Jump to content

సాత్నా జిల్లా

వికీపీడియా నుండి
Satna జిల్లా
सतना जिला
మధ్య ప్రదేశ్ పటంలో Satna జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Satna జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుRewa division
ముఖ్య పట్టణంSatna
Government
 • లోకసభ నియోజకవర్గాలుSatna
విస్తీర్ణం
 • మొత్తం7,502 కి.మీ2 (2,897 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం22,28,619
 • జనసాంద్రత300/కి.మీ2 (770/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.79%
 • లింగ నిష్పత్తి927
Websiteఅధికారిక జాలస్థలి
శారదా దేవాలయం, మైహార్ నుండి దృశ్యం

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సత్నా జిల్లా (హిందీ:सतना) ఒకటి. సాత్నా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జనసాంధ్రత 249. జిల్లావైశాల్యం 7,502 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 1,868,648. వీరిలో 20.63% ప్రజలు నగరప్రాంతంలో నివసిస్తున్నారు. 1948లో ఈ జిల్లా రూపొందించబడింది.

భౌగోళికం

[మార్చు]

సత్నా జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఉంది, తూర్పు సరిహద్దులో రీవా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఉమరియా జిల్లా, కట్నీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో పన్నా జిల్లా ఉన్నాయి.[1]

విభాగాలు

[మార్చు]
  • జిల్లా రీవా డివిజన్‌లో భాగం.
  • జిల్లా 2 తాలూకాలుగా విభజించబడి ఉంది: అమర్‌పతన్, మైహర్, నగొడి, రఘురాజ్ నగర్.
  • సత్నా పట్టణం రఘురాజ్‌ తాలూకాలో ఉంది.

చరిత్ర

[మార్చు]

సత్నా జిల్లా భుగేల్ఖండ్ ప్రాంతం భాగం. దీనిలో అత్యధికభాగం రీవా రాజాస్థానం పాలనలో ఉండేది. పశ్చిమ సత్నాలో కొంతభాగం బ్రిటిష్ సామ్రాజ్య సామంత ప్రభువులు పాలించారు. ఇందులో 11 రాజాస్థానాలు ఉన్నాయి (మైహర్, నగాడ్, సిహవల్, కొతీ, జాసో, బరౌంధ,, చంపుర్వాల 5 చౌబీ జగీర్, పహ్రా, తరవన్, భైసుంద, కంత- రాజౌల). .[2]

హైహయులు

[మార్చు]

మహాభారత, ఆరంభకాల బౌద్ధుగ్రంధాలకు బఘేల్‌ఖండుతో సంబంధాలు ఉండేవి. బఘేల్‌ఖండును హైహయులు, కల్చురీ (చేది) పాలించారు. 3వ శతాబ్దంలో ఈ ప్రాతంమీద వీరు ఆధిక్యం సాధించారు. వారికి మహిష్మతి రాజధానిగా ఉండేది. (కొంతమంది దీనిని ఖర్‌గోన్ జిల్లాలోని మహేశ్వర్‌గా గుర్తించారు). తరువాత వారు తూర్పుదిక్కుగా రాజ్యవిస్థరణ చేసారు. తరువాత వారు కలింజర కోటను స్వాధీనం చేసుకున్నారు (ఉత్తరప్రదేశ్ సరిహద్దులు దాటి కొన్ని మైళ్ళు). కలింజర్ కోటను ఆధారంగా చేసుకుని వారి సామ్రాజ్యాన్ని బగేల్ఖండ్ దాటి విస్తరించారు. 4-5 శతాబ్ధాలలో గుప్తులు ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించారు. ఉచచకల్ప రాజప్రతినిధులు (నాగోడ్ తాలూకాలోని ఉంచెరా), కోట్ పరివ్రాజక రాజాలు (నాగోడ్ తాలూకా) ఈ ప్రాంతంమీద స్వాతంత్ర్యం ప్రకటించారు. తరువాత చేదివంశీయులు బలవంతులైయ్యారు. వారు తమను కలజరాధీశ్వరులు అని ప్రకటించుకున్నారు. చండేల్ రాజప్రతినిధి యశోవర్మ (925-55)) కలింజర్ కోటను స్వాధీనం చేసుకున్నారు. 12 వ శతాబ్దం వరకు భుభాగం మీద ఆధిక్యత కలిగి ఉన్నారు..[2]

