Coordinates: 22°29′N 92°58′E / 22.48°N 92.97°E / 22.48; 92.97

సైహ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సైహ
పట్టణం
సైహ is located in Mizoram
సైహ
సైహ
మిజోరాంలో ప్రాంతం ఉనికి
సైహ is located in India
సైహ
సైహ
సైహ (India)
Coordinates: 22°29′N 92°58′E / 22.48°N 92.97°E / 22.48; 92.97
దేశం భారతదేశం
రాష్ట్రంమిజోరాం
జిల్లాసైహ
Elevation
1,225 మీ (4,019 అ.)
Population
 (2014)[1]
 • Total25,110
భాషలు
 • అధికారికమారా రీహ్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
796901
Vehicle registrationఎంజెడ్ 03
వాతావరణంCwa

సైహ[2] మిజోరాం రాష్ట్రంలోని సైహ జిల్లా ముఖ్య పట్టణం. ఇది రాష్ట్రంలోని దక్షిణ మధ్య భాగంలో ఉంది. ఈ పట్టణం మరా ప్రజలకు వాణిజ్య కేంద్రంగా ఉంది.

పద వివరణ[మార్చు]

'సియా' అంటే ఏనుగు అని, 'హ' అంటే ఏనుగు దంతం అని అర్థం. ఇక్కడ పెద్ద మొత్తంలో ఏనుగు దంతాలు దొరుకుతాయి. స్థానిక ప్రజలు ఈ పట్టణానికి 'సియాహా' అని పేరు పెట్టినప్పటికీ, మిజా ప్రజలు దీనిని 'సైహ' అని పిలుస్తారు.

భౌగోళికం[మార్చు]

సైహ పట్టణం 22°29′N 92°58′E / 22.48°N 92.97°E / 22.48; 92.97 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 729 మీటర్లు (2,391 అడుగులు) ఎత్తులో ఉంది.

జనాభా[మార్చు]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[4] సైహ పట్టణంలో 19,731 జనాభా ఉంది. ఈ జనాభాలో 52% మంది పురుషులు, 48% మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 79% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 77% గా ఉంది. పట్టణ జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం. 2001లో 19,731 మంది జనాభా ఉండగా, 2008లో 29,275 జనాభా ఉన్నారు.[5]

రవాణా[మార్చు]

ఈ పట్టణంలో పవన్ హన్స్[6] (హెలికాప్టర్ సర్వీస్ సంస్థ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి.[7] 54వ జాతీయ రహదారి ద్వారా సైహ పట్టణం, ఐజాల్ నగరంతో కలుపబడుతోంది. సైహ, ఐజాల్ మధ్య 378 కి.మీ.ల దూరం ఉంది. వీటి మధ్య బస్సు, జీపులతో రవాణా సౌకర్యం ఉంది.[8]

మీడియా[మార్చు]

సైహ పట్టణంలోని ప్రధాన వార్తాపత్రికలు:[9]

  • బన్నెల్
  • చిమ్ ఆవ్
  • కావ్ల్ ఇంగ్
  • మారలాండ్
  • మూన్లైట్
  • మారా త్లాలా
  • సైహ పోస్ట్
  • సైఖవ్‌పుయి
  • సైహ టైమ్స్
  • అవ్సిచారు
  • దేవా మారా డైలీ

మూలాలు[మార్చు]

  1. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 28 December 2020.
  2. http://www.madconline.com/wp-content/uploads/2015/01/Official_Resolution.pdf
  3. Falling Rain Genomics, Inc - Saiha
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 28 December 2020.
  5. Dept. of Economic & Statistic, Gov't of Mizoram Statistical Handbook 2008. Archived 2016-03-04 at the Wayback Machine
  6. "MIZORAMA HELICOPTER SERVICE TUR CHIEF MINISTER IN HAWNG". Mizoram DIPR. Archived from the original on 12 డిసెంబరు 2013. Retrieved 28 December 2020.
  7. "Nilaini atangin 'Helicopter Service". The Zozam Times. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 28 December 2020.
  8. "Aizawl to Siaha". Mizoram NIC. Retrieved 28 December 2020.
  9. "Accredited Journalists". DIPR Mizoram. Archived from the original on 19 జూన్ 2013. Retrieved 28 December 2020.

ఇతర లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=సైహ&oldid=4011869" నుండి వెలికితీశారు