Jump to content

స్వామి నిత్యానంద

వికీపీడియా నుండి
స్వామి నిత్యానంద
జననంఅరుణాచలం రాజశేఖరన్
(1978-01-01) 1978 జనవరి 1 (వయసు 46)
తిరువణ్ణామలై, తమిళనాడు, భారతదేశం
స్థాపించిన సంస్థనిత్యానంద ధ్యానపీఠం
తత్వంఅద్వైత వేదాంతం

స్వామి నిత్యానంద (ఆగ్లం: Nithyananda Paramahamsa) ఒక భారతీయ హిందూ గురువు. దేశ విదేశాలలో గురుకులాలు, ఆశ్రమాలు, దేవాలయాలను కలిగి ఉన్న ట్రస్ట్ నిత్యానంద ధ్యానపీఠం వ్యవస్థాపకుడు. స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్.[1] అనుచరులు ఆయనను నిత్యానంద పరమశివం, పరమహంస నిత్యానంద అని కూడా పిలుస్తారు.

ప్రారంభ జీవితం

[మార్చు]

స్వామి నిత్యానంద తమిళనాడులోని తిరువణ్ణామలైలో అరుణాచలం, లోకనాయకికి జన్మించాడు.[2] బాల్యంలో ఆయన పేరు అరుణాచలం రాజశేఖరన్.[3][4] ఇతను శైవ వెల్లాల వర్గానికి చెందినవాడు.[4] అతని పుట్టిన తేదీకి సంబంధించి మూలాల వైరుధ్యం ఉంది. 1978 జనవరి 1 అని ఆయన 2010లో కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో ఉండగా 1977 మార్చి 13 అని 2003లో యూఎస్ వీసాలో ఉంది.[2][4]

మొదటిసారిగా మూడు సంవత్సరాల వయస్సులో అరుణాచలం రాజశేఖరన్ ని యోగిరాజ్ యోగానంద పూరి గుర్తించాడు. అతను 12 సంవత్సరాల వయస్సు నుండి శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉన్నాడని, 22 సంవత్సరాల వయస్సులో పూర్తి జ్ఞానోదయాన్ని అనుభవించినట్లు పేర్కొన్నాడు.

ఇక 24 ఏళ్ళ అరుణాచలం రాజశేఖరన్ 2002లో నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు.[5] మహావతార్ బాబాజీ హిమాలయాల్లో తన సన్యాసుల సంచారంలో ఉన్న ఒక ఆధ్యాత్మిక అనుభవంలో తనకు ఈ పేరు పెట్టారని అతను చెప్పాడు. అతను 2003లో కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు.

గుర్తింపు

[మార్చు]

నిత్యానంద ఫ్లోరిడాకు చెందిన హిందూ యూనివర్శిటీ ఆఫ్ అమెరికాకు 2007లో ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వాట్కిన్స్ మైండ్ బాడీ స్పిరిట్ మ్యాగజైన్ ద్వారా నిత్యానంద "100 మంది అత్యంత ఆధ్యాత్మికంగా ప్రభావవంతమైన జీవిస్తున్న వ్యక్తులలో" ఒకరిగా 2012లో గుర్తింపు పొందారు. అలాగే 2012లో నిత్యానంద మధురై 293వ పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 2013లో పంచాయితీ మహానిర్వాణి అఖారా కార్యక్రమంలో నిత్యానందకు మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేశారు.

నిత్యానంద ధ్యానపీఠం అనేది నిత్యానంద స్థాపించిన ఒక మతపరమైన సంస్థ. ఇది యునైటెడ్ స్టేట్స్‌తో పాటు భారతదేశంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దానికి రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు వచ్చాయి. ఒకటి అతిపెద్ద రోప్ యోగా క్లాస్ కాగా, మరొకటి అతిపెద్ద పోల్ యోగా (మల్లఖంబ) క్లాస్.

వివాదాలు - సంచలన ప్రకటనలు

[మార్చు]
కైలాస దేశం జాతీయ జెండా

భారతీయ న్యాయస్థానాలలో అతనిపై అత్యాచారం, అపహరణ ఆరోపణలు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా నవంబరు 2019లో భారతదేశం నుంచి మాయమయ్యారు. చాలాకాలం అజ్ఞాతంలోకి వెళ్ళిన తదనంతరం అతను ఈక్వెడార్‌ సమీపంలో కైలాస అనే తన స్వంత ద్వీప దేశాన్ని స్థాపించినట్లు, దానికి అతనే ప్రధాని అని ప్రకటించాడు.[6] అంతేకాదు, దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఆ తర్వాత కైలాస డాలర్‌ను తీసుకొచ్చారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించనున్నట్టు చెప్పారు.

2022 మే నెలలో తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ తాను చనిపోలేదని, ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నానని స్వామి నిత్యానంద ప్రకటించారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Nithyananda moves SC against his removal as pontiff of Madurai Adheenam Mutt | Deccan Herald". web.archive.org. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Nithyananda may have forged birth documents | Deccan Herald". web.archive.org. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "All you want to know about Nithyananda - The Hindu". web.archive.org. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 4.2 "'I am a virgin. I have no libido' - Telegraph India". web.archive.org. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "The Unexpurgated Nithyananda Interview". web.archive.org. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. 6.0 6.1 "నేను చనిపోలేదు.. సమాధిలోకి వెళ్లా". web.archive.org. 2022-05-14. Archived from the original on 2022-05-14. Retrieved 2022-05-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)