సరోజిని సాహూ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సరోజిని సాహూ
ସରୋଜିନୀ ସାହୁ
సరోజినీ సాహు
పుట్టిన తేదీ, స్థలం (1956-01-04) 1956 జనవరి 4 (వయసు 68)
దెంకనల్, ఒడిషా, భారతదేశం
వృత్తినవలా రచయిత్రి, కథా రచయిత్రి, కవయిత్రి, వ్యాసకర్త, విద్యావేత్త
జాతీయతభారతీయురాలు
కాలంప్రస్తుతం

సరోజిని సాహూ ( జననం: జనవరి 4, 1956 ) ప్రముఖ నవలా రచయిత్రి[1], ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కాలమిస్టు[2]. ఆమె ఒడిశా సాహిత్య అకాడమీ విజేత[3].

జీవితం[మార్చు]

సరోజిని సాహూ ఒడిషా రాష్ట్రంలోని దెంకనల్ అనే చిన్న పట్టణంలో ఈశ్వర చంద్ర సాహు, నళినీ దేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించింది[4]. ఈమె ఒడియా సాహిత్యంలో ఎం.ఎ., పి.హెచ్.డి పట్టాలను పొందింది. తరువాత ఉత్కళ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని సాధించింది. ఈమె ప్రస్తుతం బేల్పహార్, జర్సుగుడలోని డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది. ఈమె ప్రముఖ ఒడిషా రచయిత జగదీశ్ మహంతిని వివాహం చేసుకుంది. ఈమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. [5]

రచనలు [మార్చు]

నవలలు[మార్చు]

  • ఉపనిబేష్ (1998)
  • ప్రతిబంది (1999) ISBN 81-7411-253-7
  • స్వప్న ఖోజలి మనె (2000)
  • మహాజాత్ర (2001)
  • గంభీరి ఘరా (2005)
  • బిషాద్ ఈశ్వరి (2006)
  • పక్షిభాష (2007)
  • అసామాజిక్ (2008)

కథలు[మార్చు]

ఈమె పది కథా సంపుటులను ప్రకటించింది.

ఆంగ్లకథా సంపుటులు[మార్చు]

హిందీ కథా సంపుటి[మార్చు]

బెంగాలీ కథా సంపుటి[మార్చు]

  • దుఃఖ అప్రిమిత(2012)[6]

ఒడియా కథా సంపుటులు[మార్చు]

  • సుఖర ముహన్‌ముహిన్ (1981)
  • నిజ గహిరరెనిజె (1989)
  • అమృతర ప్రతీక్షరె (1992)
  • చౌకత్ (1994)
  • తరళి జౌతిబ దుర్గ (1995)
  • దేశాంతరి (1999)
  • దుఃఖ అప్రిమిత (2006)
  • సృజని సరోజిని (2008)

పురస్కారాలు[మార్చు]

  • ఒడిశా సాహిత్య అకాడమీ అవార్డు, 1993
  • ఝంకార్ అవార్డు, 1992
  • భువనేశ్వర్ బుక్ ఫెయిర్ అవార్డు, 1993
  • ప్రజాతంత్ర అవార్డు, 1981,1993
  • లాడ్లీ మీడియా అవార్డు, 2011

మూలాలు[మార్చు]

  1. Oriya Nari . Accessed 7 November 2010
  2. Express Buzz[permanent dead link]. Accessed 7 November 2010
  3. Orissa Sahitya Akademy Archived 2012-04-10 at the Wayback Machine. Accessed 7 November 2010
  4. Official web site Archived 2007-09-30 at the Wayback Machine. Accessed 11 August 2007
  5. Official web site Archived 2007-09-30 at the Wayback Machine. Accessed 11 August 2007
  6. ISBN 978-984-404-243-8, published by Milan Nath, Anupam Prakashani,38/4, Bangla Bazar, Dhaka 1100

బయటి లంకెలు[మార్చు]