హయావో మియాజాకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హయావో మియాజాకి
宮崎 駿
Miyazaki at the 2008 Venice Film Festival
జననం (1941-01-05) 1941 జనవరి 5 (వయసు 83)
బంక్యో, టోక్యో, జపాన్
విద్యGakushuin University
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1963–2013, 2015–present[1]
జీవిత భాగస్వామి
Akemi Ōta
(m. 1965)
పిల్లలు

హయావో మియాజాకి (宮崎 駿 Miyazaki Hayao?, born January 5, 1941)జపాన్ దేశానికి చెందిన సుప్రసిద్ధ బొమ్మల (యానిమేషన్) సినిమాల దర్శకుడు, రచయిత, నిర్మాత, జపాన్లో "మంగ" అని పిలువబడే బొమ్మల సినిమాలు రూపొందించడంలో సుప్రసిద్ధులు. మియజాకిని అమెరికాకు చెందిన ప్రసిద్ధ యానిమేటర్ "వాల్ట్ డిస్నీ" తో పోలుస్తారు. మియాజాకి తన తోటి యానిమేటర్ "ఇసావో తకహట" తో కలిసి "స్టూడియో గిబ్లి"ని నెలకొల్పారు. మియాజాకి తీసిన చిత్రాల్లో "స్పిరిటెడ్ అవే" అనే చిత్రం అకాడమీ అవార్డులలో యానిమేషన్ విభాగంలోఉత్తమ చిత్రంగా గెలుపొందింది. ఇప్పటికీ డిస్నీ యానిమేషన్ లేదా పిక్సార్ యానిమేషన్ సభ్యులు వారు నూతనంగా తీయబోయే చిత్రాలకు మియాజాకీ చిత్రాల నుండి ప్రేరణ పొందుతారు. స్పిరిటెడ్ అవే చిత్రం జపాన్లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రం. అప్పటి వరకు జపాన్లో అత్యధిక వసూళ్ళు సాధించిన టైటానిక్ చిత్ర రికార్డును స్పిరిటెడ్ అవే అధిగమించింది. మియాజాకి తీసిన చిత్రాల్లో ప్రముఖమైనవి, మై నైబర్ టొటొరో, నాసికా ఆఫ్ ద వాలి ఆఫ్ ది విండ్, ప్రింసెస్ మొనొనోకె, హౌల్స్ మూవింగ్ కాస్ట్ల్, ఇతర చిత్రాలు అమెరికాలో కూడా విశేష ఆదరణ పొందాయి.

 ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Lange, Jerva (July 13, 2015). "Hayao Miyazaki, legendary Japanese animator, has come out of retirement — to work in 3D". The week. Retrieved February 11, 2016.

ఇతర లింకులు[మార్చు]