హిందుస్థాన్ యాంటీబయాటిక్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్), Hindustan Antibiotics Limited (HAL) 1954 మార్చి 13 న స్థాపించబడింది[1]. భారతదేశం మొట్టమొదటి యాంటీబయాటిక్ తయారీదారు. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఔషధ తయారీ సంస్థగా పనిచేస్తుంది. కంపెనీ ఇంజెక్టబుల్స్, క్యాప్సూల్స్, టాబ్లెట్లు, పెద్ద వాల్యూమ్ పేరెంటల్స్ , లిక్విడ్ ఓరల్స్ ను అందిస్తుంది. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ భారతదేశంలో వినియోగదారులకు తక్కువ ధరలలో మందులను, విదేశాలకు మందులను ఎగుమతి చేయడం జరుగుతుంది[2]. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భారత ప్రభుత్వ రసాయనాలు,ఎరువుల మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని భారతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.

అవలోకనం[మార్చు]

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సహకారంతో భారత ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసిన తొలి ఔషధ తయారీ సంస్థ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్). 1954లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూచే ప్రారంభించబడింది . 1955 సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించింది. భారతదేశంలోని పేదలకు సరసమైన మందులు అందుబాటులో ఉండాలనేది మహాత్మా గాంధీ ఆలోచన, సిద్ధాంతం, ఆచరణ లో పెట్టాలని సంస్థ లక్ష్యం. కంపెనీకి రిషికేశ్, హైదరాబాద్‌లో ప్లాంట్లు ఉన్నాయి. కంపెనీకి చెందిన అనుబంధ కంపెనీలకు చెన్నై,ముజఫర్‌పూర్‌లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. పెన్సిలిన్ పూణే సమీపంలోని పింబ్రిలో ఉన్న కంపెనీ ప్లాంట్‌లో తయారు చేయబడింది.

పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, జెంటామైసిన్, ఆంపిసిలిన్, అమోక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ వాణిజ్య ఉత్పత్తిని చేపట్టిన భారతదేశంలో మొదటి ఔషధ తయారీ యూనిట్ హెచ్ఎఎల్. సంస్థ ఫార్ములేషన్ యాక్టివిటీలో వైవిధ్యంగా ఉంది, వివిధ మోతాదు రూపాలను తయారు చేసే సదుపాయాన్ని కలిగి ఉంది, వీటిలో  ఇంజెక్టబుల్స్, క్యాప్సూల్స్, టాబ్లెట్లు, పెద్ద వాల్యూమ్ పేరెంటల్స్, లిక్విడ్ ఓరల్స్ మొదలైనవి ఉన్నాయి. ఫార్మకోపోయల్ ప్రమాణాలకు అనుగుణంగా హెచ్ఏఎల్  వ్యవసాయ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది.

స్కిన్ ఇన్ఫెక్షన్ల కోసం హామైసిన్, మొక్కల ఫంగల్ నియంత్రణ కోసం ఆరియోఫుంజిన్ వంటి తన స్వంత ఆవిష్కరణలతో ముందుకు వచ్చిన భారతదేశంలోని ప్రభుత్వ రంగంలోని ఏకైక ప్రయోగశాలగా  రీసెర్చ్  అభివృద్ధి ( ఆర్ అండ్ డి ) ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.

హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ స్కూల్ పింప్రి పూణే లో ఉన్న ఉన్నత పాఠశాల.

సంస్థ  తయారీ యూనిట్ మహారాష్ట్ర  రాజధాని ముంబై కి 160  కి.మీ దూరంలో ఉన్న పూణే నగరంలోని పారిశ్రామిక శివారు ప్రాంతమైన పింప్రి వద్ద ఉంది.

భారతదేశం అంతటా సరసమైన ఔషధాలను అందించాలనే సామాజిక లక్ష్యంతో, హెచ్ఎఎల్ మహారాష్ట్ర యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ & ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే రెండు అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది., నాణ్యత ప్రమాణాలలో( క్వాలిటీ అస్యూరెన్స్)  స్థిరత్వం, జీవ లభ్యత అధ్యయనాలకు ప్రాధాన్యత కలిగి ఉన్నది. సంస్థ లో పనిచేసే వారు  నైపుణ్యం, శిక్షణ తో ఉన్న  సిబ్బంది చిన్నచిన్న వివరాలతో విధులను పర్యవేక్షిస్తారు. సంస్థ ప్రాథమిక సమాచారం లో  సంవత్సర ఆద్యం (వార్షిక టర్నోవర్)  సుమారు  రూ.25 - 50 కోట్లు వరకు ఉన్నది[3] .

