చర్చ:వేల్పూరు (తణుకు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేల్పూరు గ్రామానికి త్రేతాయుం నుండి చరిత్ర ఉంది.

త్రేతాయుంలో విశ్వామిత్ర మహర్షి యాగం చేసిన ప్రాంతం "రేలంగి" "శ్రీ మంటలమ్మ ఆలయం" వద్ద, యాగరక్షణ కోసం రాముడు,లక్ష్మణుడు కావలి కాసిన ప్రాంతానికి "కావలిపురం" గా పేరు వచ్చింది. శ్రీ రాముడు తాటకి సంహారం చేసినపుడు తాటకి తల దూరంగా వేరొక ప్రాంతంలో రాలింది కాబట్టి ఆ ప్రదేశాన్ని "రేలంగి" అని వాడుకలో పిలుస్తున్నారు. యాగంలో మంటల నుండి వచ్చిన దేవతా అమ్మలనే "మంటలమ్మలు" గా కొలుస్తున్నాం. యాగఫలం స్వీకరించడానికి దేవతలను పిలిచిన ఊరునే "వేల్పూరు" అని పిలుస్తున్నారు. వేల్పూలు వచ్చిన ఊరు కాబట్టి "వేల్పూరు" అని పేరు వచ్చింది. వేల్పూరులో ఉన్నన్ని దేవాలయాలు వేరే ఏ ఊరిలోను ఉడవు.