కోవై సరళ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోవై సరళ
జననం (1962-04-07) 1962 ఏప్రిల్ 7 (వయసు 62)
వృత్తినటి
రాజకీయ పార్టీమక్కల్ నీది మయ్యం

కోవై సరళ దక్షిణ భారత సినీనటి. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది.[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఓరి నీప్రేమ బంగారం కానూ (2003) అనే సినిమాకు నంది ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకున్నది.[2]

జీవితం[మార్చు]

కోవై సరళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో ఏప్రిల్ 7, 1962న జన్మించింది.[3] చిన్నప్పుడు ఎంజీఆర్ సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకొన్నది. చదువు పూర్తయిన తర్వాత తండ్రి, సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.

ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా విజయ కుమార్, కె.ఆర్. విజయ సరసన వెల్లి రథం అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది.[4] పదో తరగతిలో ఉండగా ముంధనై ముడిచ్చు అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది. రెండు సంవత్సరాల తరువాత చిన్నవీడు అనే సినిమాలో భాగ్యరాజా పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ మహిళ పాత్రలో నటించింది.[5]

ఆమె సినిమాల్లోనే కాకుండా కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా కనిపించింది. ఈమె అవివాహిత.

కోవై సరళ నటించిన తెలుగు చిత్రాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

  1. ఉత్తమ హాస్యనటి - నంది పురస్కారం - ఓరి నీప్రేమ బంగారం కానూ (2003)

మూలాలు[మార్చు]

  1. "Tamil Nadu announces film awards for three years". indiaglitz.com. Archived from the original on 24 అక్టోబరు 2004. Retrieved 19 October 2009.
  2. "Telugu Cinema Etc – Nandi award winners list 2003". Idlebrain.com. 29 September 2004. Retrieved 6 August 2012.
  3. Chowdhary, Y. Sunita (7 January 2012). "Comedy comes naturally". The Hindu. Chennai, India. Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 14 ఏప్రిల్ 2016.
  4. "Acting is all that matters for this talented performer". The Hindu. Chennai, India. 19 April 2007. Archived from the original on 14 అక్టోబరు 2007. Retrieved 14 ఏప్రిల్ 2016.
  5. Rangarajan, Malathi (21 April 2012). "The Kovai chronicle". The Hindu. Chennai, India.
"https://te.wikipedia.org/w/index.php?title=కోవై_సరళ&oldid=4215964" నుండి వెలికితీశారు