సోఫియా చౌదరి
సోఫియా చౌదరి | |
---|---|
జననం | సోఫియా చౌదరి 1982 ఫిబ్రవరి 8[1] |
జాతీయత | బ్రిటీష్ |
వృత్తి | గాయని, హోస్ట్, నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1999–ప్రస్తుతం |
సోఫియా చౌదరి (జననం 8 ఫిబ్రవరి 1982) భారతదేశానికి చెందిన బ్రిటిష్ గాయని, హోస్ట్, నటి.[2][3]
జీవిత విశేషాలు
[మార్చు]సోఫియా చౌదరి యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో పుట్టి పెరిగింది.[4] తండ్రి సోఫియా లోరెన్‌కి అభిమాని కావడంతో "సోఫియా" అని పేరు పెట్టాడు. అయితే "సోఫీ" గా పేరు మార్చుకుంది.[5]
చౌదరి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నది. యూరోపియన్ పాలిటిక్స్, ఫ్రెంచ్‌లో పట్టభద్రురాలయింది.[6] [7] లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రమాటిక్ ఆర్ట్ నుండి బంగారు పతాకం సాధించింది.[8] ఫ్రాన్స్‌లోని పారిస్‌లోని "సైన్సెస్ పో"లో దాదాపు రెండు సంవత్సరాలపాటు చదువుకుంది.[9]
భారతీయ శాస్త్రీయ నృత్యంలో భరతనాట్యంలో శిక్షణ పొందింది. లండన్‌లో నాలుగు సంవత్సరాలు సల్సా వంటి పాశ్చాత్య నృత్యాలను కూడా నేర్చుకున్నది.[10] పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో కూడాశిక్షణ పొందింది. యుకెలో హెలెనా షెనెల్ నుండి మూడు సంవత్సరాలు నేర్చుకుంది.[11] అలాగే భారతీయ శాస్త్రీయ సంగీతంలో పండిట్ అష్కరన్ శర్మ వద్ద శిక్షణ పొందింది.[12]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
---|---|---|---|
2005 | షాదీ నెంబర్.1 | డింపుల్ కొఠారి | |
ప్యార్ కె సైడ్ ఎఫెక్ట్స్ | తాన్య | ||
ఐ సి యు | దిల్నాజ్ బగ్గా | ||
2007 | హేయ్ బేబీ | ప్రత్యేక ప్రదర్శన | |
అగ్గర్ | నిషా రావల్ | ||
స్పీడ్ | మోనికా మోంటెరో | ||
2008 | మనీ హాయ్ తొహ్ హనీ హాయ్ | ప్రత్యేక ప్రదర్శన | |
కిడ్నాప్ | ప్రత్యేక ప్రదర్శన | ||
2009 | ఆ దేఖేం జార | బిండియా అవస్తి | |
డాడీ కూల్ | ఆయేషా | ||
చింటూ జి | మెంకా | ||
అలీబాగ్ | నిషా | ||
2011 | వేది | తమిళ చిత్రం; ప్రత్యేక ప్రదర్శన | |
2013 | షూటౌట్ ఎట్ వాడాలా | పాటలో స్పెషల్ అప్పియరెన్స్ | |
ఒన్స్ అపాన్ ఆ టైం ఇన్ ముంబై దొబరా! | శ్రీమతి. దీక్షిత్ | ||
2014 | 1: నేనొక్కడినే | తెలుగు ఫిల్మ్; "లండన్ బాబు" పాటలో ప్రత్యేక ప్రదర్శన |
డిస్కోగ్రఫి
[మార్చు]- "యే దిల్ సున్ రహా హై" (2000).
