కానిస్టేబుల్ కూతురు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కానిస్టేబుల్ కూతురు ,1963 మే31 విడుదల.కాంతారావు,కృష్ణకుమారి , జంటగా నటించిన ఈ చిత్రంకు, తాపీ చాణక్య దర్శకత్వం వహించారు.సంగీతం ఆర్.గోవర్దన్ అందించారు.

కానిస్టేబులు కూతురు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం చెళ్ళపిళ్ళ సత్యం
కథ బి.ఎస్‌.రామయ్య
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
కొంగర జగ్గయ్య,
గుమ్మడి,
చిత్తూరు నాగయ్య,
రాజబాబు,
రాజశ్రీ,
రమణారెడ్డి,
శాంతకుమారి,
సురభి బాలసరస్వతి
సంగీతం గోవర్ధన్‌
నేపథ్య గానం ఘంటసాల,
పి.బి.శ్రీనివాస్‌,
పిఠాపురం,
పి.సుశీల,
ఎస్.జానకి,
ఎల్‌.ఆర్‌.ఈశ్వరి
గీతరచన ఆత్రేయ,
ఆరుద్ర,
అనిశెట్టి
సంభాషణలు ఆచార్య ఆత్రేయ
నిర్మాణ సంస్థ చిత్ర కళ
భాష తెలుగు

కథాంశం

[మార్చు]

గోపి (జగ్గయ్య) జానకి (కృష్ణకుమారి) అన్నా చెల్లెలుగా, కానిస్టేబులు ధర్మయ్య (గుమ్మడి వెంకటేశ్వరరావు) వారి తండ్రిగా నటించిన చిత్రం 'కానిస్టేబులు కూతురు'. గోపి స్నేహితుడైన రఘు (కాంతారావు) షావుకారు వెంకట్రామయ్య (నాగయ్య) కుమారుడు. రఘు అల్లరి చిల్లరగా తిరగటం, చెడు సహవాసాలతో జీవితం పాడు చేసుకోవడం తండ్రికి నచ్చదు. గోపి ఇంటికి వచ్చిన రఘు జానకిని చూస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. రఘు మంచిగా మారే ప్రయత్నం చేస్తుంటే స్నేహితులు బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభిస్తారు. తన మేనకోడలు మల్లిక (రాజశ్రీ)తో కొడుకు రఘు పెళ్ళి చేయాలని తలుస్తాడు. అది కుదరక రఘు మల్లికను చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని, లేకుంటే మల్లికనే చెందుతుందని రాసేస్తాడు వెంకట్రామయ్య. రఘు హత్యానేరంలో ఇరుక్కుంటాడు.

పాటల జాబితా

[మార్చు]

1.కళ్ళల్లో నీరెందులకు గానం. ఘంటసాల, సుశీల రచన: ఆత్రేయ .

2.పువ్వు వలె విరబూయ వలె , గానం, పి.బి . శ్రీనివాస్, సుశీల , రచన:ఆత్రేయ

3.అందంకోసం కన్నులు ఆనందం, పి.సుశీల , పి.బి.శ్రీనివాస్ బృందం

4.చిగురాకుల ఊయలలో ఇలమరచిన , పి.సుశీల, పి.బి.శ్రీనివాస్

5.పుడితేను పురుషుడుగా పుటకే కోరవద్దు, పిఠాపురం , ఎల్.ఆర్.ఈశ్వరి , రచన: ఆత్రేయ

6.పూలు ముడచి పుడమి విడిచి పోతున్నావా పుణ్యవతి , టీ.ఆర్.జయదేవ్

7.వెన్నెలకేలా నాపై కోపం సెగలై , పి.బి శ్రీనివాస్ , రచన: ఆత్రేయ .

మూలాలు

[మార్చు]