మిన్నెకల్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండలంసంతమాగులూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata


మిన్నెకల్లు, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన గ్రామం.లువా తప్పిదం: Coordinates not found on Wikidata

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

  • ఈ గ్రామంలో 49.35 సెంట్ల విస్తీర్ణంలో పాతచెరువు ఉంది. దీని నీటి నిలువ సామార్ధ్యం 10 సెంట్లు. 69.42 సెంట్ల విస్తీర్ణంతో ఉన్న కొత్తచెరువు నీటినిలువ సామర్థ్యం 13 సెంట్లు. ఈ చెరువులలో చేపపిల్లలను వేసి, పెంచి, పట్టుకొని హక్కుకొరకు, రెండు సంవత్సరములకొకసారి బహిరంగ వేలం నిర్వహించి వచ్చిన ఆదాయాన్ని గ్రామపంచాయతీకి జమచేయుదురు.
  • తారకరామ తంగేడుమిల్లి మేజరు ఎత్తిపోతల పథకం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో తన్నీరు గురువులు, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా ముప్పాళ్ళ శ్రీనుబాబు ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ చంద్రశేఖరస్వామివారి ఆలయం.
  2. శ్రీ రామాలయం:- మిన్నేకల్లు గ్రామంలోని శ్రీరామాలయంలో, శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం, శ్రీ సీతారాముల కళ్యాణం, కన్నులపండువగా నిర్వహించెదరు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు.
  3. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయానికి 19 ఎకరాల మాగాణి భూమి మాన్యంగా ఉంది. కౌలు రూపంలో ప్రతి సంవత్సరం, లక్షల రూపాయల ఆదాయం వచ్చుచున్నా, ఆలయ నిర్మాణాన్నీ, అభివృద్ధినీ ఎవరూ పట్టించుకునేవారు లేరు.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలోని ఒక సామాన్య రైతు కుటుంబానికి చెందిన మహేంద్ర అను విద్యార్థి, చిన్నప్పటినుండి, ప్రభుత్వ పాఠశాలలోనే కష్టపడి చదివి తన ప్రతిభతో, ఇడుపులపాయలోని ఐ.ఐ.ఐ.టి.లో సీటు సాధించి, అక్కడగూడా బాగా చదివి బి.టెక్.లో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకాన్ని పొందినాడు. 2014, ఆగస్టు-4వ తేదీన హైదరాబాదులో నిర్వహించిన, రాజీవ్ గాంధీ వైఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవంలో, గవర్నర్ శ్రీ నరసింహన్ గారి చేతులమీదుగా బంగారు పతకాన్ని అందుకుని మట్టిలో మాణిక్యంగా నిలిచాడు. ఇతడు ఇంజనీరింగ్ చదువుచూ ఉండగానే ఇన్ ఫోసిస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపిక కావడం మరో విశేషం.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]