- "హబీబీ" (2000)
- "లే లే మేరా దిల్" (2002)
- "సోఫీ & డాక్టర్ లవ్" (2003)
- "బేబీ లవ్ - సోఫీ" (2004)
- స్వీట్ హనీ మిక్స్ (2004)లో " ఆప్ జైసా కోయి"[13][14]
- "సౌండ్ ఆఫ్ సోఫీ" (2009)
- "హంగామా హో గయా" (2012) డిజిటల్ సింగిల్
- "హంగామా హో గయా" (2013) సంకలన ఆల్బమ్
- "డు యూ నో" (2015)
- "ఆజ్ నైయో సౌనా" (2019) మంజ్ మ్యూజిక్‌తో [15] [16]
అవార్డులు
[మార్చు]- 2001: యుకె ఏషియన్ పాప్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ న్యూకమర్ [17] [18] [19]
- 2004: లైక్రా ఎంటివి స్టైల్ అవార్డ్ ఫర్ మోస్ట్ స్టైలిష్ ఫిమేల్ ఇన్ మ్యూజిక్ [20]
- 2005: ఉత్తమ మహిళా పాప్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ సంగీత పురస్కారం
మూలాలు
[మార్చు]- ↑ "Yuvraj Singh, Neha Dhupia, Ekta Kapoor at Sophie Choudry's birthday party". Indian Express. 9 February 2014.
Bollywood beauty Sophie Choudry celebrated her 32nd birthday with her B-town friends in Mumbai's popular Olive Bar on Saturday (February 8).
- ↑ "VJ Sophie: Profile". MTV INDIA. Archived from the original on 16 February 2009. Retrieved 6 March 2009.
- ↑ "Beach vacation pictures of Sophie Choudry will make you pack your bags!".
- ↑ "'I'm single and loving it'". Rediff. Retrieved 4 September 2009.
- ↑ "VJ Sophie: Profile". MTV INDIA. Archived from the original on 16 February 2009. Retrieved 6 March 2009.
- ↑ "VJ Sophie: Profile". MTV INDIA. Archived from the original on 16 February 2009. Retrieved 6 March 2009.
- ↑ "'I'm single and loving it'". Rediff. Retrieved 4 September 2009.
- ↑ "Sophia with love..." The Hindu. Chennai, India. 16 December 2004. Archived from the original on 9 May 2005. Retrieved 4 September 2009.
- ↑ "Sophie Chaudhary excited about Aa Dekhen Zara". bollyspice.com. Retrieved 5 September 2009.
- ↑ ""Shaadi No. 1 is something I will never regret!" – Sophie Choudry". bollyspice.com. Retrieved 4 September 2009.
- ↑ "The versatile veejay". The Hindu. Chennai, India. 9 December 2002. Archived from the original on 2 March 2004. Retrieved 5 September 2009.
- ↑ "Sophia with love..." The Hindu. Chennai, India. 16 December 2004. Archived from the original on 9 May 2005. Retrieved 4 September 2009.
- ↑ "Harry Anand - Sweet Honey Mix". Discogs. Retrieved 20 December 2018.
- ↑ "Aap Jaisa Koi Meri Zindagi Mein Aaye [Full Song] Sweet Honey Mix". YouTube. T-Series. Archived from the original on 8 February 2019. Retrieved 20 December 2018.
- ↑ "सोफी चौधरी का नया सॉन्ग..आज नइयो सोना..चुराएंगी सभी की नींदें..! - Janman TV". DailyHunt (in ఇంగ్లీష్). Retrieved 17 February 2019.
- ↑ Sapna Choudhary (5 February 2019), Aaj Naiyo Sauna - Sophie Choudry| Aaj Naiyo Sona - Sophie Choudhary New, retrieved 17 February 2019
- ↑ "The versatile veejay". The Hindu. Chennai, India. 9 December 2002. Archived from the original on 2 March 2004. Retrieved 5 September 2009.
- ↑ "Omar Explores Sophia Choudry". desiclub.com. Archived from the original on 9 July 2011. Retrieved 5 September 2009.
- ↑ "Sophie Chaudhary". ganaga.com. Archived from the original on 23 October 2008. Retrieved 5 September 2009.
- ↑ "The Lycra MTV Style Awards – Winners". MTV India. Archived from the original on 6 March 2009. Retrieved 5 September 2009.