పూసపాటి ఆనంద గజపతి రాజు (విజయనగరం మహారాజు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్ర పత్రికలో పూసపాటి ఆనంద గజపతి రాజు చిత్రం

పూసపాటి ఆనంద గజపతి రాజు (పరిపాలన సంవత్సరాలు? 1879 - 1897) విజయనగర సంస్థానానికి సంబంధించిన మహారాజు, సంస్కరణాభిలాషి, విద్యాదాత.

పరిపాలన[మార్చు]

అతని పరిపాలనకు ముందు పూసపాటి విజయరామ గజపతి రాజు-I పరిపాలించగా, అతని అనంతరం పూసపాటి విజయరామగజపతి రాజు-II పరిపాలనకు వచ్చారు.

విద్యాసేవ[మార్చు]

19వ శతాబ్ది చివరిభాగంలో స్త్రీవిద్యాభివృద్ధి కొరకు అనేక ప్రాంతాల్లో బాలికల పాఠశాలలు నెలకొల్పి, అవి కొనసాగేలా ఏర్పాట్లుచేసి పోషించిన వ్యక్తి. తొలినాళ్ళలో విద్యను అభ్యసించేవారికి పారితోషికాలిచ్చి ప్రోత్సహిస్తూ వచ్చినా, తర్వాతికాలంలో తన సహాయాన్ని మరింతగా పెంచి విద్యాభివృద్ధికి తన వంతు సేవచేశారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పారితోషికం, జీతం ఇవ్వడంతో ప్రారంభించిన అతను విద్యాసేవను అంచెలంచెలుగా పెంచుతూ చివరకు వివిధ బాలికా పాఠశాలల నిర్వహణ వరకూ కొనసాగించారు.[1]

మూలాలు[మార్చు]

  1. వేంకటశివుడు, రాయసం (1910). "కడచిన 30 సం.ల నుండియు నాంధ్ర దేశమునందలి స్త్రీవిద్యాభివృద్ధి". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 73. Archived from the original on 28 సెప్టెంబరు 2017. Retrieved 6 March 2015.