దేవుడు చేసిన మనుషులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవుడు చేసిన మనుషులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి. రామచంద్రరావు
నిర్మాణం జి. హనుమంతరావు
చిత్రానువాదం వి. రామచంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ,
ఎస్.వి. రంగారావు,
జయలలిత,
విజయనిర్మల,
జగ్గయ్య,
కాంతారావు,
కాంచన,
జమున,
శారద
సంగీతం రమేష్ నాయుడు
సంభాషణలు త్రిపురనేని మహారధి
నిర్మాణ సంస్థ పద్మాలయా స్టూడియోస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దేవుడు చేసిన మనుషులు 1973 లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో ఘట్టమనేని కృష్ణ నిర్మించిన చిత్రం.[1] తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. త్రిపురనేని మహారధి రాసిన చిత్రానువాదం నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు (ఎస్వీ.రంగారావు, రామారావు మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర ), సస్పెన్స్ (కాంచన పాత్ర), క్రైమ్ (జగ్గయ్య, కాంతారావు), హాస్యం (అల్లు రామలింగయ్య, సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.

తారాగణం[మార్చు]

  • ఎన్. టి. రామారావు
  • కృష్ణ
  • ఎస్. వి. రంగారావు
  • కాంచన
  • కాంతారావు
  • జగ్గయ్య
  • అల్లు రామలింగయ్య
  • సత్యనారాయణ

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన దేవుడు చేసిన మనుషుల్లారా మీ పేరేమిటి కథ నుండి స్వీకరించబడింది. శ్రీశ్రీ రాసిన టైటిల్ పాటలో రామారావు దొంగగా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు. అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమా ప్రారంభం, ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన మసక మసక చీకట్లో పాట పాతికేళ్ళ తరువాత కూడా తెలుగు శ్రోతలకు సుపరిచితమైన పాటల్లో ఒకటిగా నిలిచింది. అనేక క్లబ్ డాన్సు పాటలకు ఇది వరవడిని సృష్టించింది. 2000 దశకంలో గాయని స్మిత విడుదల చేసిన రిమిక్స్ పాటల ఆల్బమ్ పేరు కూడా "మసక మసక" అని పెట్టారు.[2]

పాట రచయిత సంగీతం గాయకులు
దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్ళారా...వినండి మనుషుల గోల-కనండి దేవుడి లీల (రెండు సార్లు-రెండవ పాటా ఘంటసాల, బాలు కలిసి పాడారు) శ్రీశ్రీ రమేష్ నాయుడు ఘంటసాల
విన్నారా...అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరేగే మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు ఆరుద్ర రమేష్ నాయుడు ఘంటసాల, పి.సుశీల
మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి
తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను రమేష్ నాయుడు బాలు
దోర వయసు చిన్నది లాలాలహ భలే జోరుగున్నది దీని తస్సాదియ్యా రమేష్ నాయుడు బాలు, పి.సుశీల
నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది నా మనసు అదే అదే కావాలంది అనుకున్నది రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు[మార్చు]

  1. విశాలాంధ్ర. "ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు". Archived from the original on 25 ఫిబ్రవరి 2020. Retrieved 2 August 2017. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.