ధర్మసార రామాయణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మసార రామాయణము పుస్తక ముఖచిత్రం.

ధర్మసార రామాయణము జనమంచి శేషాద్రి శర్మ (1882 - 1950) రచించిన పద్యకావ్యం.

రచన నేపథ్యం[మార్చు]

దీనిని వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి వారి ద్వారా 1937 సంవత్సరంలో వావిళ్ల ముద్రణాలయమున ముద్రించబడింది.

రచయిత గురించి[మార్చు]

జనమంచి శేషాద్రిశర్మ చిత్రపటం.

ప్రధానవ్యాసం: జనమంచి శేషాద్రి శర్మ
జనమంచి శేషాద్రి శర్మ (Janamanchi Seshadri Sarma) (1882-1950) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు. వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి అవధానాలు చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్ధిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు. ఆయన బహుగ్రంథకర్త. వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యస్మృతితీర్థ', 'కళాప్రపూర్ణ', 'మహాకవి', 'సంస్కృతసూరి' మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు చాలా సన్మానాలు పొందారు. వీరు చాలా సన్మానాలు పొందారు.

ఇతివృత్తం[మార్చు]

"రామో విగ్రహవాన్ ధర్మః"-రాముడు రూపం ధరించిన ధర్మం అని సూక్తి. రాముని దారి అనే అర్థంలోనే రామాయణం అనే పేరుని స్థిరపరిచారు వాల్మీకి మహర్షి. రామయణంలోని ధర్మానికి ఇంతటి ప్రాధాన్యత ఉండబట్టి ఈ గ్రంథాన్ని ధర్మసార రామాయణంగా, రామాయణంలోని ధర్మాలపై ప్రత్యేకమైన దృష్టి నిలిపి రచించారు కవి.

మూలాలు[మార్చు]