నీతా మెహతా
నీతా మెహతా ప్రముఖ భారతీయ సెలబ్రిటీ షెఫ్[1], రచయిత్రి[2], రెస్టారెంట్ యజమానురాలు,[3] మీడియా పర్సనాలిటీ. ఆమె రాసిన వంటకాల పుస్తకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె కుకింగ్ క్లాసెస్ కూడా చాలా ప్రఖ్యాతం.[4] టీవీ చానెళ్ళలో వచ్చే వంటపోటీలకు ఆమె న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.[5]
దాదాపు 400 వంటకాల పుస్తకాలు రాశారు నీతా. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకాలు 6 మిలియన్ కాపీలు అమ్ముడుపోవడం విశేషం. 1999లో ప్యారిస్‌లో జరిగిన ప్రపంచవ్యాప్త కుక్ బుక్ ఫెయిర్ లో ఆమె రాసిన ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అనే పుస్తకానికి ఉత్తమ ఆసియా కుక్ బుక్ పురస్కారం లభించింది.[6]
కెరీర్
[మార్చు]రచయితగా
[మార్చు]మీడియాలో నీతాని కుకింగ్ ఎక్స్ పర్ట్, న్యూట్రీషన్ ఎక్స్ పర్ట్ అని వ్యవహరిస్తారు.[7][8] ఆమె రాసిన ఇండియన్ కుకింగ్ విత్ ఆలీవ్ ఆయిల్[8], వెజిటేరియన్ చైనీస్[9], జీరో ఆయిల్ కుకింగ్,[10] డయాబెటిస్ డెలికేషియస్,[11] 101 రెసిపీస్ ఫర్ చిల్డ్రన్,[12] ది బెస్ట్ ఆఫ్ చికెన్ అండ్ పనీర్[13][13] వంటి పుస్తకాలు కూడా బాగా అమ్ముడుపోయాయి. కొన్నేళ్ళ క్రితం వరకూ ప్రతీ పుస్తకాల దుకాణంలోనూ వంటకాల పుస్తకాల విభాగంలో ఆమె రచనలు, షెఫ్ సంజీవ్ కపూర్, తర్లా దలాల్ ల పుస్తకాలు మాత్రమే ఎక్కువగా లభించేవి. ప్రస్తుతం వీరి పుస్తకాలకు స్థానిక వంటకాల పుస్తకాల రచయితలు గట్టి పోటీనిస్తున్నారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Compilations of regional cuisines in English gaining popularity in Mumbai". Daily News and Analysis. 19 March 2010. Retrieved 7 August 2012.
- ↑ "Morsels of pleasure". The Hindu. 18 September 2010. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 7 August 2012.
- ↑ "Nita Mehta's multi-cuisine restaurant Kelong is going to open in Sarabha Nagar Ludhiana". Ludhianadistrict.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 7 August 2012.
- ↑ "Cooking up a delight". Hindustan Times. 15 July 2006. Retrieved 13 August 2012.
- ↑ "Chef Saby and Nita Mehta on MasterChef". Deccan Chronicle. 26 November 2011. Archived from the original on 11 జనవరి 2012. Retrieved 13 August 2012.
- ↑ "Switch to olive oil for better health". Times of India. 7 June 2012. Archived from the original on 22 జూన్ 2012. Retrieved 7 August 2012.
- ↑ "Cook and be done with it". The Hindu. 15 July 2005. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 13 August 2012.
- ↑ 8.0 8.1 "Switch to olive oil for better health: Cookery expert Nita Mehta". Hindustan Times. 8 January 2012. Retrieved 13 August 2012.
- ↑ "Sizzling sounds of India's second favourite food". China Daily. 21 November 2006. Archived from the original on 23 ఏప్రిల్ 2012. Retrieved 13 August 2012.
- ↑ "Healthy living". Eastern Eye. 16 March 2012. Archived from the original on 14 ఆగస్టు 2012. Retrieved 13 August 2012.
- ↑ "Fight lifestyle diseases with good food". Times of India. 28 September 2011. Archived from the original on 30 నవంబరు 2011. Retrieved 13 August 2012.
- ↑ "Morsels of pleasure". The Hindu. 15 September 2010. Archived from the original on 8 సెప్టెంబరు 2011. Retrieved 13 August 2012.
- ↑ "Chicken and paneer". The Hindu. 10 February 2002. Archived from the original on 28 ఏప్రిల్ 2002. Retrieved 13 August 2012.