నరేష్ గోయెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరేష్ గోయల్
జననం (1949-07-29) 1949 జూలై 29 (వయసు 74)[1]
సంగ్రూర్, పంజాబ్, ఇండియా, డొమినియన్ ఆఫ్ ఇండియా
జాతీయతభారతీయుడు, ప్రవాస భారతీయుడు
వృత్తిజెట్ ఎయిర్‌వేస్ మాజీ ఛైర్మన్[2]
క్రియాశీల సంవత్సరాలు1967 – ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅనితా గోయల్ (మ. 2024 మే 16) [3]
పిల్లలు2; నమ్రత (కుమార్తె), నివాన్ గోయల్ (కుమారుడు) [4]

నరేష్ గోయెల్,  ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త. జెట్ ఎయిర్‌వేస్ స్థాపకుడు, చైర్మన్. 1993లో జెట్ ఎయిర్‌వేస్ను ప్రారంభించి, 2005లో షేర్ మార్కెట్లోకి దింపారు. ఫోర్బ్స్ పత్రిక నరేష్ ను భారతదేశంలో 16వ అత్యంత ధనికునిగా పేర్కొంది. ఈయన నికర విలువ 1.9బిలియన్ డాలర్లు.[5]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

1949లో పంజాబ్ లోని సంగ్రుర్ లో జన్మించారు నరేష్.[6] నగల డీలింగ్ వీరి కుటుంబ వ్యాపారం. చిన్నతనంలోనే నరేష్ తండ్రి మరణించారు. 6వ తరగతి వరకు బాలుర ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు ఆయన. ఆయన 11 ఏట ఆస్తిని కోల్పోయి, ఇంటిని వేలం కూడా వేసేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ తల్లిని ఆమె బంధువుల ఇంటికి తీసుకెళ్ళిపోయారు నరేష్. ఆ తరువాత కామర్స్ లో డిగ్రీ చదివారు ఆయన.[7]

కెరీర్[మార్చు]

1967లో, నరేష్ తన మేనమామ సేఠ్ చరణ్ దాస్ రాం లాల్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్ లో క్యాషియర్ గా కెరీర్ ప్రారంభించారు. ఆయన మొదటి జీతం నెలకు 300 రూపాయలు. డిగ్రీ పట్టా పొందాకా, లెబనీస్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ లో ట్రావెల్ వ్యాపారం మొదలు పెట్టారు.[8]

1967 నుంచి 1974 వరకు వివిధ విదేశీ ఎయిర్ లైన్స్ తో ట్రావెల్ వ్యాపారం చేసి ఆ రంగంలో మంచి నైపుణ్యం సాధించారు గోయల్. ఆ సమయంలోనే వ్యాపారం కోసం అనేక దేశాలు తిరిగి అనుభవం గడించారు ఆయన.[8]

1969లో ఇరాక్ ఎయిర్‌వేస్ కు ప్రజా సంబంధాల మేనేజర్ గానూ, 1971 నుండి 1974 వరకు రాయల్ జోర్డేనియన్ ఎయిర్‌వేస్ ఎలియాకు ప్రాంతీయ మేనేజర్ గానూ పనిచేశారు.  మధ్య ప్రాచ్య ఎయిర్ లైన్ కు చెందిన భారతీయ కార్యాలయంలో కూడా పనిచేశారు ఆయన. ఈ సమయంలో టికెటింగ్, రిజర్వేషన్ చేయడం, సేల్స్ వంటి విషయాలపై మంచి అనుభవం సంపాదించారు గోయల్.[7]  1974లో తన తల్లి వద్ద తీసుకున్న 500 యూరోలతో స్వంతంగా జెట్ ఎయిర్ అనే ఏజెన్సీని స్థాపించారు. ఈ ఏజెన్సీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కేథీ పసిఫిక్ ల ఏయిర్ లైన్స్ కు పనిచేస్తుంది.[6]

1975లో భారతదేశానికి ప్రాంతీయ మేనేజరుగా నరేష్ ను నియమించింది ఫిలిప్పైన్ ఇయిర్ లైన్[7]

జెట్ ఎయిర్‌వేస్[మార్చు]

1991లో భారతదేశ ప్రభుత్వం ద్వారా ఓపెన్ స్కైస్ పాలసీ ప్రకటన చేయబడినప్పుడు, గోయల్ భారతదేశంలో డొమెస్టిక్ ఎయిర్‌వేస్ సేవలు మొదలుపెట్టేందుకు తగిన సమయంగా భావించి జెట్ ఎయిర్‌వేస్ స్థాపనకు శ్రీకారం చుట్టారు. మే 5, 1993న జెట్ ఎయిర్‌వేస్ తన వాణిజ్య సేవలు ప్రారంభించింది.[8] విదేశీ ఎయిర్ లైన్స్ సేవలను భారతదేశంలో అందించేందుకు గోయల్ జెట్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించారు.[9]

2004-2006 సంవత్సరాలకుగానూ గోయల్ అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ (ఐఎటిఎ) బోర్డులో సేవలందించారు. 2008లో తిరిగి అదే స్థానానికి ఎన్నికై జూన్ 2016 వరకు కొనసాగారు.[8]

