నవీన్ చావ్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవీన్ చావ్లా
16 వ ప్రధాన ఎన్నికల కమిషనరు
In office
2009 ఏప్రిల్ 21 – 2010 జూలై 29
అధ్యక్షుడుప్రతిభా పాటిల్
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
అంతకు ముందు వారుఎన్.గోపాలస్వామి
తరువాత వారుఎస్.వై.ఖురేషి
వ్యక్తిగత వివరాలు
జననం (1945-07-30) 1945 జూలై 30 (వయసు 78)
జాతీయతభారతీయుడు
కళాశాలయూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్
వృత్తిప్రభుత్వ ఉద్యోగి

నవీన్ చావ్లా (జననం 1945 జూలై 30) భారతదేశపు 16 వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా పనిచేసిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి, రచయిత.[1] 2009 ఏప్రిల్ మే నెలల్లో లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలోని ఐదు దశల్లో నాలుగు దశలు అతని పర్యవేక్షణలో జరిగాయి.[2]

మదర్ థెరిసా జీవిత చరిత్ర పుస్తకానికీ, 2009 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకూ నవీన్ ప్రసిద్ధి చెందాడు. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఆందోళనలు ఉన్నాయి. రాజస్థాన్, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు, తమిళనాడులో కాంగ్రెస్-మిత్ర ప్రభుత్వం చేసిన దుర్వినియోగానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నాడు.[3] అతని కుటుంబ వర్గాల కథనం ప్రకారం, చావ్లాపై మదర్ థెరిసా ప్రభావం తీవ్రంగా ఉంది. ఆమె సలహా మేరకే 1997లో సివిల్ సర్వీస్‌కు రాజీనామా చేయాలనే ఆలోచనను విరమించుకున్నాడు.[4]

ప్రారంభ జీవితం, విద్య[మార్చు]

చావ్లా 1945 జూలై 30 న న్యూఢిల్లీలో జన్మించారు. అతను 1953 నుండి 1961 వరకు హిమాచల్ ప్రదేశ్‌, సనావర్ లోని లారెన్స్ స్కూల్‌లో చదువుకున్నాడు.[5] లారెన్స్ స్కూల్‌లో తన మొదటి రెండు సంవత్సరాలు భారత ప్రభుత్వ స్కాలర్‌షిప్ పొందాడు. చావ్లా 1966లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి చరిత్రలో BA (ఆనర్స్), 1967లో లండన్ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో BA (ఆనర్స్) పట్టా అందుకున్నారు. అతను 1968లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి సోషల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా పొందాడు. చావ్లా 1996లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో క్వీన్ ఎలిజబెత్ హౌస్‌కి ఫెలోగా నియమితుడయ్యాడు.

కెరీర్[మార్చు]

చావ్లా 1969 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. భారత ప్రభుత్వ కార్యదర్శిగా అత్యున్నత స్థాయికి ఎదిగాడు. కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీకి మేజిస్ట్రేట్‌గా, తర్వాత కమిషనర్‌గా పనిచేశారు. ఢిల్లీ విద్యుత్ బోర్డు మొదటి చైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2005 లో BB టాండన్ ప్రధాన ఎన్నికల కమిషనరుగా పదోన్నతి పొందినపుడు నవీన్, ఎన్నికల కమిషనరుగా నియమితుడయ్యాడు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా ఓపెన్ స్కైస్ విధానానికి మార్గదర్శకత్వం వహించడంలో సహాయపడ్డాడు. చావ్లా 2009 ఏప్రిల్ 21 న భారతదేశ 16 వ ప్రధాన ఎన్నికల కమిషనరుగా నియమితుడయ్యాడు. 2009 సాధారణ ఎన్నికలను నిర్వహించాడు. మదర్ థెరిసా అధికారిక జీవిత చరిత్ర మదర్ థెరిసా రాశాడు. [6]

మునుపటి పదవులు[మార్చు]

అతను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, లక్షద్వీప్, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో అనేక పదవులను నిర్వహించాడు. భారత ప్రభుత్వానికి అదనపు కార్యదర్శి, కార్యదర్శి అయ్యాడు. బిజెపికి చెందిన ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఈ నియామకాలు జరిగాయి.

