సెల్ఫీ ఆఫ్ సక్సెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సెల్ఫీ ఆఫ్ సక్సెస్
Selfie of success.jpg
కృతికర్త: బుర్రా వెంకటేశం
దేశం: భారతదేశం
భాష: ఇంగ్లీషు, తెలుగు, స్పానిష్, బెంగాలీ
విభాగం (కళా ప్రక్రియ): నాన్ - ఫిక్షన్
ప్రచురణ: ప్రతాప్ చౌదరి
విడుదల:
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-8832587005

సెల్ఫీ ఆఫ్ సక్సెస్ (విజయంతో స్వీయచిత్రం), సక్సెస్ ఉందని ఎలా తెలుస్తుందనే అంశం మొదలుకొని, సక్సెస్ ను ఎలా నిలుపుకోవాలి అనే అంశం వరకు వివిధ దశలను వివరించే పుస్తకం. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఇంగ్లీషులో ఈ పుస్తకాన్ని రచించాడు. ఆయన తన మొదటి పుస్తకం తోనే రచయితగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు అందుకున్నాడు. ప్రముఖ ఆన్ లైన్ విక్రయ సంస్థ ఆమెజాన్ పుస్తక విక్రయాల్లో ఇది నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.[1]

పుస్తకంలోని భాగాలు[మార్చు]

సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకంలో ఐదు భాగాలున్నాయి. ఈ విభాగాలన్నీ గెలుపును ఎలా ఎంచుకోవడం మొదలు గెలుపు పరమార్థాన్ని ఎలా అనుభవించాలి అనే వరకు వివిధ విభాగాల్లో ప్రతీ అంశానికి సంబంధించి ప్రముఖులైన మహాత్మా గాంధీ, మదర్ థెరిస్సా, థామస్ అల్వా ఎడిసన్, అడాల్ఫ్ హిట్లర్, జె.ఆర్.డి.టాటా, బిల్ గేట్స్, పాబ్లో ఎస్కోబార్, జాక్మ, స్టీవ్ జాబ్స్, వారెన్ బఫెట్, డేవిడ్ సర్నీప్, షేక్స్పియర్, మైఖేల్ జాక్సన్, జేకే రోలింగ్, ఓప్రా విన్‌ఫ్రే, గోవింద్ ఫాల్కే, మేరీకోం, రామోజీరావు జీవితాలను ఉదహరిస్తూ వివరించాడు.[2]

  1. స్నాప్ షాట్ ఆఫ్ సక్సెస్ (గెలుపు యొక్క అవగాహన)
  2. సిలబస్ ఆఫ్ సక్సెస్ (గెలుపు ప్రయాణం)
  3. సమ్మరీ ఆఫ్ సక్సెస్ (గెలుపు అర్థం)
  4. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సక్సెస్ (గెలుపు యొక్క అనర్థం)
  5. సిగ్నేచర్ ఆఫ్ సక్సెస్ (గెలుపు పరమార్థం)

ప్రశంసలు[మార్చు]

‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’ పుస్తకం అన్ని వర్గాల వారి మన్ననలు అందుకుంది. ఈ పుస్తకానికి సినీ నటులు మహేష్ బాబు, ప్రభాస్, వెంకటేష్‌ లతో పాటు సామాన్య ప్రజల నుండి ప్రశంసలు వచ్చాయి.[3][4][5]

హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకం ఉన్న స్టాల్ ను సందర్శించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, కధనాలు (25 July 2019). "విజయంతో స్వీయచిత్రం". Archived from the original on 25 July 2019. Retrieved 25 July 2019.
  2. News18 Telugu (28 August 2019). "సక్సెస్... సక్సెస్...సక్సెస్... సింప్లీ 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్'". News18 Telugu. Archived from the original on 30 August 2019. Retrieved 30 August 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. V6 Velugu, V6 (2 August 2019). "సెల్ఫీ ఆఫ్ సక్సెస్ చదివిన మహేష్" (in ఇంగ్లీష్). Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ పుస్తక సమీక్ష (8 August 2019). "సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ పుస్తక సమీక్ష". lit.andhrajyothy.com. Archived from the original on 24 September 2019. Retrieved 24 September 2019.
  5. Andhra Jyothy (27 July 2018). "'సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌' పుస్తకం ప్రతి ఒక్కరూ చదవాలి". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.

బయటి లింకులు[మార్చు]