హసన్ గఫూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హసన్ గఫూర్ ఐపిఎస్
హసన్ గఫూర్

హసన్ గఫూర్


ముంబై పోలీస్ కమీషనర్
పదవీ కాలం
01 మార్చి 2008 – 12 జూన్ 2009
ముందు డి.ఎన్. జాదవ్
తరువాత ధనుష్యకోడి శివనందన్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-12-11)1950 డిసెంబరు 11
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
మరణం 2012 మార్చి 12(2012-03-12) (వయసు 61)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
విశ్రాంతి స్థలం ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయత భారతీయుడు
నివాసం ముంబై
వృత్తి చట్టం అమలు
మతం ఇస్లాం

హసన్ గఫూర్ (డిసెంబరు 11, 1950 - మార్చి 12, 2012) మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ మాజీ పోలీస్ డైరెక్టర్ జనరల్. మహారాష్ట్ర పోలీస్ హౌసింగ్, వెల్ఫేర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

హసన్ గఫూర్ 1950, డిసెంబరు 11న తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు. ఆబిడ్స్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదువుకున్నాడు.[1]

వృత్తి జీవితం[మార్చు]

1974లో ఐపిఎస్ పూర్తిచేసిన హసన్ గపూర్ తన వృత్తిజీవితంలో వివిధ హోదాల్లో బాధ్యతలను నిర్వర్తించాడు. 2007, జూన్ 15 నుండి 2008, ఫిబ్రవరి 29 వరకు మహారాష్ట్ర అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశాడు.[2] 2008, మార్చి 1 నుండి – 2009, జూన్ 12 వరకు ముంబై నగర పోలీస్ కమీషనర్‌గా పనిచేశాడు. 2008, నవంబరు నెలలో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల సమయంలో హసన్ గఫూర్‌ నాయకత్వం సరిగా లేదన్న ఆరోపణలతో రామ్ ప్రధాన్ కమీషన్ నివేదికలో ఇతనిపై అభియోగాలు మోపబడ్డాయి. దాంతో ముంబై పోలీసు కమీషనర్ హోదా నుండి మహారాష్ట్ర పోలీస్ హౌసింగ్, వెల్ఫేర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేయబడ్డాడు.[3]

మరణం[మార్చు]

హసన్ గఫూర్ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2012, మార్చి 12న గుండెపోటుతో మరణించాడు.[4][5][6]

సంఘటనలు[మార్చు]

హసన్ గఫూర్ ముంబై పోలీస్ కమిషనర్‌గా ఉన్న కాలంలో ఈ క్రింది సంఘటనలు జరిగాయి:

  1. మహారాష్ట్రలో 2008 ఉత్తర భారతదేశ వ్యతిరేక హింస
  2. 2008 అహ్మదాబాద్ బాంబు దాడులు
  3. రాహుల్ రాజ్ ఎన్‌కౌంటర్
  4. నవంబర్ 2008 ముంబై దాడులు

మూలాలు[మార్చు]

  1. "St.George's Grammer School". stgeorgesgrammarschool.in. Archived from the original on 2018-11-29. Retrieved 2020-09-19.
  2. "Maria to take over as crime branch chief". The Times of India. 15 June 2007. Archived from the original on 3 January 2013. Retrieved 2020-09-19.
  3. "D Sivanandan to be new police chief of Mumbai". The Times of India. June 14, 2009. Archived from the original on 15 June 2009. Retrieved 2020-09-19.
  4. "Former police chief Hasan Gafoor dead". Indian Express. Retrieved 2020-09-19.
  5. "Former Mumbai Police Commissioner Hasan Gafoor dead". Rediff.com. Retrieved 2020-09-19.
  6. "Ex-Mumbai police chief Hasan Gafoor dead". The Times of India. Archived from the original on 2012-03-12. Retrieved 2020-09-19.
అంతకు ముందువారు
డి.ఎన్. జాదవ్
ముంబై పోలీస్ కమీషనర్
2008 మార్చి 1 – 2009 జూన్ 13
తరువాత వారు
ధనుష్యకోడి శివనందన్