ప్రధాన ఎన్నికల కమిషనరుగా[మార్చు]

చావ్లా ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల సంఘం సంస్కరణలను చేపట్టాడు. ఎన్నికల కమిషనరులను తొలగించాలంటే, ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగింపుకు ఉన్నట్లుగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని ఆయన సమర్ధించాడు. తద్వారా సిఇసికి ఇచ్చిన రాజ్యాంగపరమైన రక్షణనే ఎన్నికల కమిషనరులకు కూడా కల్పించాడు.[7] తృతీయ ప్రకృతి వ్యక్తులు మగ / ఆడ గా నమోదు చేసుకోలేరు కాబట్టి వారిని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఉండేవారు కాదు. చావ్లా వారికి ఓటు హక్కు కల్పించాడు. వారు "ఇతర" అనే కొత్త వర్గంలో నమోదు చేసుకోవచ్చు. ఈ సమస్యను భువనేశ్వర్‌లోని KIIT లా స్కూల్, చెన్నైలోని ఆసియా కాలేజ్ ఆఫ్ జర్నలిజం విద్యార్థులు మొదటగా ప్రస్తావించారు.[8][9][10][11] మానవ హక్కుల పరంగా ఈ చర్యను భారతదేశంలోను, ఇతర ప్రాంతాలలోనూ అనేక ఇతర సంస్థలు అనుసరించాయి. భారతదేశంలో విచారణలో ఉన్న ముద్దాయిలు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడాన్ని అతను సమర్ధించాడు. ముఖ్యంగా శిక్ష పడిన దోషులు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం, ఎన్నికలలో పోటీ చెయ్యడం చెయ్యగలిగినపుడు విచారణలో ఉన్న ముద్దాయిలకు కూడా ఓటు వేసే అవకాఅశం ఉండాలని అతను భావించాడు.[12] కుష్టు రోగులను వోటర్ల జాబితాలో చేర్పించాడు. బ్రెయిలీ తెలిసిన అంధఓటర్లను స్వతంత్రంగా ఓటు వేయమని ప్రోత్సహించాడు.

మదర్ థెరిసాతో అనుబంధం[మార్చు]

మదర్ థెరిసాచే బాగా ప్రభావితమై, అత్యధికంగా అమ్ముడైన ఆమె జీవిత చరిత్రను (14 భాషల్లోకి అనువదించబడింది) రాశాడు. దాదాపు 5 లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. పుస్తకంపై వచ్చిన రాయల్టీల్లో గణనీయమైన భాగాన్ని కుష్టు వ్యాధి నివారణ కోసం విరాళంగా ఇచ్చాడు. ఆమె ప్రభావం కారణంగా, అతను రెండు NGO లను స్థాపించాడు. ఇవి, కుష్టు రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడం, వారి ఆరోగ్యవంతమైన పిల్లలకు ఉచిత వృత్తి శిక్షణను అందించడం చేస్తాయి. ఇందులో ప్రముఖ బ్యూటీషియన్ షహనాజ్ హుస్సేన్ ఉచితంగా అందజేసే బ్యూటీ శిక్షణ, అలాగే కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల లోని వికలాంగులైన పిల్లలకు ఉచిత విద్య అందింస్తాయి. ప్రస్తుతం, అలాంటి 130 మంది పిల్లలు, యువత ఢిల్లీలోని లెప్రా ఇండియా ట్రస్ట్ స్కూల్‌లో చదువుతున్నారు.