వ్యక్తిగత జీవితం[మార్చు]

తన కంపెనీలో పనిచేసే ఉద్యోగిని అనితను వివాహం చేసుకున్నారు నరేష్. ఆమె 1979లో మార్కెటింగ్ ఎనలిస్ట్ గా చేరి, మార్కెటింగ్, సేల్స్ కు ప్రధాన అధికారిణిగా పనిచేశారామె. పరిచయమైన 9 ఏళ్ళకు వీరు వివాహం చేసుకున్నారు.[6] వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు నివాన్ గోయల్, కూతురు నమ్రతా గోయల్[4]

అవార్డులు[మార్చు]

అవార్డు సంవత్సరం
ఎంటర్ పెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ సెప్టెంబరు 2000
పారిశ్రామికవేత్తగా ఆయన చేసిన కృషికి గానూ డిస్టింగ్విష్డ్ అల్యుమినీ అవార్డు-2000 అక్టోబరు 2000
ఇండియన్ అమెరికన్ సెంటర్ ఫర్ పొలిటికల్ ఎవేర్ నెస్ వారు ప్రప్రంచ కమ్యూనిటీకి నరేష్ చేసిన కృషిని గుర్తిస్తూ "ఔట్ స్టాండింగ్ ఏషియన్-ఇండియన్ అవార్డు" ఇచ్చారు. నవంబరు 2003
వాణిజ్య ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ఆయన కృషికిగానూ ఏరోస్పేస్ లారెల్స్ ఫర్ ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ అవార్డు వచ్చింది. ఏప్రిల్ 2000, ఫిబ్రవరి 2004
ప్రైవేట్ రంగ అభివృద్ధికి దోహదం చేస్తున్నందుకుగానూ మొట్టమొదటి బిఎంఎల్ ముంజల్ అవార్డు ప్రదానం జనవరి 6, 2006
ఎన్డీటీవి ప్రాఫిట్ బిజినెస్ అవార్డు 2006 జూలై 28, 2006
టాటా ఎ.ఐ.జి-జీవిత సాఫల్య పురస్కారం 8 సెప్టెంబరు 2007
19వ వార్షిక ట్రావెల్ ట్రేడ్ గాజెట్ లో ట్రావెల్ ఎంటర్ పెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 25 అక్టోబరు 2007
ఏవియేషన్ ప్రెస్ క్లబ్ (ఎపిసి) మేన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది ఏప్రిల్ 9, 2008
యుకె ట్రేడ్ & ఇన్వెస్ట్ మెంట్ ఎట్ ది ఇండియా బిజినెస్ అవార్డు 2008లో బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు సెప్టెంబరు 9, 2008
సి.ఎన్.బి.సి టివి18 ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్ జనవరి 22, 2009
ఇంటర్నేషనల్ ఎంటర్ పెన్యూర్స్ ఆఫ్ ది ఇయర్ గా "ఏషియన్ వాయిస్" పాఠకులచే ఎన్నిక ఫిబ్రవరి 27, 2009
ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టి.ఎ.ఎ.ఐ) వారు ఇచ్చిన జీవిత సాఫల్య పురస్కారం ఆగస్టు 2010
హోటల్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరం ఆఫ్ ఇండియా 2011 వారు ఇచ్చిన హాల్ ఆఫ్ ఫేమ్ హానర్ జనవరి 2011
బెల్జియం దేశపు ఒకానొక అత్యున్నత పౌర పురస్కారం కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లెపోల్డ్ II ప్రదానం నవంబరు 2011
వ్యాపారంలో అత్యున్నతంగా రాణిస్తున్నందుకు గానూ ఎమిటీ లీడర్ షిప్ అవార్డు ప్రదానం అక్టోబరు 2012

References[మార్చు]

  1. Joseph, Josy (2 October 2016). A Feast of Vultures—The Hidden Business of Democracy in India. Mumbai: Harper Collins.
  2. "Naresh Goyal".
  3. "క్యాన్సర్‌తో నరేష్‌ గోయల్‌ భార్య కన్నుమూత | Sakshi". web.archive.org. 2024-05-16. Archived from the original on 2024-05-16. Retrieved 2024-05-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. 4.0 4.1 Sanjai, P.R. (7 March 2013). "Companies". ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "livemint.com" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "#16 Naresh Goyal". Forbes.com. Retrieved 25 July 2013.
  6. 6.0 6.1 6.2 http://www.theguardian.com/business/2006/jul/21/theairlineindustry.india
  7. 7.0 7.1 7.2 http://www.business-standard.com/article/beyond-business/newsmaker-naresh-goyal-106012101064_1.html
  8. 8.0 8.1 8.2 8.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-05-29. Retrieved 2016-07-19.
  9. http://www.telegraph.co.uk/travel/picturegalleries/10009598/The-richest-people-in-travel.html?frame=2542673
ఉల్లేఖన లోపం: <references> లో "ET_Jet-Etihad_1" అనే పేరుతో నిర్వచించిన <ref> ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.