సర్వే సత్యనారాయణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్వే సత్యనారాయణ
సర్వే సత్యనారాయణ


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం
పదవీ కాలం
2004 – 2009
నియోజకవర్గం సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం

కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2012 – 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1954-04-04) 1954 ఏప్రిల్ 4 (వయసు 70)
హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ (1989-2020)[1]
జీవిత భాగస్వామి సునీత
సంతానం ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు
నివాసం మహేంద్రాహిల్స్‌, మారేడుపల్లి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
వృత్తి న్యాయవాది
రాజకీయ నాయకుడు

సర్వే సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అయన ఒకసారి ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా పనిచేసి, 2012లో యూపీఏ (కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సర్వే సత్యనారాయణ 1954 ఏప్రిల్ 4లో సర్వే లక్ష్మయ్య, మల్లమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. సర్వే సత్యనారాయణ 13 ఏళ్ల పాటు ప్రభుత్వ సర్వీసులో కొనసాగి ఎస్‌ఎఐల్ ట్రేడ్ యూనియన్ నాయకునిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

సర్వే సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య పై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పడండంతో ఆయన 2009లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి టి.భీంసేన్ పై గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

సర్వే సత్యనారాయణ 2012లో యూపీఏ (కాంగ్రెస్ పార్టీ) ప్రభుత్వంలో కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[3] ఆయన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి, 2015లో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4] సర్వే సత్యనారాయణ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[5] ఆయనను 2019 జనవరి 6న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.[6] సర్వే సత్యనారాయణ జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7]

మూలాలు[మార్చు]

  1. The New Indian Express (21 November 2020). "Senior Congress leader Sarve quits party ahead of GHMC polls, joins hands with BJP". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  2. Sakshi (6 April 2014). "పాత.. కొత్త కలబోత". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  3. Parliament of India LOK SABHA (2012). "Members : Lok Sabha". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  4. The Hans India (4 November 2015). "Congress leader Sarve Satyanarayana Rao files nomination" (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  5. BBC News తెలుగు (15 November 2018). "ఎంపీలుగా ఓడారు.. ఎమ్మెల్యే టికెట్ పట్టారు". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  6. Sakshi (6 January 2019). "కాంగ్రెస్‌ నుంచి సర్వే సస్పెండ్‌..!". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
  7. Zee News Telugu (21 November 2020). "బీజేపీలో చేరిన సర్వే సత్యనారాయణ.. కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు". Archived from the original on 21 November 2020. Retrieved 30 December 2021.