సామాజిక కృషి[మార్చు]

చావ్లా జైపూర్‌కు చెందిన లాలా చమన్ లాల్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు వ్యవస్థాపక ఛైర్మన్. దీనిని 'దర్శన్' అని పిలుస్తారు. ఇది వినికిడి లోపం ఉన్న పిల్లలకు చదువు చెప్పిస్తుంది. దీనికి కాంగ్రెస్ ఎంపీలు ఐమదుద్దీన్ ఖాన్, RP గోయెంకాల నుండి MPLADS నిధులు వచ్చాయి. ఇది మొత్తం వ్యయంలో 20% మాత్రమే. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ట్రస్టుకు 6 ఎకరాల భూమి కేటాయించింది.[13][14] చావ్లా ఛైర్మన్‌గా ఉన్న ఈ 'దర్శన్ స్కూల్'లో 52 మంది వినికిడి లోపం ఉన్న పిల్లలు చదువుకుంటున్నారు. తీవ్రంగా వినికిడి లోపం ఉన్న 20-30 మంది బాలబాలికలకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ నేర్పించి ఉపాధికి సహాయం చేస్తారు. స్టార్‌కీ కార్పొరేషన్ అందించే వినికిడి పరికరాలతో సహా అన్ని సేవలు ఉచితం.

కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణలు[మార్చు]

2006 మార్చిలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, చావ్లాను తొలగించాలని కోరుతూ 200 మంది ఎంపీలు సంతకం చేసిన మెమోరాండమ్‌ను భారత రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాంకు సమర్పించింది. భారత జాతీయ కాంగ్రెస్‌తో అతనికి సంబంధాలున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ మెమోరాండం అతని నిష్పాక్షికతను ప్రశ్నించింది.[15] దీన్ని ప్రభుత్వం తిరస్కరించింది.

గాంధీ కుటుంబంతో చావ్లాకు ఉన్నట్లుగా వచ్చిన ఆరోపణల గురించి భయపడి, 2006 మేలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు జస్వంత్ సింగ్, కాంగ్రెస్ రాజకీయ నాయకులతో జీవితకాల అనుబంధం MPLADS వివాదం కారణంగా చావ్లాను ఎన్నికల కమిషనర్‌గా తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.[16] ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్ గోపాలస్వామి సుమోటోగా, పూర్తి కమిషన్ను గానీ, ఎన్నికల కమిషనర్ ఖురైషీని గానీ సంప్రదించకుండా, ఎన్నికల కమిషనర్ (EC)ని తొలగించే అధికారం తనకు ఉందని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. దీంతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. సుప్రీం కోర్టు తన తీర్పులో, "మేము అన్ని ప్రశ్నలను [పిటీషన్లలో లేవనెత్తిన] తెరిచి ఉంచుతూనే పిటిషన్ల ఉపసంహరణను అనుమతిస్తున్నాము. వారు సిఇసి కి అభ్యర్థన ఇవ్వవచ్చు. దానిపై సిఇసి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది. దీనిపై మేము ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదు" అని చెప్పింది.[17]

2009 జనవరి 31 న, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ N. గోపాలస్వామి అసాధారణమైన రీతిలో, పూర్తి కమీషన్ను గానీ, కమీషనర్ ఖురైషీని గానీ సంప్రదించకుండానే తన ప్రైవేట్ ఛాంబర్‌లో ఒక ఎన్‌డిఎ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాడు. దాని ఆధారంగా, ఎన్నికల కమిషనర్‌గా చావ్లా తొలగింపు గురించి భారత రాష్ట్రపతికి సిఫార్సు పంపాడు. [18] చావ్లా ఎన్నికల కమిషనరుగా తన బాధ్యతలను పక్షపాత ధోరణిలో నిర్వర్తించాడని, "ఒక పార్టీ" ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాడనీ అందులో ఆరోపించాడు. ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన కొంత సమాచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధికారులకు చావ్లా ఇచ్చాడని సీఈసీ ఆరోపించింది.[19] బెల్జియం నుంచి సన్మానాలు స్వీకరించినందుకు సోనియా గాంధీకి ఎన్నికల సంఘం ఇవ్వదలచిన నోటీసును కూడా ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.[20] చావ్లా, ఖురేషీలు వ్యతిరేకించడంతో సోనియా గాంధీపై వచ్చిన ఫిర్యాదు 2-1 మెజారిటీతో వీగిపోయింది.

