అనఘ ఎల్.కె భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2017లో మలయాళం సినిమా 'రక్షాధికారి బైజు ఒప్పు' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి మళయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. ఆమె 2019లో తెలుగులో విడుదలైన గుణ 369 సినిమాతో అడుగుపెట్టి,[1] 2021లో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందిన అల్లిపూల వెన్నెల అనే బతుకమ్మ పాటలో నటించింది.[2]
అనఘ ఎల్.కె. కేరళలోనికోజికోడ్లో 23 ఆగస్టు 1990న జన్మించింది. ఆమె కోజికోడ్‌లోని శ్రీ సత్యసాయి విద్యాపీఠంలో ప్రారంభ పాఠశాల విద్యను పూర్తి చేసి, కేరళలోని వడకరలోని శ్రీ గోకులం పబ్లిక్ స్కూల్లో విద్య పూర్తి చేసింది. అనఘ చెన్నన్నూర్ లోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇసిఇలో బిటెక్ లో డిగ్రీ పూర్తి చేసి కాలికట్ లోని నీలిట్ లో ఎలక్ట్రానిక్స్ & డిజైన్ టెక్నాలజీలో ఎం.టెక్ పూర్తి చేసింది.[3]