బంగేల్ రాజపుత్రులు

[మార్చు]

రీవాను పాలించిన రాజప్రతినిధులు అగేల్ రాజపుత్రులు సోలంకి వంశానికి చెందినవారు. గుజరాత్ పాలకుని సోదరుడు వ్యాఘ్రదేవ్ ఉత్తర భారతంవైపు దండయాత్ర సాగించి 13వ శతాబ్దం మద్యకాలానికి మార్ఫా కోటను (కలింజర్ కోట నుండి 18 మైళ్ళు) స్వాధీనం చేసుకున్నాడు. ఆయన కుమారుడు కరండియో కల్చురి (హైహయ) రాకుమారిని మండ్లను వివాహం చేసుకుని కట్నంగా బంధోగర్ కోటను (ప్రస్తుతం ఇది షహ్‌డోల్ జిల్లాలో అదే పేరుతో తాలూకాగా ఉంది) పొందాడు. 1597లో దీనిని అక్బర్ ధ్వంసం చేసాడు. .[2]

ఉలుఘ్ ఖాన్

[మార్చు]

1298లో ఉలుఘ్ ఖాన్ చివరి గుజరాత్ బగేల్ రాజుని ఈ ప్రాంతం నుండి తరిమివేసాడు. అందువలన బఘేల్ రాజులు బంధోగర్ వైపు వసల పోయారు. 15వ శతాబ్దం వరకు బంధోగర్ బగేల్‌రాజులు ఢిల్లీ రాజుల దృష్టి నుండి తప్పుకుంటూ తమ రాజ్యాంమీద ఆధిక్యతను రక్షించుకున్నారు. 1498-9 సికందర్ - లోడి బంధోగర్ కోటను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైయ్యాడు. అక్బర్ సమకాలీనుడు బగేల్ రాజు రామచంద్ర ( 1555 - 92) కుమారుడు బిర్ధబ్రా మరణించిన తరువాత పిన్న వయద్కుడైన ఆయన కుమారుడు విక్రమాదిత్య సింహాసనం అధిష్టించాడు. రాజ్యంలో తలెత్తిన అరాచకం అనుసరించి అక్బర్ బంధోగర్ మీద దండేత్తి 1597 రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత రీవా పట్టణం ప్రాముఖ్యత సంతరించుకుంది. [2]

బ్రిటిష్ పాలన

[మార్చు]

1803లో బసియన్ ఒప్పందం తరువాత బ్రిటిష్ రీవా పాలకులతో కూటమి ఏర్పరచుకుని తరువాత దానిని రద్దు చేసింది. 1812లో రాజా జైసింగ్ కాలంలో (1809- 35) పిండారీలు మిర్జాపూర్ నుండి రీవా ప్రాంతం వరకు దాడి చేసారు. అందువలన జైసింగ్ బ్రిటిష్ ప్రభుత్వంతో బ్రిటిష్ రక్షణను కోరుతూ ఒక ఒప్పందానికి అంగీకరించాడు. పొరుగురాజుల వివాదాల మధ్య జైసింగ్ బ్రిటిష్ సౌన్యాలకు ఈ ప్రాంతంలో ప్రవేశించడానికి అనుమతించాడు. 1857 ఉద్యమకాలంలో రఘురాజ్ సింగ్ మండ్ల, జబల్‌పూర్, నాగోడ్ (ప్రస్తుతం సత్నా జిల్లాలో భాగం) లలో తలెత్తుతున్న ఉద్యమస్ఫూర్తిని అణిచివేయడానికి బ్రిటిష్ సైన్యానికి సహకరించాడు. ఫలితంగా అయన బ్రిటిష్ ప్రభుత్వం నుండి సోహాపూర్ (షహ్‌డోల్), అమర్‌కంటక్ పరగణాలను పాలించే అధికారం బహుమతిగా పొందాడు. రీవా పాలకులు " హీస్ హైనస్ , మహారాజా " బిరుదులను 17 తుపాకీల వదనం సత్కారం పొందారు. రఘురాజనగర్‌లో అత్యధికభాగం, ప్రస్తుత సత్నా జిల్లాలోని అమర్‌పతన్ తాలూకా రీవా రాజ్యంలో భాగంగా ఉండేది.[2]