సి ఇ సి N. గోపాలస్వామ్ చావ్లాకు వ్యతిరేకంగా చేసిన సిఫార్సు, వివాదాస్పదంగా ఉందని ఫాలీ నారిమన్‌తో సహా పలువురు ప్రముఖ న్యాయనిపుణులు భావించారు.[21] ఆ సిఫార్సును భారత రాష్ట్రపతి తిరస్కరించారు. చావ్లా 2009 ఏప్రిల్ 20 న భారతదేశ సిఇసి అయిమ్, 2009 భారత పార్లమెంటరీ ఎన్నికలను నిర్వహించాడు.[22]

చావ్లా సిఇసి కాకుండా ఆడ్డుకోడానికి, ఇద్దరు BJP లాయర్లు, ఆఫీస్ బేరర్లు జైపూర్‌లోని చావ్లా ట్రస్టులకు 2006 ళొ జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా జరిగిన భూమి కేటాయింపుపై చావ్లా, రాజస్థాన్ ప్రభుత్వ సీనియర్ అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యాలని స్థానిక జైపూర్ కోర్టులో పిటిషన్ వేయడానికి ప్రయత్నించారు. FIR దాఖలు చేయమని ఆదేశించడానికి కోర్టు నిరాకరించింది; 2009 ఫిబ్రవరి 10 నాటి ఉత్తర్వులో న్యాయస్థానం, పోలీసుల విచారణలో తప్పేమీ జరగలేదని తేలడంతో సంతృప్తి చెందామని పేర్కొంటూ, ఫిర్యాదును కొట్టివేసింది. [23][24] ఎమర్జెన్సీ సమయంలో జరిగిన దురాగతాలపై విచారణ జరిపిన షా కమీషన్ (భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జయంతిలాల్ ఛోటాలాల్ షా నేతృత్వంలోని స్వతంత్ర కమిషను) తన తుది నివేదికలో, "ఇతరుల పట్ల న్యాయమైన వైఖరి, పరిగణన అవసరమయ్యే ఏ ప్రభుత్వ కార్యాలయాన్నీ నిర్వహించడానికి" చావ్లా అనర్హుడని పేర్కొంది.[25][26][27][28][29][30] అయితే ఢిల్లీ హైకోర్టు (న్యాయమూర్తి టిపిఎస్ చావ్లా) షా కమిషన్ నివేదికను తోసిపుచ్చింది.

పురస్కారాలు[మార్చు]

  • ఇటలీ ప్రభుత్వం నుండి 2005 మజ్జిని అవార్డు "ఇటలీతో కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడానికీ, ఇప్పటికే ఉన్న బంధాలను బలోపేతం చేయడానికీ అతను చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా " ది హిందూ . 18 మార్చి 2005. మూలం Archived 2005-04-05 at the Wayback Machine నుండి 5 ఏప్రిల్ 2005 న ఆర్కైవు చేసారు . 8 ఏప్రిల్ 2006న తిరిగి పొందబడింది .
  • 2004 లో న్యూ ఢిల్లీ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి పురస్కారం
  • NDTV-ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2009
  • NDTV-ఐకాన్ ఆఫ్ ది ఇయర్ 2013
  • 2014లో - ముంబై లోని భారతీయ విద్యాభవన్ వారిచే ఎన్నికల నిర్వహణకు గాను పురస్కారం

మూలాలు[మార్చు]

