సిరందాసు వెంకట రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శరద్ కుమార్
Indian artist S.V. Rama Rao holds up an abstract art painting at his sister's house in Guntur
జననం1936
గుడివాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిచిత్రకారుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కళాకారుడు
జీవిత భాగస్వామిసుగుణ
పిల్లలుపద్మావతి
పురస్కారాలుపద్మశ్రీ
లార్డ్ క్రాప్ట్ అవార్డు
కామన్వెల్త్ లో ప్రతిభావంతుడైన కళాకారుడు

సిరందాసు వెంకట రామారావు, (జ 1936) భారత సంతతికి చెందిన బ్రిటిష్ చిత్రకారుడు.[1][2][3] అకను క్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యుడు.[4] 1962లో కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు.[4] భారత ప్రభుత్వం అతనికి దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ యిచ్చి సత్కరించింది.[5]

జీవిత విశేషాలు[మార్చు]

అతని తండ్రి చెక్కతో శిల్పాలు చేసేవాడు. తరువాత నిర్మాణ పని చేసేవాడు.[4][6][7] వెంకట రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడ లో 1936లో జన్మించారు.[2][3][8][9] అకౌంటింగ్, బ్యాంకింగ్ లలో 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టాను పొందాడు.[6] ఆ కాలంలో కె.వేణుగోపాల్ వద్ద శిక్షణ పొందాడు.[7] తరువాత కె.శ్రీనివాసులు వద్ద శిక్షణ పొంది [3] 1955లో ఫైన్ ఆర్ట్స్ నందు ప్రభుత్వ డిప్లొమాను చెన్నైలోని కళాక్షేత్రం నుండి పొందాడు.[6] తరువాత శిక్షణ కోసం మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ (ప్రభుత్వ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై) చేరాడు.[4][9] 1959లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు.[6] అదే విధంగా ఎకనమిక్స్ ను అభ్యసించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందాడు.[6]

అతను చెన్నైలో ప్రసిద్ధ చిత్రకారుడు కె.సి.ఎస్.పణికేర్ తో కలసి పనిచేసాడు.[3][6][7] అతను 1959లో న్యూఢిల్లీ వెళ్ళాడు. అక్కడ భారత ప్రభుత్వ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది 1962 వరకు అక్కడనే ఉన్నాడు.[6] ఆ సంవత్సరం కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు.[3] తరువాత ఆయాన్ యునైటెడ్ కింగ్ డం కు వెళ్ళి [4] అక్కడ స్లాడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లలో 1965 వరకు విలియం కోల్డ్‌స్ట్రీమ్‌ అద్వర్యంలో చదివాడు.[6][9] తరువాత రెండు సంవత్సరాలు లండన్ కంట్రీ కౌన్సిల్ లో పెయింటింగ్, డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసాడు.[6][9] తరువాత 1967లో యు.ఎస్ వెళ్ళి 1969లో చిన్‌సిన్నాటి విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.అక్కడ అతను టీచింగ్ అసిస్టెంటుగా 1969 వరకు పనిచేసాడు.[6][9] తరువాత వెస్టెర్న్ కెంటుకీ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసరుగా పనిచేసాడు.[6][9] తరువాత చిగాగో వెళ్లాడు.[4]

లండన్ లోని టాటా గ్యాలరీ, న్యూయార్క్ లోని మెట్రొపోలియన్ మ్యూజియం ఆర్ట్స్ నందు అతను చిత్రించిన చిత్రాలను చూడవచ్చు.[7] ప్రపంచంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియం లలో అతను గీసిన చిత్రాలు ఉన్నాయి.

అతను చిత్రకళ, కవిత్వం పరంగా ప్రసిద్దుడు.[4][10] సుగుణ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె (పద్మావతి) జన్మించింది. ఆమె భరతనాట్యంలో సుపరిచితురాలు [6] అతను 2003 లో భారతదేశానికి తిరిగి వచ్చి, తన పనిని కొనసాగిస్తాడు.[6].[4]

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Bonhams". Bonhams. 2014. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 9 January 2015.
  2. 2.0 2.1 "Mutual Art". Mutual Art. 2014. Retrieved 9 January 2015.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "The Hindu". The Hindu. 9 August 2012. Retrieved 9 January 2015.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 "Indian Express". Indian Express. 9 September 2012. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 9 January 2015.
  5. "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 11 November 2014.
  6. 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 6.10 6.11 6.12 6.13 6.14 6.15 "Lyra Technologies" (PDF). Lyra Technologies. 2014. Retrieved 9 January 2015.
  7. 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "Frontline". Frontline. June 2012. Retrieved 9 January 2015.
  8. "BBC". BBC. 2014. Retrieved 9 January 2015.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 9.7 "Akhila Bharata Padmashali Sangam". Akhila Bharata Padmashali Sangam. 2014. Archived from the original on 30 జనవరి 2015. Retrieved 9 January 2015.
  10. Siramdasu Venkata Rama Rao. The Paintings of the Author. University of Cincinnati.

ఇతర లింకులు[మార్చు]