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సత్నా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,228,619,[4]
ఇది దాదాపు. లతివా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[6]
640 భారతదేశ జిల్లాలలో. 203 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 297 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.17%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 927:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 73.79%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

2011 గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
2001 గణాంకాల ప్రకారం - జనసంఖ్య 1,868,648
నగరీకరణ శాతం
ఇందులో పురుషుల సంఖ్య 970,114
స్త్రీలసంఖ్య 898,534
స్త్రీ పురుష నిష్పత్తి
జాతీయ సరాసరి 928 కంటే
అక్షరాస్యతా శాతం 926:1000
1991 నుండి 2001 వరకు జనసంఖ్య అభివృద్ధి. 27.52%
జనసాంధ్రత 249

[7]

భాషలు

[మార్చు]

సత్నా జిల్లాలో బఘేలి భాష వాడుకలో ఉంది. ఇది హిందీ భాషను పోలి ఉంటుంది. ఈ భాష 72.91% ప్రజలకు వాడుక భాషగా ఉంది. [8] (జర్మన్, ఇంగ్లీష్ 60% పోల్చితే) [9] ఈ భాషకు 78,00,000 మంది వాడుకరులు ఉన్నారు.[8]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

సత్నా జిల్లాలో ఆర్కిటెక్చురల్, ఆధ్యాత్మిక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి.

చిత్రకోట్

[మార్చు]

చిత్రకోట్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, ఆర్కిటెక్చురల్ ప్రాధాన్యత కలిగిన పట్టణంగా గుర్తుంచబడుతుంది. సత్నా జిల్లా బుండేల్ఖండ్ భూభాగంలో ఉంది. చిత్రకూట్‌లో పురాణాలలో ప్రస్తావించబడిన పలు ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. దట్టమైన చిత్రకూట రామలక్షణులు సీత 11 సంవత్సరాల కాలం నివసించారని పురాణ కథానాలు వివరిస్తున్నాయి. అత్రి మహర్షి అనసూయలు, దత్తాత్రేయ, మార్కండేయ మహర్షి, శరభంగమహర్షి, సుతీక్ష్ణ మహర్షి మొదలైన పలువురు మహర్షులు ఇక్కడ నివసించారు.[10]

మైహర్

[మార్చు]
Maihar Railway Station

మైహర్‌ నుండి 5 కి.మీ దూరంలో ఉన్న త్రికూట పర్వతశిఖరం మీద శారదా దేవి ఆలయం ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి 1,000 మెట్లు ఉన్నాయి. సంవత్సరం అంతా వేలాది భక్తులు వస్తుంటారు. మిహర్ వద్ద 3.1 మిలియన్‌టన్నుల సిమెంటును ఉతపత్తి చేస్తున్న మైహర్ సిమెంటు ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ కాంప్లెక్స్, టౌన్షిప్ సరళానగర్ వద్ద ఉంది. మైహర్‌కు 8కి.మీ దూరంలో మైహర్ - ధంద్వాహి రహదారి మార్గంలో ఉంది. ఇవికాక జిల్లాలో కె.జె.ఎస్ సెమెంట్, రిలయంస్ సెమెంట్ అనే మరొక రెండు కంపనీలు ఉన్నాయి.

బీర్సింగ్‌పూర్

[మార్చు]

సత్నా రోడ్డుకు 0.5కి.మీ దూరంలో ఉన్న బీర్సింగ్‌పూర్‌లో పురాతనమైన శివాలయం ఉంది. ఇక్కడికి సంవత్సరం అంతా వేలాది భక్తులు వస్తుంటారు.