  1. J Balaji (29 July 2010). "News / National : Chawla demits office; Quraishi to take over". The Hindu. India. Retrieved 18 October 2011.
  2. "The wonder that is India's election". The Times of India. 15 May 2009. Archived from the original on 24 October 2012. Retrieved 18 October 2011.
  3. "EC code not letting me work, will move SC, says Assam CM". The Indian Express. India. 25 April 2009. Retrieved 18 October 2011.
  4. "Standing up to be counted". Hindustan Times. India. 6 March 2009. Archived from the original on 11 May 2009. Retrieved 18 October 2011.
  5. Chief Election Commissioner of India Archived 3 మార్చి 2016 at the Wayback Machine at indian-elections.com. Retrieved 14 March 2012
  6. Muggeridge, Malcolm (1996). Mother Teresa (9781852309114): Navin Chawla: Books. ISBN 1852309113.
  7. "National : Impeachment for ECs too, says CEC". The Hindu. India. 18 November 2009. Archived from the original on 7 November 2012. Retrieved 18 October 2011.
  8. "The Hindu : Opinion / Editorial : Legitimising the other". The Hindu. Chennai, India. 18 November 2009. Retrieved 18 October 2011.
  9. "The Hindu : Opinion / Letters : Legitimising the other". The Hindu. 19 November 2009. Retrieved 18 October 2011.
  10. Our Special Correspondent (13 November 2009). "The Telegraph Calcutta (Kolkata) | 'Other' gender enters poll rolls". The Telegraph. Kolkota, India. Archived from the original on 2 December 2009. Retrieved 18 October 2011.
  11. "EC's decision comes as big reprieve for eunuchs". 22 November 2009. Archived from the original on 3 March 2016. Retrieved 2009-12-15.
  12. "Undertrials must get right to vote: Election Commission". The Times of India. 23 November 2009. Archived from the original on 25 October 2012. Retrieved 18 October 2011.
  13. "The Tribune, Chandigarh, India – Nation". The Tribune. India. Retrieved 18 October 2011.
  14. "The Hindu : National : Navin Chawla denies any conflict of interest, presents details of trust funding". Hinduonnet.com. Archived from the original on 18 March 2011. Retrieved 18 October 2011.{{cite web}}: CS1 maint: unfit URL (link)
  15. Express news service. "President rejects CEC advice, Navin Chawla stays". Express India. Archived from the original on 2 October 2012. Retrieved 18 October 2011.
  16. [1] Archived 11 మార్చి 2007 at the Wayback Machine
  17. "National: Navin Chawla case: BJP withdraws petition in Supreme Court". The Hindu. India. 8 August 2007. Archived from the original on 24 December 2011. Retrieved 18 October 2011.
  18. [2] Archived 7 ఫిబ్రవరి 2009 at the Wayback Machine
  19. "Chawla's loo breaks led to Cong phone calls: CEC". Rediff.com. Retrieved 18 October 2011.
  20. "CEC accuses Chawla of siding with one party". The Economic Times. 1 February 2009. Retrieved 18 October 2011.
  21. "The Asian Age | Home". Archived from the original on 2 April 2008. Retrieved 2011-02-02.
  22. Balaji, J. (22 April 2009). "Navin Chawla takes over as CEC". The Hindu. Vol. 132, no. 95. Chennai, India. p. 1. Archived from the original on 25 April 2009. Retrieved 23 April 2009.
  23. Rajasthan Patrika 28.01.10
  24. Dainik Bhaskar 28.01.10
  25. "Is India's first minority PM secular?". Archived from the original on 27 September 2013. Retrieved 2013-05-27.
  26. "Unfair to impute motives to CEC – Rediff.com India News". Rediff.com. 2 February 2009. Retrieved 18 October 2011.
  27. [3] Archived 2 జనవరి 2010 at the Wayback Machine
  28. "Transcending bounds of honesty | English". The Nation. Pakistan. 7 April 2009. Archived from the original on 10 April 2009. Retrieved 18 October 2011.
  29. "House rocked over proposed ordinance". The Times of India. 22 March 2006. Archived from the original on 11 August 2011. Retrieved 18 October 2011.
  30. pg.165 Political mobilisation and democracy in India: states of emergency By Vernon Hewitt, Vernon Marston Hewitt