తలశిల రఘురాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తలశిల రఘురాం

శాసనమండలి సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 డిసెంబర్ 2021 - ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1966
గొల్లపూడి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు చంద్రశేఖరరావు, బేబీ సరోజ
జీవిత భాగస్వామి స్వర్ణకుమారి
సంతానం ప్రణవి

తలశిల రఘురాం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

తలశిల రఘురామ్ 20 జూన్ 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గొల్లపూడిలో చంద్రశేఖరరావు, బేబీ సరోజ దంపతులకు జన్మించాడు. ఆయన బీకాం వరకు చదువుకున్నాడు.[1] [2]

రాజకీయ జీవితం[మార్చు]

తలశిల రఘురాం కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్.ఎస్.యు.ఐ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 1996 నుంచి 2002 వరకు కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా వివిధ హోదాల్లో పని చేశాడు.[3] తలశిల రఘురాంకు 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో 13 నవంబర్ 2021న పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ కేటాయించింది.[4] ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 8 డిసెంబర్ 2021న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు.[5] అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (13 November 2021). "కొనసాగుతున్న కొత్త విప్లవం". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  2. Andhrajyothy (13 November 2021). "విధేయత కోటాలో తలశిల రఘురాంకు ఎమ్మెల్సీ.. త్వరలో ఆయన రాజీనామా." Archived from the original on 1 January 2022. Retrieved 1 January 2022.
  3. Sakshi (23 June 2019). "వైఎస్సార్ సీపీ నేత తలశిల రఘురామ్ కు కీలక బాధ్యతలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.
  4. Eenadu (25 November 2021). "ఎమ్మెల్సీ వైకాపా అభ్యర్థులుగా తలశిల, మొండితోక". Archived from the original on 25 November 2021. Retrieved 31 December 2021.
  5. Namasthe Telangana (8 December 2021). "ప్రమాణం చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు". Archived from the original on 31 December 2021. Retrieved 31 December 2021.