సుధీర్ తైలంగ్

వికీపీడియా నుండి
(సుధీర్‌ తైలంగ్‌ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సుధీర్‌ తైలంగ్‌
Tailang01.jpg
పుట్టిన తేదీ, స్థలం(1960-02-26)1960 ఫిబ్రవరి 26
బికనీర్, రాజస్థాన్, భారత దేశం
మరణం2016 ఫిబ్రవరి 6(2016-02-06) (వయసు 55)
వృత్తికార్టూనిస్టు
జాతీయతభారతీయుడు
పురస్కారాలుపద్మశ్రీ(2004)
జీవిత భాగస్వామివిభా తైలంగ్
సంతానంఅదితి తైలంగ్
భారతీయ మీడియాలోని ప్రముఖ కార్టూనిష్టులు సుధీర్ తైలంగ్, శేఖర్ గురేర. వారి వెనుక ఉన్న స్త్రీ విభా తైలంగ్, రేఖా గురేరా. 2015 నేషనల్ ప్రెస్ డే సందర్భంగా న్యూఢిల్లీ లోని విజ్ఞాన భవన్ లో ఛాయాచిత్రం.

సుధీర్‌ తైలంగ్‌ (1960 ఫిబ్రవరి 26 – 2016 ఫిబ్రవరి 6) సుప్రసిద్ధ భారతీయ కార్టూనిస్టు.

జీవిత విశేషాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం

రాజస్థాన్‌ లోని బీకానేర్‌లో ఫిబ్రవరి 26 1960 న జన్మించారు.[1] ఆయన పాత్రికేయ జీవితం 1982లో ముంబయి నుంచి వెలువడిన 'ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా'లో మొదలైంది. 1970లోనే ఆయన తన తొలి కార్టూన్‌ గీశారు. 1983లో ఆయన 'నవభారత్‌ టైమ్స్‌'లో పని చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆంగ్ల దినపత్రిక 'హిందుస్తాన్‌ టైమ్స్‌'లో పనిచేశారు. ఇంకా, 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌', 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా' వంటి దినపత్రికల్లో కూడా ఆయన కార్టూన్లు వేశారు.[2] తైలంగ్ పూర్వీకులు తెలంగాణకు చెందినవారని, తెలంగాణగా ఉన్న పేరు తైలంగ్‌గా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజస్తాన్‌లోని బికనూర్‌లో పుట్టిన సుధీర్ తైలంగ్ ప్రముఖ రాజకీయ నేతలపై కార్టూన్లు వేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

2004లో ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది[3]. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై వేసిన కార్టూన్లన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. ఆ పుస్తకం పేరు 'నో, ప్రైమ్‌ మినిస్టర్‌'[4].

మరణం[మార్చు]

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఇప్పటికే రెండుసార్లు సర్జరీ చేసుకున్న ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ సుధీర్ తైలంగ్ (56) గుర్గావ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 6 2016 న మరణించారు.[5]

మూలాలు[మార్చు]

  1. "Cartoonist Sudhir Tailang Dies At 55". Indo-Asian News Service. 6 February 2016. Retrieved 6 February 2016.
  2. "కార్టూనిస్టు సుధీర్‌ తైలంగ్‌ కన్నుమూత". Archived from the original on 2016-02-07. Retrieved 2016-02-07.
  3. Padma Shri Awardees of 2004
  4. No Prime Minister Launched[permanent dead link]
  5. "ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ కన్నుమూత". సాక్షి. 7 February 2016. Retrieved 7 February 2016.

ఇతర లింకులు[మార్చు]