారదోలాలంటే అంతా ఆయుధాలు పట్టాలన్న పిలుపు" రాజమణి ఆకట్టుకొన్నది. ఆజాద్‌ హింద్‌ఫౌజ్‌కు వాలంటీర్లను తీసుకోవాలని, దానితో పాటు నిధుల సమీకరణకోసం 1944లో బోస్‌ బర్మా రావడం జరిగింది. ఈ సందర్భంగా రాజమణి తన విలువైన నగలన్నింటినీ బోస్‌కు ఇవ్వగా, బోస్‌ వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. కానీ ఆమె పట్టువీడకపోవటంతో అతను స్వయంగా వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యలతో చెప్పినా రాజమణి వెనక్కి తగ్గలేదు. బోస్ ఈ సమయంలో ఆమెకు ఉన్న పట్టుదల, తెలివిని గమనించిన బోస్‌, ఆభరణాల కంటే రాజమణిని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (ఐఎన్‌ఏ) లో చేర్చుకుంటానని మాటిచ్చారు. బోస్ రాజమణి తెలివి తేటలకు మెచ్చి ఆమె పేరుకు సరస్వతి అని చేర్చడం, ఆనాటి నుంచి సరస్వతి రాజమణిగా మారింది. బోస్ రాజమణిని, ఆమె నలుగురు స్నేహితులను ఇండియన్ నేషనల్ ఆర్మీ గూఢచారి విభాగంలో గూఢచారులుగా నియమించుకోవడం జరిగింది. రాజమణి, ఆమె స్నేహితులు మగవారిగా మారువేషంలో బ్రిటిష్ సైనిక శిబిరాలలో పనిచేయడం, అధికారుల ఇళ్ళలో పనివారుగా పనిచేయడం ప్రారంభించి, వారికి బ్రిటిష్ అధికారుల నుండి ప్రభుత్వ ఆదేశాలను, సమాచారాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీకి అందించే వారు.[2]

భారతదేశం కు రావడం[మార్చు]

జపనీస్ యుద్ధంలో ఓడిపోయిన తరువాత, నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీని రద్దు చేశారు. నేతాజీ సూచనల మేరకు సరస్వతిభారతదేశానికి తిరిగి వచ్చారు. రాజమణి కుటుంబం బర్మాలోని తమ ఆస్తులన్నింటినీ విక్రయించి, భారత్‌కు తిరిగి రావడం జరిగింది. .

రాజమణి 2005లో ఓ ఇంటర్వ్యూలో నేతాజీ మనందరికీ దేవుడి లాంటి వారని, చాలా గొప్పవాడు, రేపు ఏమి జరుగుతుందో అతను చూడగలిగాడు. అతను వివిధ మారువేషాలలో రావడం ద్వారా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశ్చర్యపరిచే వారు, స్వామి వివేకానంద ఆదర్శాలను అతను విశ్వసించారని పేర్కొన్నారు.[3]

మరణం[మార్చు]

స్వాతంత్ర్యానంతరం 1957లో సరస్వతి కుటుంబం తమిళనాడుకు రావడం జరిగింది, 1971 దాకా ఆమెకు ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్‌ ఇవ్వలేదు. 2005 దాకా చెన్నైలోని ఓ చిన్న అపార్ట్‌మెంటులో జీవితం గడిపిన ఆమెను అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆర్థికంగా ఆదుకున్నారు. 2004లో సునామీ బాధితులకు తన పింఛన్‌ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన సరస్వతి రాజమణి 90 ఏళ్ల వయసులో 2018 జనవరి 13 లో కన్నుమూశారు. ఒడిశాలోని కటక్‌లోని నేతాజీ సుభాష్ జన్మస్థలం నేషనల్ మ్యూజియం ఇండియన్ నేషనల్ ఆర్మీ గ్యాలరీకి ఆమె చిహ్నాలను విరాళంగా అందించారు.[4]

మూలాలు[మార్చు]

  1. Pant, Manasi (2019-09-08). "Saraswathi Rajamani: India's Youngest Spy In The INA | #IndianWomenInHistory". Feminism In India (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-03-20.
  2. "The Forgotten Spy: The Untold Story of India's Youngest Covert Agent, Saraswathi Rajamani". The Better India (in ఇంగ్లీష్). 2016-10-18. Retrieved 2022-03-20.
  3. "Here's The Story Of Freedom Fighter Saraswathi Rajamani, Who Was Also India's First Woman Spy". IndiaTimes (in Indian English). 2017-03-03. Retrieved 2022-03-20.
  4. Mishra, Yash (2021-04-10). "Saraswathi Rajamani: India's Teenage Spy". www.livehistoryindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-20.