టి. దామోదర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి. దామోదర్ రెడ్డి
టి. దామోదర్ రెడ్డి

ఎం. టి. దామోదర్ రెడ్డి


నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1939-07-10) 1939 జూలై 10 (వయసు 84)
అజ్మాపూర్, పెద్ద అడిసర్లపల్లి మండలం, నల్గొండ జిల్లా, తెలంగాణ
మరణం 2024 మే 13
సంతోష్ నగర్‌, హైదరాబాద్‌
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు చంద్రారెడ్డి
జీవిత భాగస్వామి సులోచన
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
మతం హిందూ, భారతీయ

తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 1980 నుండి 1984 వరకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్య[మార్చు]

దామోదర్ రెడ్డి 1939, జూలై 10న చంద్రారెడ్డి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, పెద్ద అడిసర్లపల్లి మండలంలోని అజ్మాపూర్ గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ నుండి బిఎస్సీ ఎల్.ఎల్.బి. చదివాడు. న్యాయవాదిగా కూడా పనిచేశాడు.[2]

వ్యక్తిగత జీవితం[మార్చు]

దామోదర్ రెడ్డి 1959, మే 10న సులోచనతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి బొమ్మగాని ధర్మభిక్షంపై 53,669 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4]

మరణం[మార్చు]

తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతూ 2024 మే 13న హైదరాబాద్‌ సంతోష్ నగర్‌లోని ఆయన స్వగృహంలో మరణించాడు.[5][6]

పదవులు[మార్చు]

  • 1969-1971: తెలంగాణ ప్రజా సమితి సభ్యుడు
  • 1970-1976: దేవరకొండ పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్
  • 1978: దేవరకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

మూలాలు[మార్చు]

  1. "7th Loksabha Members". www.loksabha.nic.in. Archived from the original on 2021-10-01. Retrieved 2021-11-10.
  2. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  3. "Shri T. Damodar Reddy MP biodata Nalgonda | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-28. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  4. "T. DAMODAR REDDY - NALGONDA - Lok Sabha Election Results 1980". www.electiontak.in. Archived from the original on 2021-11-10. Retrieved 2021-11-10.
  5. Andhrajyothy (14 May 2024). "నల్లగొండ మాజీ ఎంపీ దామోదర్‌రెడ్డి మృతి". Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.
  6. EENADU (14 May 2024). "మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్‌రెడ్డి కన్నుమూత". Archived from the original on 14 May 2024. Retrieved 14 May 2024.