ఎగుమతులు[మార్చు]

హిందూస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ పెన్సిలినేస్ (టైప్ 1) నాన్ స్టెరైల్ NLT 1000IU, రివర్సింగ్ వాల్వ్ DC 28X93280MDO-24 V, HS కోడ్ లు 30031000 కలిగి ఉన్న ప్రముఖ ఎగుమతిదారు.  సంస్థ ప్రధానంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది,  ప్రధానంగా దుబాయ్ కు పంపడం జరుగుతుంది.హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్వీడన్,అనేక ఇతర దేశాల నుండి వస్తువులను ఎగుమతి , దిగుమతి  చేసుకుంటుంది.[4]

ఆర్ధిక సమస్యలు[మార్చు]

హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ వ్యూహాత్మక విక్రయాన్ని ప్రభుత్వం అన్వేషిస్తుంది, కాని ఆధునిక సౌకర్యాలు లేదా బలమైన ఉత్పత్తి అందుబాటులో లేనందున కంపెనీ పరిశ్రమ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 2015-16 ఆర్ధిక సంవత్సరం నాటికి సంస్థ సుమారు 75 కోట్ల నష్టాలలో ఉన్నది, సంస్థకు ఆర్ధిక పరమైన సమస్యల ఉన్నాయి[5] .

  • దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఫార్మాస్యూటికల్స్ యూనిట్ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ 1954 లో పూణే సమీపంలోని పింప్రిలో పెన్సిలిన్ తయారు చేసి భారతదేశం, ఆగ్నేయాసియాలోని రోగులకు సరఫరా చేయడానికి స్థాపించబడింది. యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి హామైసిన్, ఆరియోఫంగిన్ అనే రెండు కొత్త అణువులను కనుగొన్న ఘనత కంపెనీకి ఉంది.
  • కానీ గత రెండు దశాబ్దాలుగా కంపెనీ నిర్లక్ష్యానికి గురైంది. 1993 సంవత్సరం నుంచి నష్టాల్లో కూరుకుపోయి, దాని పరిస్థితి గత రెండేళ్లుగా క్షీణించింది. బల్క్ డ్రగ్స్, ఫార్ములేషన్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం కంపెనీకి ఉంది, కానీ దాని వ్యవసాయ విభాగంలో మినహా రెండు సంవత్సరాలు ఉత్పత్తి దాదాపుగా మూసివేయబడింది, జీతాలు ఇతర చట్టబద్ధమైన బకాయిలు నెలల తరబడి చెల్లించబడలేదు.
  • ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు సమర్పించిన నివేదికలో హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ యాజమాన్యం యూనిట్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేసే భయంతో మరిన్ని నిధులు కావాలని అభ్యర్థించింది. ఉద్యోగుల ఆందోళనలు నిత్యకృత్యం కావడం జరుగుతున్నది.
  • రూ.821 కోట్ల నికర అప్పులను తీర్చేందుకు కంపెనీకి చెందిన 87 ఎకరాల మిగులు భూమిని విక్రయించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. రూ.307 కోట్ల ప్రభుత్వ రుణాన్ని మాఫీ చేయడంతో పాటు అత్యవసర ఖర్చుల కోసం అదనంగా మరో రూ.100 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. భూముల విక్రయం తర్వాత హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ వ్యూహాత్మక విక్రయం, మూసివేత లేదా పునరుద్ధరణ చేయాలా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది .
  • హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ పునరుద్ధరణ ప్యాకేజీపై ప్రభుత్వం కసరత్తు చేయడం రెండోసారి. మొదటి పునరుద్ధరణ ప్యాకేజీ 2006 లో ఆమోదించబడింది, నగదు ఇన్ఫ్యూషన్, రుణం, రూ .500 కోట్ల రుణ మాఫీ ఉన్నాయి. దీనితో కంపెనీ కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసి, ఇప్పటికే ఉన్న యూనిట్లను ఆధునీకరించడం ( అప్ గ్రేడ్ ) చేయడం జరిగింది.  2010-11లో రూ.95 కోట్ల అమ్మకాలు రాగా, ఆ తర్వాత క్రమేపి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.

డ్రగ్  పాలసీ స్కాలర్ కన్నమ్మ రామన్  పేర్కొన్న ప్రకారం హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ పెన్సిలిన్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రారంభమైందని, కానీ దాని దృష్టి బల్క్ డ్రగ్స్పై ఉందని, ఇవి మూలధనంతో కూడుకున్నవని చెప్పారు. దీనితో  నష్టాలకు దారితీసిందని, సరియైన మార్కెటింగ్ వ్యూహాలు లేక పోవడం మరి ఒక కారణం అని నిపుణలు పేర్కొంటున్నారు.  

మూలాలు[మార్చు]

  1. "Hindustan Antibiotics Limited Information - Hindustan Antibiotics Limited Company Profile, Hindustan Antibiotics Limited News on The Economic Times". The Economic Times (in ఇంగ్లీష్). Archived from the original on 2019-05-08. Retrieved 2023-02-17.
  2. "Hindustan Antibiotics Ltd - Company Profile and News". Bloomberg.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-17.
  3. "Hindustan Antibiotics Limited - Manufacturer from Pimpri, Pune, India | About Us". www.indiamart.com. Retrieved 2023-02-17.
  4. "Hindustan Antibiotics Ltd Import Export Data - Buyers, Suppliers, Products". volza.com. 17 February 2023. Retrieved 17 February 2023.
  5. Phadnis, Aneesh (2016-12-30). "Hindustan Antibiotics may not find buyers". www.business-standard.com (in ఇంగ్లీష్). Retrieved 2023-02-17.