నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి (1915-1978) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసేవకుడు, విద్యావేత్త. ఇతడి సేవలను గుర్తించి భారతప్రభుత్వం 1969లో ఇతనికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేసి గౌరవించింది.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు నెల్లూరు జిల్లా, వాకాడులో 1915, జనవరి 15వ తేదీన నేదురుమల్లి వెంకటరెడ్డి, సీతమ్మ దంపతులకు పదవ సంతానంగా జన్మించాడు. ఇతడు సి.రామానుజ మొదలియార్, కఱ్ఱా సీతారామయ్య, జాన్ దయాళు, పాటూరు సుబ్రహ్మణ్యశాస్త్రి మొదలైన ఉపాధ్యాయుల వద్ద చదువు నేర్చుకున్నాడు. ఇతడు సూళ్ళూరుపేటలో మూడవ ఫారం వరకు మాత్రమే చదువుకున్నాడు.

సంస్థలు[మార్చు]

ఇతడు వాకాడులోను చుట్టుపక్కల గ్రామాలలోను అనేక సంస్థలు నడిపాడు. వాటిలో కొన్ని[1]:

  • నేదురుమల్లి వెంకటరెడ్డి మెమోరియల్ బేసిక్ ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల
  • హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘము
  • హరిజన విద్యార్థి వసతి గృహము
  • ఎల్లశిరి ఫిర్కా హైస్కూలు
  • ఎస్.ఎ.ఎల్.సి. ఉన్నత పాఠశాల
  • ఆంధ్ర విద్యార్థి శరణాలయము
  • డి.ఇ.ఎల్.మిషన్ స్కూలు
  • సీతమ్మ పారిశ్రామిక పాఠశాల
  • కాళిదాస బాలుర వసతి గృహము

మొదలైనవి.

మూలాలు[మార్చు]