కరియా ముండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరియా ముండా
కరియా ముండా


పదవీ కాలం
8 జూన్ 2009 – 18 మే 2014
ముందు చరణ్‌జిత్ సింగ్ అత్వాల్
తరువాత ఎం. తంబిదురై

పదవీ కాలం
2009 – 2019
ముందు సుశీల కెర్కెట్టా
తరువాత అర్జున్ ముండా
నియోజకవర్గం ఖుంటి
పదవీ కాలం
1989 – 2004
ముందు సైమన్ టిగ్గా
తరువాత సుశీల కెర్కెట్టా
నియోజకవర్గం ఖుంటి
పదవీ కాలం
1977 – 1980
ముందు నిరల్ ఎనెమ్ హోరో
తరువాత నిరల్ ఎనెమ్ హోరో
నియోజకవర్గం ఖుంటి

జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2005 – 2009
ముందు నియోజకవర్గం సృష్టించారు
తరువాత సావన్ లక్రా
నియోజకవర్గం ఖిజ్రీ

వ్యక్తిగత వివరాలు

జననం (1936-04-20) 1936 ఏప్రిల్ 20 (వయసు 88)
అనిగరా, బీహార్, (ప్రస్తుత జార్ఖండ్), బ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
సునందా దేవి
(m. 1967)
సంతానం 2 కుమారులు, 3 కుమార్తెలు
నివాసం అనిగర గ్రామం, ఖుంటి జిల్లా , జార్ఖండ్
పూర్వ విద్యార్థి రాంచీ విశ్వవిద్యాలయం
సంతకం కరియా ముండా's signature
పురస్కారాలు పద్మభూషణ్ 2019
మూలం http://loksabhaph.nic.in/Members/MemberBioprofile.aspx?mpsno=259&lastls=16

కరియా ముండా (జననం 20 ఏప్రిల్ 1936) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎనిమిది సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికై, 15వ లోక్‌సభకు డిప్యూటీ స్పీకర్‌గా, భారత ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశాడు.[1]

ఆయన 2019లో దేశ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

కరియా ముండా 1936 ఏప్రిల్ 20న జార్ఖండ్‌లోని ఖుంటి జిల్లా అనిగరా గ్రామంలో జన్మించాడు. ఆయన రాంచీ యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కరియా ముండా 1977లో భారతీయ లోక్ దళ్ నుండి ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1989, 1991, 1996, 1998, 1999, 2009, 2014లో లోక్‌సభ ఎంపీగా ఎన్నికై 8 జూన్ 2009 నుండి 18 మే 2014 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశాడు.

కరియా ముండా 14 ఆగస్టు 1977 నుండి 28 జూలై 1979 వరకు మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు & గనుల శాఖ సహాయ మంత్రిగా, అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలో 1 సెప్టెంబర్ 2001 నుండి 29 జనవరి 2004 వరకు వ్యవసాయ & గ్రామీణ పరిశ్రమల మంత్రిగా, 29 జనవరి 2003 నుండి 9 జనవరి 2004 వరకు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా, 9 జనవరి 2004 నుండి 22 మే 2004 ఇంధన వనరుల మంత్రిగా పని చేశాడు. ఆయన బీహార్, జార్ఖండ్ శాసనసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఆయన 21 సెప్టెంబర్ 2022న పిఎం కేర్స్ ఫండ్ ట్రస్టీగా నామినేట్ అయ్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (24 March 2019). "బ్యాక్ టు పెవిలియన్ : 8సార్లు ఎంపీకి టిక్కెట్ ఇవ్వని బీజేపీ" (in Telugu). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. The Hindu (21 September 2022). "Ratan Tata, Justice K.T. Thomas, Kariya Munda appointed trustees of PM CARES Fund" (in Indian English). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.