కాజల్ నిషాద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాజల్ నిషాద్
జననం (1982-06-01) 1982 జూన్ 1 (వయసు 41)
ఇతర పేర్లుకాజల్ 'స్కై' నిషాద్
వృత్తినటి, రాజకీయ నాయకురాలు
జీవిత భాగస్వామిసంజయ్ నిషాద్‌

కాజల్ నిషాద్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె నటనపై ఆసక్తితో ముంబైకి వచ్చి 2009లో 'లపతగంజ్' షోలో 'చమేలీ' పాత్రలో తన కెరీర్‌ను ప్రారంభించి సినిమాలు, టీవీ షోలలో పనిచేసింది . ఆమె ఆ తర్వాత భోజ్‌పురి సినిమా 'షాదీ బయా' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

వివాహం[మార్చు]

కాజల్ నిషాద్ యూపీలోని గోరఖ్‌పూర్‌లోని భోవాపర్‌లో చెందిన భోజ్‌పురి చిత్ర నిర్మాత సంజయ్ నిషాద్‌ని వివాహం చేసుకుంది.

రాజకీయ జీవితం[మార్చు]

కాజల్ నిషాద్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయింది.[1] ఆమె తరువాత 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కైంపియార్‌గంజ్ నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫతే బహదూర్ సింగ్ చేతిలో ఓడిపోయింది. కాజల్ నిషాద్ 2023లో జరిగిన గోరఖ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మంగళేష్ శ్రీవాస్తవ్ చేతిలో ఓడిపోయింది.[2] ఆమె 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్  నియోజకవర్గం నుండి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేయనుంది.[3]

మూలాలు[మార్చు]

  1. The Times of India (10 October 2011). "Actor kajal nishad to contest election". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  2. Hindustan Times (13 May 2023). "Gorakhpur mayor election: Confusion prevails as SP's Kajal Nishad demands recount" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.
  3. Namaste Telangana (31 January 2024). "గోరఖ్‌పూర్‌ లోక్‌సభ బరిలో నటి కాజల్‌..!". Archived from the original on 1 February 2024. Retrieved 1 February 2024.