గ్రిద్రజ్ పర్వత్

[మార్చు]

గ్రిద్రజ్ పర్వత్ (హింది:गृद्घराज पर्वत) ఆధ్యాత్మిక, ఆర్కిటెక్చురల్, పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఇది సత్నా జిల్లాలో రామ్‌నగర్ తాలూకాలోని దేవ్రజ్నగర్ గ్రామంలో ఉంది. రామ్‌నగర్ పట్టణానికి ఇది 8కి.మీ దూరంలో ఉంది. గ్రిద్రజ్ పర్వత్ ప్రస్తావన స్కందపురాణంలో ఉంది. పురాణకాలంలో దీనిని గ్రిద్దాంచల్ పర్వతం అనేవారు. [11] ఇది రామాయణంలోని జటాయువు సోదరుడు సంపాతి జన్మస్థలమని భావిస్తున్నారు. మహాకవి కాళిదాసు ఈ ప్రదేశాన్ని " గ్రిద్దరాజ్‌ మహాత్య " అని పేర్కొన్నాడు. సముద్రమట్టానికి 2,354 అడుగుల ఎత్తులో జన్మించిన మానసి గంగా నదిలో స్నానంచేస్తే సకలపాపాలు పరిహారం ఔతాయని నారదుడు చెప్పాడు. శివమహిత్యంలో కూడా ఈ పర్వత ప్రస్తావన ఉంది .[12] చైనాయాత్రికుడు పాహియాన్ ఈ ప్రదేశాన్ని సందర్శించాడు.[13]

భర్హత్

[మార్చు]

సత్నా జిల్లా భర్హత్ బౌద్ధకేంద్రంగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడి ఆర్కియాలజీ నిక్షేపాలు దేశంలోని మ్యూజియాలకు, ప్రంపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియాలకు బహుమతిగా ఇవ్చబడ్డాయి. ఈ బౌద్ధస్థూపాన్ని క్రి.పూ 3వ శతాబ్దంలో మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించాడు. ఈ స్థూపానుకి క్రీ.పూ 2 వ శతాబ్దంలో సుంగ కాలంలో అదనపు అలంకరణలు చేయబడ్డాయి.

ఇతర ప్రాంతాలు

[మార్చు]
  • రాంవన్‌ వద్ద ఉన్న తులసీ మ్యూజియం: పురాతనమైన పలు శిల్పాలు ఉన్నాయి.
  • బీర్సింగ్‌పూర్ వద్ద పురాతన శివాలయం ఉంది.
  • మధ్యప్రదేష్‌లోని వాణిజ్య ప్రాంతాలలో సత్నా జిల్లా ఒకటి.
  • రాంస్థాన్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయం ప్రసిద్ధ సిద్ధ పీఠాలలో ఒకటిగా గుర్తినబడుతుంది.
  • సత్నాజిల్లాలోని ఖాంహరియా తివారియన్ గ్రామంలో డోలోమౌట్ గనులు ఉన్నాయి..

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Satna". mponline. Archived from the original on 2010-07-14. Retrieved 2010-08-18.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "History of Satna". Satna District Administration. Retrieved 2010-08-18.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est.
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179
  7. "Population, decadal growth rate, sex ratio and density – States/Union territories and Districts : 2001". Table 1. Education for all in India, Source:Registrar General of India, Government of India, New Delhi. Archived from the original on 2009-09-17. Retrieved 2010-08-12.
  8. 8.0 8.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  9. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  10. Vinod Avasthi: Chitrakuta darshan (Hindi), Purushotam Das Agarwal, Banda
  11. (page 208)
  12. (Chapter 19-Bhoogol varnan)
  13. Legge, James. A Record of Buddhistic Kingdoms, Being an Account by the Chinese Monk Fa-Hien of his Travels in India and Ceylon (A.D. 399-414) in Search of the Buddhist Books of Discipline, Chapter XXIX : Gridhra-Kuta Hill, and Legends. Fa-Hien Passes a Night On It. His Reflections.

వెలుపలి లింకులు

[మార్చు]
  • [1] list of places in Satna

వెలుపలి లింకులు

[మార్చు]